న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలమే అర్జున అవార్డు అని భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అభివర్ణించాడు. ఈ అవార్డు పట్ల తనకంటే కూడా కుటుంబం, ముఖ్యంగా భార్య ప్రతిమా సింగ్ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నట్లు ఇషాంత్ పేర్కొన్నాడు.
(చదవండి : మెరుపు రత్నాలు)
‘అర్జున అవార్డు నన్ను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉన్నా. నాపై నాకే చాలా గర్వంగా ఉంది. నా కుటుంబం కూడా ఎంతో గర్విస్తోంది.’ అని ఇషాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 2007లో భారత జట్టులోకి అడుగుపెట్టిన ఇషాంత్... ఇప్పటివరకు 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20లు ఆడాడు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆన్‌లైన్‌లో నిర్వహించే కార్యక్రమం ద్వారా అవార్డులను అందజేస్తారు.
(చదవండి : ఉసేన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment