
టోక్యో: జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు దివిజ్ శరణ్, రోహన్ బోపన్న జోడీలకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో దివిజ్ శరణ్–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 3–6తో రెండో సీడ్ నికొలస్ మహుట్–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో... రోహన్ బోపన్న–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జోడీ 4–6, 7–5, 9–11తో నికోలా మెక్టిక్–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయాయి. క్వార్టర్స్‌లో ఓడిన దివిజ్, బోపన్న జంటలకు 15,500 డాలర్ల (రూ. 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment