ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది.
క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.
సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్‌లో నిలిచాడు.
డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్‌లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment