Srivalli rashmika
-
భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక
మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి 302వ స్థానంలో నిలిచింది. మూడు నెలలుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి ఏకంగా 18 స్థానాలు పడిపోయి 304వ ర్యాంక్‌కు చేరుకోవడం రషి్మకకు కలిసొచి్చంది. భారత్‌కే చెందిన అంకిత రైనా 306వ ర్యాంక్‌లో, వైదేహి 405వ ర్యాంక్‌లో ఉన్నారు. -
రష్మిక జోడీకి నిరాశ
సిడ్నీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 0–6తో టాప్ సీడ్ డెస్టనీ–మ్యాడిసన్ ఇంగ్లిస్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేమ్‌లు మాత్రమే గెలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక
అడిలైడ్ (ఆ్రస్టేలియా): ప్లేఫోర్డ్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయ భమిడిపాటి శ్రీవల్లి రషి్మక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 303వ ర్యాంకర్ రష్మిక 6–4, 6–1తో గాబ్రియేలా (ఆ్రస్టేలియా)పై గెలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రషి్మక–వైదేహి ద్వయం 4–6, 6–7 (5/7)తో యుకీ నైటో–నహో సాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
రష్మిక ఓటమి.. సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. సుమిత్ నగాల్ ర్యాంక్ 93... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్‌లో నిలిచాడు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్‌లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. -
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక అర్హత
Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 521వ ర్యాంకర్ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఆరు ఏస్‌లు సంధించింది. వరల్డ్ గ్రూప్-1లో భారత్ డేవిస్‌కప్ టోర్నీలో భారత పురుషుల టెన్నిస్ జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్‌తో ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో 4–0తో గెలుపొందింది. చదవండి: భారత్‌కు మరో ఓటమి భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఏకైక గోల్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ రెండు గోల్స్, ఫేవాన్‌డెర్ ఒక గోల్ సాధించారు. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
ITF womens tennis tournament: రన్నరప్‌గా శ్రీవల్లి – వైదేహి జోడి
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) – ప్రొ సర్క్యూట్ 25 వేల డాలర్ల మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జోడి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని నకోన్ సి తమారట్లో శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ రష్మిక – వైదేహి చౌదరి (భారత్) జంట 6–7 (6/3), 1–6 స్కోరుతో భారత్‌కే చెందిన రెండో సీడ్ రుతుజ భోసలే (భారత్) – ఎరికా సేమ (జపాన్)చేతిలో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో సహజ 6–2, 6–1తో పియాంగ్‌టర్న్ ప్లిప్యూ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌కే చెందిన మనచాయ సవాంగ్కేతో సహజ తలపడుతుంది. -
Aquatic Championship: రజతం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి. -
రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–7 (5/7), 7–5, 5–10తో హెసీ అమండైన్ (ఫ్రాన్స్)–దాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) జోడీ చేతిలో... సహజ–సోహా సాదిక్ (భారత్) ద్వయం 4–6, 6–7 (3/7)తో ఎలీనా టియోడోరా (రొమేనియా)–డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. రెండో సీడ్ అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 5–7, 6–3, 10–6తో షర్మదా బాలు (భారత్)–సారా రెబెకా (జర్మనీ) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)–పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక; అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–0తో రియా భాటియా (భారత్)పై గెలిచింది. రష్మిక తొలి సెట్ గెలిచాక రియా గాయం కారణంగా వైదొలగడంతో రెండో సెట్‌ను నిర్వహించలేదు. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 4–6, 6–4, 10–8తో శ్రావ్య శివాని–జెన్నిఫర్ (భారత్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. తొలి రౌండ్లో సౌజన్య–షర్మదా (భారత్) జోడీ 6–4, 7–6 (11/9)తో సహజ–సోహా (భారత్) జంటను ఓడించింది. అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2023 సీజన్‌ను అడిలైడ్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీ ద్వారా ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ టోర్నీలో సానియా కజకిస్తాన్ ప్లేయర్ అన్నా డానిలినాతో కలిసి డబుల్స్ విభాగంలో బరిలోకి దిగనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారిణుల జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది సానియా 16 టోర్నీలలో పోటీపడగా... రెండు టోర్నీలలో (చార్ల్స్టన్ ఓపెన్, స్ట్రాస్‌బర్గ్ ఓపెన్) రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆమె 26 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
ఎక్కడైనా తగ్గేదేలే అంటున్న పుష్ప.. ట్రెండ్ సెట్ చేస్తానంటున్న శ్రీవల్లి
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె పాన్ ఇండియా నటిగా మారిపోయింది. పుష్పకు ఈ రేంజ్లో గుర్తింపు రావడానికి ఇందులోని పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఈ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. యూట్యూబ్‌లో అయితే పుష్ప సాంగ్స్ ఓ రేంజ్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయిన పాటల్లో శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత రెండో స్థానంలో బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు సాంగ్ నిలిచింది. 2022లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో టాప్ టెన్ సాంగ్స్ ఏవో ఓ లుక్కేద్దాం పదండి. తాజాగా ఆ జాబితాను యూట్యూబ్ విడుదల చేసింది. టాప్ 10 సాంగ్స్ ఇవే.. 1. శ్రీవల్లి- పుష్ప 2. అరబిక్‌కుత్తు- బీస్ట్ 3. సామి సామి- పుష్ప 4. కచ్చా బాదం- ఆల్బమ్ 5. లే లే ఆయీ కోకకోలా- ఆల్బమ్ 6. ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా- పుష్ప(హిందీ) 7. ఊ.. అంటావా మావ ఊహూ అంటావా-పుష్ప 8. కోక్ స్టూడియో, ఆల్బమ్ 9. అరబిక్ కుత్తు (వీడియో సాంగ్)-బీస్ట్ 10. కేసరి లాల్ న్యూ సాంగ్- సంగీతం: కన్హయ్య కుమార్ యాదవ్ -
Bengaluru Open: సెమీస్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 7–6 (7/3)తో వ్లాదిస్లావ్ ఒర్లోవ్ (ఉక్రెయిన్)–కాయ్ వెనల్ట్ (జర్మనీ) జోడీపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–3, 4–6, 11–9తో కలోవెలోనిస్ (గ్రీస్)–మత్సుయ్ (జపాన్) జంటను ఓడించి సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు రష్మిక, సామ సాత్విక, శ్రావ్య శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. గురుగ్రామ్‌లో గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–2, 6–2తో హుమేరాపై, సాతి్వక 7–6 (7/1), 7–5తో స్మృతి భాసిన్‌పై గెలిచారు. పూజా ఇంగ్లేతో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక–హుమేరా జంట 7–5, 2–6, 10–7తో షర్మదా బాలు–శ్రావ్య శివాని జోడీని ఓడించి సెమీఫైనల్ చేరింది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక, నిధి, సాత్విక
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, నిధి చిలుముల, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–1, 6–4తో హుమేరా బహార్మస్ (భారత్)పై, నిధి 4–6, 6–4, 10–6తో జెన్నిఫర్ ల్యుఖమ్ (భారత్)పై, సాత్విక 6–0, 6–1తో సౌమ్య (భారత్)పై, శ్రేయ 6–1, 6–2తో ఎలీనా (డెన్మార్క్)పై గెలిచారు. -
Srivalli Rashmika:: ముగిసిన శ్రీవల్లి రష్మిక ప్రయాణం
Rashmika Srivalli : ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రయాణం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–7 (4/7), 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో నిక్కీ 6–4, 6–2తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో టోర్నీ మూడో సీడ్ శ్రావ్య శివాని–షర్మదా బాలు (కర్ణాటక) 6–1, 3–6, 10–7తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల– స్నేహల్ మానే (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో నిక్కీ పూనాచా–ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) 6–4, 7–5తో పారస్ దహియా (హరియాణా)– ఇక్బాల్ (వెస్ట్‌బెంగాల్) ద్వయంపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక..
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్మిక 6–2, 6–2తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములపై అలవోకగా గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం రెండో రౌండ్లో ముగిసింది. షర్మదా బాలు (కర్ణాటక)తో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 7–5తో గెలిచి, రెండో సెట్‌ను 1–6తో కోల్పోయింది. మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా శ్రావ్య శివాని వైదొలిగింది. మరో మ్యాచ్‌లో తటవర్తి శ్రేయ (ఆంధ్రప్రదేశ్) 6–2, 3–6, 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో... స్మృతి భాసిన్ (తెలంగాణ) 4–6, 1–6తో ఆకాంక్ష (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు. విష్ణు పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రెండో రౌండ్లో నిక్కీ 6–4, 6–3తో ఫైజల్ కమర్ (రాజస్తాన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ‘లండన్ ఒలింపియన్’ విష్ణువర్ధన్ (తెలంగాణ) 4–6, 1–6తో నితిన్ కుమార్ సిన్హా (పశి్చమ బెంగాల్) చేతిలో... కాజా వినాయక్ శర్మ (ఆంధ్రప్రదేశ్) 4–6, 6–7 (2/7)తో సిద్ధార్థ్ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయారు చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
విజేత భమిడిపాటి శ్రీవల్లి రష్మిక
గురుగ్రామ్ (హరియాణా): ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రష్మిక 6–2, 7–6 (7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో రష్మిక తన ప్రత్యర్థులకు కేవలం ఒక సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. వైదేహితో జరిగిన ఫైనల్లో రష్మిక తొలి సెట్లోని రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రష్మిక తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో రష్మికకు గట్టిపోటీ ఎదురైంది. 4–5తో సెట్ కోల్పోయే స్థితిలో తొమ్మిదో గేమ్‌లో వైదేహి సర్వీస్‌ను బ్రేక్ చేసిన రష్మిక స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో రష్మిక పూర్తి ఆధిపత్యం చలాయించి కేవలం రెండు పాయింట్లు కోల్పోయి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అర్జున్ ఖడే (మహారాష్ట్ర) 6–3, 6–4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. -
మెయిన్ డ్రా పోటీలకు రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ మహిళల టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రా పోటీలకు తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక అర్హత సాధించింది. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన రషి్మక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్లో శ్రీవల్లి రష్మిక 9–2తో ఈశ్వరి (మహారాష్ట్ర)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 9–0తో అద్రిజా బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్)ను ఓడించింది. తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో 6–0, 6–2తో కిరణ్ కల్కల్ (ఢిల్లీ)పై గెలుపొంది మెయిన్ డ్రాలో అడుగుపెట్టింది. -
చాంపియన్ శ్రీవల్లి రష్మిక
చెన్నై: తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక జాతీయ జూనియర్ క్లే కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో శనివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో శ్రీవల్లి 7–6(7/3), 2–6, 6–1తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. టైటిల్ కోసం ఇరువురు క్రీడాకారిణులు తీవ్రంగా శ్రమించారు. పోటాపోటీగా సాగిన మొదటిసెట్‌ను శ్రీవల్లి టై బ్రేక్‌లో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో పుంజుకున్న రేష్మా మరూరి 6–2తో సెట్‌ను కైవసం చేసుకుంది. విజేతను తేల్చే మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీవల్లి సెట్‌ను 6–1తో గెలిచి మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
ఫైనల్లో శ్రీవల్లి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో జరుగుతున్న జాతీయ జూనియర్ క్లే కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరి అదరగొట్టింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీవల్లి 6–3, 7–5తో టోర్నీ ఎనిమిదో సీడ్ క్రీడాకారిణి సారా దేవ్ (పంజాబ్)ను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. ఆట ఆద్యంతం అద్భుతంగా ఆడిన శ్రీవల్లి వరుస సెట్లల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–0, 7–6 (1)తో టాప్ సీడ్ శివాని అమినేనిపై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జటవపోర్నవీత్ పిమ్రద (ఐదో సీడ్)తో రష్మిక తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–3, 6–3తో అనన్య గోయెల్‌పై గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జగ్మీత్ కౌర్‌ను ఓడించింది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ శివాని అమినేని 6–3, 6–4తో సారా దేవ్‌పై నెగ్గింది. -
శ్రీవల్లి రష్మిక ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మా యి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. దుబాయ్‌లోని ఏవియేషన్ క్లబ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీస్‌లో ఓట మి పాలైంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో రష్మిక 6–1, 2–6, 2–6తో హనియా అబుల్సాద్ (ఈజిప్ట్) చేతిలో పరాజయం చవిచూసింది. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. దుబాయ్‌లోని ఏవియేషన్ క్లబ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–2, 6–4తో ముస్కాన్‌గుప్తా (భారత్)పై గెలుపొందింది. పాంజల, నిధి ఓటమి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల డబుల్స్ తొలి క్వార్టర్స్ మ్యాచ్‌లో రుతుజా భోస్లే– ప్రాంజల (భారత్) ద్వయం 5–7, 5–7తో మూడో సీడ్ లీ చి పెయ్ (చైనీస్ తైపీ)– యానా సిజికోవా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో నిధి– ప్రేరణ బాంబ్రీ (భారత్) జంట 6–4, 5–7, 2–10తో జీల్ దేశాయ్ (భారత్)– బున్వాయి థాంచవత్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.