
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ముందంజ వేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–1, 6–4తో ఎవెలినా కొంటారెవా (రష్యా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండోరౌండ్‌లో రష్మిక 6–1, 6–0తో పి కోర్సుబ్ (థాయ్‌లాండ్)ను ఓడించింది.