
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)–పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment