అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సహజ (భారత్)–జిబెక్ కులమ్‌బయేవా (కజకిస్తాన్) జోడీ 1–6, 7–5, 8–10తో అరియానా–కేలా క్రాస్ (కెనడా) జంట చేతిలో ఓడిపోయింది.
ఈ ఏడాది ఐటీఎఫ్ టోర్నీ లో సహజ రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. జూలైలో ఇండియానాలో జరిగిన ఇవాన్స్‌విల్లె టోర్నీలో సహజ–హిరోకో (జపాన్) ద్వయం ఫైనల్లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment