ప్రపంచ 134వ ర్యాంకర్‌పై విజయం
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 6–1తో ప్రపంచ 134వ ర్యాంకర్, నాలుగో సీడ్ మరియా తిమోఫీవా (రష్యా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో సహజ తలపడుతుంది. మరోవైపు భారత నంబర్‌వన్ అంకిత రైనా పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో అంకిత 1–6, 3–6తో తాత్యానా మరియా (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment