సహజ సంచలనం | Haja Yamalapalli advances to quarterfinals | Sakshi
Sakshi News home page

సహజ సంచలనం

Published Fri, Jan 3 2025 3:41 AM | Last Updated on Fri, Jan 3 2025 3:41 AM

Haja Yamalapalli advances to quarterfinals

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సహజ 5–7, 6–0, 6–2తో మూడో సీడ్‌ హీన్‌ షి (చైనా)పై సంచలన విజయం సాధించింది. 

2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో సహజ 6–3, 6–4తో కమోన్‌వన్‌ యోద్‌పెచ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement