
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ మహిళల టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రా పోటీలకు తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక అర్హత సాధించింది. న్యూఢిల్లీలోని ఆర్‌కే ఖన్నా స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన రషి్మక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్‌లో శ్రీవల్లి రష్మిక 9–2తో ఈశ్వరి (మహారాష్ట్ర)పై గెలుపొందగా... రెండో రౌండ్‌లో 9–0తో అద్రిజా బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్)ను ఓడించింది. తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్‌లో 6–0, 6–2తో కిరణ్ కల్కల్ (ఢిల్లీ)పై గెలుపొంది మెయిన్ డ్రాలో అడుగుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment