
సెమీస్‌లో ఓడిన శ్రీవల్లి రష్మిక
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) జూనియర్స్ అండర్–18 గ్రేడ్–3 సౌత్ సెంట్రల్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం సెమీస్‌లో ముగిసింది. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్‌కు షాకిచ్చి ఆకట్టుకున్న రష్మిక సెమీస్‌లో 3–6, 3–6తో ఐదో సీడ్ విక్టోరియా అలెన్ చేతిలో పరాజయం పాలైంది.
జింబాబ్వేలో జరుగుతోన్న ఈ టోర్నీ క్వార్టర్స్‌లో రష్మిక 7–5, 6–1తో అనా గ్రాస్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో టాప్ సీడ్ హాల ఖాలేద్ (ఈజిప్ట్)ను కంగుతినిపించింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో 6–1, 6–1తో కవోమి (జింబాబ్వే)ను చిత్తుగా ఓడించింది.