
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) – ప్రొ సర్క్యూట్ 25 వేల డాలర్ల మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జోడి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని నకోన్ సి తమారట్‌లో శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ రష్మిక – వైదేహి చౌదరి (భారత్) జంట 6–7 (6/3), 1–6 స్కోరుతో భారత్‌కే చెందిన రెండో సీడ్ రుతుజ భోసలే (భారత్) – ఎరికా సేమ (జపాన్)చేతిలో ఓటమిపాలైంది.
మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో సహజ 6–2, 6–1తో పియాంగ్‌టర్న్ ప్లిప్యూ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌కే చెందిన మనచాయ సవాంగ్‌కేతో సహజ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment