సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్‌దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు.
క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment