aquatic championship
-
స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో కొత్త ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి. కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం.. ఆమె పరిస్థితి విషమం నైరోబి: కెన్యా స్టార్ అథ్లెట్, పురుషుల మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొలి్పన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కిప్టమ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొడుతూ బలంగా చెట్టును ఢీకొంది. దుర్ఘటన సమయంలో కోచ్ హకిజిమానా, ఓ మహిళ కారులో ప్రయాణించగా... కిప్టమ్, కోచ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మహిళను హాస్పిటల్లో చేరి్పంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. 24 ఏళ్ల కిప్టమ్ త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు. అయితు, లక్ష్య చేరుకోకుండానే అతడు మృత్యువాతపడటం విషాదం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన షికాగో మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు; 2గం:00:35 సెకన్లు) కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఏప్రిల్‌లో జరిగిన లండన్ మారథాన్లోనూ కిప్టమ్ స్వర్ణ పతకం సాధించాడు. -
Aquatic Championship: రజతం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మూడో పతకం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి రజత పతకం గెలిచింది. వ్రితి 9ని:17.62 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 9ని:15.59 సెకన్లు) స్వర్ణం, అనన్య (మహారాష్ట్ర; 9ని:24.67 సెకన్లు) కాంస్యం నెగ్గారు. క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయిలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి తమ భాగస్వాములతో కలిపి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. థాయ్‌లాండ్‌లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–1, 6–3తో పవిని –జులాలక్ (థాయ్‌లాండ్) జంటపై... సహజ–సోహా (భారత్) జోడీ 6–3, 3–6, 10–6తో ఆన్ యుజిన్ (కొరియా)–ఇకుమి (జపాన్) ద్వయంపై గెలిచాయి. -
స్విమ్మర్ శివానికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా మూడు పతకాలతో మెరిసింది. గుజరాత్లో జరుగుతున్న ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల శివాని అండర్–11 బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించింది. శివాని 34.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్ రేసును శివాని 1ని:14.81 సెకన్లలో ముగించి రజత పతకం గెలిచింది. అనంతరం 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో శివాని, అన్నిక దెబోరా, మేఘన నాయర్, వేములపల్లి దిత్యా చౌదరీలతో కూడిన తెలంగాణ బృందం 2ని:12.31 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గచ్చిబౌలిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) స్విమ్మింగ్‌పూల్‌లో కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద గత ఐదేళ్లుగా శివాని శిక్షణ తీసుకుంటోంది. చదవండి: Ranji Trophy Final 2022: ‘తొలి టైటిల్’కు చేరువలో... -
నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు
అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో జరిగింది. 25 ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత అనితా సొమ్మసిల్లీ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్‌ను రక్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ అనితా అల్వరేజ్ పోటీల్లో పాల్గొంటూనే సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని పేర్కొంది. Rapid rescue.@AFP photographers Oli Scarff and Peter Kohalmi capture the dramatic rescue of USA's Anita Alvarez from the bottom of the pool when she fainted during the women's solo free artistic swimming finals at the Budapest 2022 World Aquatics Championships pic.twitter.com/8Y0wo6lSUn — AFP News Agency (@AFP) June 23, 2022 చదవండి: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
జాహ్నవి, అంజలిలకు స్వర్ణాలు
ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో జాహ్నవి, అంజలి విజేతలుగా నిలిచారు. బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్-17 బాలికల 100మీ. బ్యాక్ స్ట్రోక్ విభాగంలో జాహ్నవి ఒక నిమిషం 21.91సెకన్లలో లక్ష్యదూరాన్ని చేరి స్వర్ణాన్ని సాధించగా... హుస్నా జైబ్ (1: 37.81ని), రాధిక శ్రేయ (1:40.33 ని.) వరుసగా రజత, కాంస్యాలు సాధించారు. అండర్ -14 బాలికల విభాగంలో అంజలి రేసును 1: 33.03 నిమిషాల్లో పూర్తిచేసి మొదటిస్థానంలో నిలిచింది. కశ్యపి (1:36.06 ని.), ఇష్వి (1: 40.53 ని.) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో జశ్వంత్ (1: 24.78 ని.), అభిషేక్ (1: 34.39 ని.), యువ (1: 36.28 ని.) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ రాఘవ్ రెడ్డి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్‌రెడ్డి విజేతలకు మెడల్స్ అందజేశారు. 100 మీ. ఫ్రీస్టయిల్ విజేతలు అండర్ -14 బాలురు: 1. కృష్ణ సాకేత్, 2. సాయి అభిషేక్, 3. మణీందర్ బాలికలు: 1. మెహ్రీశ్, 2. చంద్రిక, 3. యాశిక అండర్-17 బాలురు: 1. హేమంత్‌రెడ్డి, 2. సాకేత్‌రెడ్డి, 3. రుత్విక్ బాలికలు: 1. త్రిషిక, 2. అనన్య