స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు.
ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి.
కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం.. ఆమె పరిస్థితి విషమం
నైరోబి: కెన్యా స్టార్ అథ్లెట్, పురుషుల మారథాన్‌లో ప్రపంచ రికార్డు నెలకొలి్పన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కిప్టమ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొడుతూ బలంగా చెట్టును ఢీకొంది.
దుర్ఘటన సమయంలో కోచ్ హకిజిమానా, ఓ మహిళ కారులో ప్రయాణించగా... కిప్టమ్, కోచ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మహిళను హాస్పిటల్‌లో చేరి్పంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
24 ఏళ్ల కిప్టమ్ త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు. అయితు, లక్ష్య చేరుకోకుండానే అతడు మృత్యువాతపడటం విషాదం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన షికాగో మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు; 2గం:00:35 సెకన్లు) కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఏప్రిల్‌లో జరిగిన లండన్ మారథాన్‌లోనూ కిప్టమ్ స్వర్ణ పతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment