స్విమ్మర్‌ శివానికి స్వర్ణం | Telangana Swimmer shivani wins goldmedal in 38th Sub Junior National Aquatic Championship | Sakshi
Sakshi News home page

National Aquatic Championship: స్విమ్మర్‌ శివానికి స్వర్ణం

Published Sun, Jun 26 2022 7:51 AM | Last Updated on Sun, Jun 26 2022 7:51 AM

Telangana Swimmer shivani wins goldmedal in 38th Sub Junior National Aquatic Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ శివాని కర్రా మూడు పతకాలతో మెరిసింది. గుజరాత్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల శివాని అండర్‌–11 బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించింది. శివాని 34.93 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది.

100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఫైనల్‌ రేసును శివాని 1ని:14.81 సెకన్లలో ముగించి రజత పతకం గెలిచింది. అనంతరం 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలేలో శివాని, అన్నిక దెబోరా, మేఘన నాయర్, వేములపల్లి దిత్యా చౌదరీలతో కూడిన తెలంగాణ బృందం 2ని:12.31 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గచ్చిబౌలిలోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) స్విమ్మింగ్‌పూల్‌లో కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌ వద్ద గత ఐదేళ్లుగా శివాని శిక్షణ తీసుకుంటోంది.
చదవండి: Ranji Trophy Final 2022: ‘తొలి టైటిల్‌’కు చేరువలో...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement