జాహ్నవి, అంజలిలకు స్వర్ణాలు | jahnavi and anjali are aquatic champions | Sakshi
Sakshi News home page

జాహ్నవి, అంజలిలకు స్వర్ణాలు

Published Fri, Aug 12 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

జాహ్నవి, అంజలిలకు స్వర్ణాలు

జాహ్నవి, అంజలిలకు స్వర్ణాలు

 ఆక్వాటిక్ చాంపియన్‌షిప్
 హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో జాహ్నవి, అంజలి విజేతలుగా నిలిచారు. బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్-17 బాలికల 100మీ. బ్యాక్ స్ట్రోక్ విభాగంలో జాహ్నవి ఒక నిమిషం 21.91సెకన్లలో లక్ష్యదూరాన్ని చేరి స్వర్ణాన్ని సాధించగా... హుస్నా జైబ్ (1: 37.81ని), రాధిక శ్రేయ (1:40.33 ని.) వరుసగా రజత, కాంస్యాలు సాధించారు. అండర్ -14 బాలికల విభాగంలో అంజలి రేసును 1: 33.03 నిమిషాల్లో పూర్తిచేసి మొదటిస్థానంలో నిలిచింది.

కశ్యపి (1:36.06 ని.), ఇష్వి (1: 40.53 ని.) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో జశ్వంత్ (1: 24.78 ని.), అభిషేక్ (1: 34.39 ని.), యువ (1: 36.28 ని.) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ రాఘవ్ రెడ్డి, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్‌రెడ్డి విజేతలకు మెడల్స్ అందజేశారు.
 
100 మీ. ఫ్రీస్టయిల్ విజేతలు
 అండర్ -14 బాలురు: 1. కృష్ణ సాకేత్, 2. సాయి అభిషేక్, 3. మణీందర్
 బాలికలు: 1. మెహ్‌రీశ్, 2. చంద్రిక, 3. యాశిక
 అండర్-17 బాలురు: 1. హేమంత్‌రెడ్డి, 2. సాకేత్‌రెడ్డి, 3. రుత్విక్
 బాలికలు: 1. త్రిషిక, 2. అనన్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement