US Swimmer Anita Alvarez Dramatic Rescued From Bottom Of Pool, Goes Viral - Sakshi
Sakshi News home page

USA Swimmer Anita Alvarez: నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు

Published Thu, Jun 23 2022 1:10 PM | Last Updated on Thu, Jun 23 2022 3:01 PM

US Swimmer Anita Alvarez Dramatic Rescue From Bottom Of Pool Viral - Sakshi

అమెరికాకు చెందిన స్విమ్మర్‌ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘ‌ట‌న బుడాపెస్ట్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ అక్వాటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో జ‌రిగింది.

25 ఏళ్ల స్విమ్మర్‌ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన త‌ర్వాత శ్వాస తీసుకోలేక‌పోయింది. సోలో ఫ్రీ ఈవెంట్‌లో త‌న రొటీన్ పూర్తి చేసిన త‌ర్వాత అనితా సొమ్మసిల్లీ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్‌ అల్వరేజ్‌ను ర‌క్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గ‌త ఏడాది బార్సిలోనాలో జ‌రిగిన ఒలింపిక్ క్వాలిఫ‌యింగ్ ఈవెంట్‌లోనూ అనితా అల్వరేజ్‌ పోటీల్లో పాల్గొంటూనే  సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని పేర్కొంది. 

చదవండి: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం

 విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement