Budapest
-
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్‌కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
వెర్స్టాపెన్ ఖాతాలో ఎనిమిదో విజయం
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. -
Hungarian GP Qualifying: రసెల్‌కు కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన ఫార్ములావన్ (ఎఫ్1) కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. బుడాపెస్ట్‌లో శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 24 ఏళ్ల రసెల్ అందరికంటే వేగంగా 1ని:17.377 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానం నుంచి... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి... నోరిస్ (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్ మొత్తంలో 72 రేసుల్లో పాల్గొన్న రసెల్ ఈ సీజన్లో నాలుగు రేసుల్లో మూడో స్థానంలో నిలిచాడు. సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే నేటి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు
అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో జరిగింది. 25 ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత అనితా సొమ్మసిల్లీ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్‌ను రక్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ అనితా అల్వరేజ్ పోటీల్లో పాల్గొంటూనే సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని పేర్కొంది. Rapid rescue.@AFP photographers Oli Scarff and Peter Kohalmi capture the dramatic rescue of USA's Anita Alvarez from the bottom of the pool when she fainted during the women's solo free artistic swimming finals at the Budapest 2022 World Aquatics Championships pic.twitter.com/8Y0wo6lSUn — AFP News Agency (@AFP) June 23, 2022 చదవండి: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
ఉక్రెయిన్ పరిస్థితులపై సాక్షి ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
-
‘గ్రాండ్‌మాస్టర్’ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వెజెర్కెప్జో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో 17 ఏళ్ల రాజా రితి్వక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్‌లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్ 2496గా ఉండటంతో గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్‌తో బరిలోకి దిగిన రితి్వక్ నాలుగో రౌండ్లో ఫినెక్ వచ్లావ్ (చెక్ రిపబ్లిక్)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లను సాధించిన రితి్వక్ జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్‌ను కూడా అందుకోవడంతో భారత్ తరఫున 70వ గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా రిత్విక్ ఆరేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్ తండ్రి ఆర్.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్ ఆడారు. తొలుత వరంగల్‌లో స్థానిక కోచ్ బొల్లం సంపత్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్ ఆ తర్వాత హైదరాబాద్‌లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. పతకాల పంట... 2012లో కామన్వెల్త్ చాంపియన్íÙప్లో అండర్–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్‌లో జాతీయ అండర్–13 చాంపియ న్íÙప్లో చాంపియన్‌గా అవతరించిన రిత్విక్ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ అండర్–17 చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా రితి్వక్ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్‌తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్‌లో ఏనాటికైనా వరల్డ్ చాంపియన్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. –రాజా రిత్విక్ తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. -
రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు
రష్యా స్విమ్మర్ క్లిమెంట్ కొలెస్నికోవ్ రెండు రోజుల వ్యవధిలో రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న యూరోపియన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 20 ఏళ్ల కొలెస్నికోవ్ బుధవారం జరిగిన 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో స్వర్ణం గెలిచాడు. ఫైనల్ రేసును కొలెస్నికోవ్ 23.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సెమీఫైనల్ సందర్భంగా 23.93 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కొలెస్నికోవ్ బద్దలు కొట్టాడు. చదవండి: ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’ -
కాంస్య పతక పోరులో రవి ఓటమి
బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కే నిరాశే మిగిలింది. పురుషుల గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవి రాఠి పరాజయం పాలయ్యాడు. కాంస్య పతక పోరులో రవి రాఠి 0–8తో దిమిత్రి కామిన్స్కీ (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున రవీందర్ (61 కేజీలు), పూజా గెహ్లోట్ (53 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
రజతం నెగ్గిన భారత మహిళా రెజ్లర్ పూజ
బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోట్ రజత పతకం సాధించింది. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో.... శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్లో హరునా ఒకూనో (జపాన్) 72 సెకన్లలో పూజాను ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ పురుషుల 77 కేజీల గ్రీకో రోమన్ విభాగం సెమీఫైనల్లో భారత రెజ్లర్ సజన్ 4–5తో సకురబా (జపాన్) చేతిలో ఓడిపోయి నేడు జరిగే కాంస్య పతక రేసులో నిలిచాడు. -
ప్రపంచ రెజ్లింగ్ ఫైనల్లో పూజ
బుడాపెస్ట్: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లాట్ అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆమె 8–4తో జూనియర్ యూరోపియన్ రెజ్లింగ్ చాంపియన్ జెయ్నెప్ యెత్గిల్ (టరీ్క)ను కంగుతినిపించింది. క్వాలిఫయర్స్ ద్వారా బరిలోకి దిగిన పూజ అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్లో అయితే ఒక దశలో 2–4తో వెనుకబడింది. ఇక పరాజయం తప్పదనుకున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థిని అదే స్కోరు వద్ద నిలువరించిన భారత రెజ్లర్ చకచకా ఆరు పాయింట్లు చేసి గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత యువ రెజ్లర్... జపాన్ చెందిన హరునో ఒకునోతో తలపడుతుంది. ఇప్పటివరకు ఈ టోరీ్నలో భారత్ తరఫున ఏ ఒక్కరూ బంగారు పతకం గెలుపొందలేకపోయారు. ఇప్పుడు ఫైనల్లో గెలిస్తే అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా పూజ ఘనతకెక్కుతుంది. -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్‌కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్‌లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్‌లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్‌లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
హాలీవుడ్‌కి హలో
బాలీవుడ్ నటి షబానా ఆజ్మి బుడాపెస్ట్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మిస్తున్న ‘హాలో’ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో షబానా నటించనున్నారు. ‘హాలో’ అనే పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఈ విషయం గురించి షబానా మాట్లాడుతూ – ‘‘ఇదో కొత్త ప్రయాణం. చాలా ఎగై్జట్‌మెంట్‌తో పాటు కొంచెం నెర్వస్‌గానూ ఉంది. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. దీనికోసం రెండు సినిమాలను కూడా వదులుకున్నాను. ఆ సినిమాలు వదులుకునేంత విలువైందే ఈ సిరీస్ అనుకుంటున్నాను’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదివరకు ‘సిటీ ఆఫ్ జాయ్, లా నూట్ బెంగాలీ’ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు షబానా. -
ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్
బుడాపెస్ట్: ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఇటీవల ఎంతగానో దిగజారడం మనకు కనిపిస్తోంది. హంగేరీ ఈ విషయాన్ని తొందరగానే గుర్తించింది. 2024 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ నుంచి తమ నగరం బుడాపెస్ట్ తప్పుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తుంది కాబట్టి 2024లో దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వా లా? వద్దా? అనే అంశంపై పౌరుల నిర్ణయాన్ని తెలపాలని కోరింది. ఒలిం పిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పోలవడంతో బుడాపెస్ట్... ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. -
ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు
20 నవంబర్, 1873 హంగేరీ రాజధాని ఏది? అనగానే చిన్నపిల్లాడు కూడా బుడాపెస్ట్ అని ఠపీమని చెబుతున్నారు కానీ, బుడాపెస్ట్ అనేది ఒకప్పుడు ఒకటి కాదు, రెండు నగరాలు. అవీ కూడా ఒకదాంతో మరోదానికి బద్ధశత్రువులుగా మెలిగిన నగరాలు. కొన్ని ప్రయోజనాల కోసం పరస్పర శత్రుప్రాంతాలైన బుడా, పెస్ట్ నగరాలు ఏకమై బుడాపెస్ట్గా మారి, హంగేరీ దేశానికి రాజధానిగా మారాయి. డాన్యూబ్ నదికి కుడి, ఎడమ దిశలలో ఉండేవి బుడా, పెస్ట్ నగరాలు. బుడా ప్రాంతం ఇప్పటికీ కొండలు, లోయలు, ఇరుకైన రోడ్లు, పురాతన కట్టడాలతో పురాతన నాగరికతకు, ప్రకృతి రమణీయతకు ఆనవాలుగా ఉంటుంది. అత్యాధునిక కట్టడాలు, అత్యద్భుత భవనాలు, సువిశాలమైన రోడ్లతో, ఆహ్లాదకరమైన పార్కులతో, ఆధునిక నాగరకతకు ఆలవాలంగా ఉంటుంది పెస్ట్. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ నగరాలు బలమైన రాజధానిని ఏర్పరచడం కోసం తమ శత్రుత్వాన్ని మరచి ఒకటయ్యాయి. బుడాపెస్ట్ ఒక్కటీ సువిశాలమైన నగరంగా మారి హంగేరీ దేశానికి రాజధాని ఏర్పడింది. -
ఆ యాస కోసం తంటాలు
‘‘బంగారం.. బంగారం’’ అంటూ ‘సైనికుడు’ సినిమాలో త్రిషను ప్రేమించిన విలన్ పప్పూ యాదవ్ గుర్తున్నాడా....? అదేనండి ఇర్ఫాన్ ఖాన్....బాలీవుడ్లో పరిచ యం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ‘పీకూ’ చిత్రంలో నటిస్తున్న ఇర్ఫాన్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రాలు ‘ది అమేజింగ్ స్పైడర్‌మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘జురాసిక్ వరల్’డతో పాటు డాన్ బ్రౌన్ రాసిన ‘ఇన్ఫెర్నో’ నవల ఆధారంగా తీస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇర్ఫాన్ ఇప్పుడు బుడాపెస్ట్ వెళ్లనున్నారు. బ్రిటీష్ జాతీయుడిగా నటిస్తున్న ఇర్ఫాన్ ఇప్పటికే ఆ యాసలో మాట్లాడటానికి నానా తంటాలు పడుతున్నారట. దర్శకుడు కూడా ఈ విషయంపై తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారట. -
హంగేరీ
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్ వైశాల్యం: 93,030 చదరపు కిలోమీటర్లు జనాభా: 98,77,365 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: బుడాపెస్ట్ ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ కరెన్సీ: ఫోరింట్ భాష: మాగ్యార్ (హంగేరియన్) మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో-4 నుండి 1 డి గ్రీ వరకు, జులైలో 16 నుండి 28 డిగ్రీల వరకు. పంటలు: తృణధాన్యాలు, బంగాళదుంపలు, చెరుకు, కూరగాయలు, పళ్లు, ద్రాక్ష. పరిశ్రమలు: ఇనుము, ఉక్కు పరిశ్రమలు, దుస్తులు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, కలప ఉత్పత్తులు, గనులు. ఎగుమతులు: ఆహార ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, దుస్తులు, ఇనుము, ఉక్కు. స్వాతంత్య్రం: అక్టోబర్ 23, 1989. సరిహద్దులు: చెకొస్లోవేకియా, రష్యా, రొమేనియా, యుగొస్లావియా, ఆస్ట్రియా. చరిత్ర వెయ్యి సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చర్రిత చె బుతోంది. క్రీస్తుశకం 896 లో మాగ్యార్లు అనే రష్యా దేశపు స్టెప్పీలు డాన్యూబ్ నది తీరం గుండా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు నిజానికి దేశ దిమ్మరులు. గుర్రాలను పెంచుకోవడం వీరికి వృత్తి. వీళ్లకు నాయకుడు అర్పాడ్, ఇతను ప్రస్తుత హంగేరీ దేశపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించి పరిపాలించాడు. మొట్టమొదటి హంగేరియన్ సామ్రాజ్యం మాగ్వార్ రాజు స్టీఫెన్ నాయకత్వంలో క్రీస్తుశకం 1000 శతాబ్దంలో ఏర్పడింది. ఈ సామ్రాజ్యం క్రమంగా విస్తరించింది. అయితే మధ్య మధ్యన తుర్కులు దాడులు చేస్తూ ఉండేవారు. చివరికి వీరు హంగేరీ మధ్య భూభాగాన్ని ఆక్రమించుకొని 150 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీరు 16, 17 శతాబ్దాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆస్ట్రియాను పరిపాలిస్తున్న హప్స్‌బర్గ్ పాలకులు ఈ తుర్కుల మీద క్రమంగా దాడులు చేసి క్రీస్తు శకం 1699లో హంగేరీ దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. 1848 లో ఆస్ట్రియా స్వాతంత్య్ర పోరాటాన్ని వీరు రష్యా సహకారంతో అణచి వేశారు. అయితే మాగ్యార్లు తను అస్తిత్వాన్ని చాటుకోవడానికి హప్స్‌బర్గ్ పాలకుల మీద తిరుగుబాటు ఫలితంగా 1867లో ద్వంద్వ పాలన చేయాలని నిర్ణయం జరిగింది. దాని ఫలితంగా ఆస్ట్రో హంగేరీ రాజ్యపాలనలో మాగ్యార్లతో పాటు చెకొస్లోవేకియన్లు, స్లోవేనియన్లు, సెర్బ్‌లు కూడా భాగస్వాములు అయ్యారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత హాప్స్బర్స్ రాజ్యం కూలిపోయింది. ఫలితంగా హంగే రీ తన భూభాగాన్ని ఒక వంతు చెకోస్లోవేకియాకు, రుమేనియాకు, యుగొస్లోవియాకు కోల్పోయింది. 1930 దశకంలో హంగేరీ, జర్మన్ ఆధిపత్యంలో పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ జర్మనీతో కలిసి రష్యాపై యుద్ధం చేసింది. అయితే రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యాక చిత్రంగా హంగేరీ రష్యాకు అనుకూలంగా మారిపోయింది. ప్రజలు - సంస్క ృతి హంగేరీ ప్రజలు తమ పూర్వపు మాగ్యావర్ సంస్కృతిని, ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జాపపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. హంగేరియన్లు భోజనాన్ని చాలా సుష్టుగా తింటారు. బాగా తాగుతారు కూడా! పాప్రికా అనే ఆహారాన్ని బాగా తింటారు. టోకాజ్, బుల్స్బ్లడ్ అనే పేరు గల వైన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రజలు కూడా వీటికి అధికంగా ఉపయోగిస్తారు. భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లడం ఇక్కడ రివాజు. జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలలో జానపద గీతాలు, నృత్యాలు ఇక్కడ సర్వసాధారణం. నగరాలలో మహిళలు జీన్స్, సూట్స్ ధరిస్తారు. ఎంబ్రాయిడరీ చేసిన, లేసులతో అల్లిన టోపీ మహిళలు సాధారణంగా ధరిస్తారు. ఉర్గోస్, కరికాజో, సర్దాస్ అనే పేర్లు గల నృత్యాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.ఇక హంగేరీయన్లు తమ శరీరాలను మర్దన చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మర్దన కోసం ‘స్పా’లు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి. దేశ పరిపాలనా రీతులు - ప్రత్యేకతలు హంగేరీ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం 19 కౌంటీలుగా విభజింపబడింది. ఈ 19 కౌంటీలు తిరిగి 198 రైడింగ్లుగా విభజింపబడ్డాయి. దేశం మొత్తంలో 20 నగరాలు అతి పెద్దవిగా చలామణి అవుతున్నాయి. వీటిలో బుడాపెస్ట్, డెబ్రెసెన్, మిస్కోల్క్, జెగెడ్, పెక్స్, గ్యోర్, నిరె గీజా, మొదలైనవి పెద్ద జనాభాలో ఉన్నాయి. దేశంలో రొమేనియన్లు, జర్మన్లు, స్లోవాక్లు, రొమేనియన్ల జనాభా కూడా బాగా ఉంది. 1. {పపంచం మొత్తంలో కుర్రకారుకు ఇష్టమైన రూబిక్ క్యూబ్‌ను కనిపెట్టిన వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే. అతడి పేరు ఎర్నో రూబిక్, 1974లో అతడు క్యూబ్‌ను కనిపెట్టాడు. అదే రూబిక్ క్యూబ్. 2. ‘విటమిన్ సి’ ని కనిపెట్టిన అల్బర్ జెంట్ ఈ దేశానికి చెందిన వాడు. అతడి కి 1937లో నోబెల్ బహుమతి లభించింది. 3. ప్లాస్మో టీవిని 1936లో ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త కల్మన్ తిహాన్యీ దానిని కనిపెట్టాడు. 4. మనం విరివిగా ఉపయోగిస్తున్న బాల్ పాయింట్ పెన్నును లాస్జ్లో బైరో అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతడు ఈ దేశస్థుడే. 5. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్రైడోజన్ బాంబును ఈ దేశస్థుడైన ఎడ్వర్డ్ టెల్లర్ కనిపెట్టాడు. చూడదగిన ప్రదేశాలు బాలాటన్ సరస్సు బాలాటన్ సరస్సు - ఆ సరస్సులో ఉన్న ద్వీపగ్రామం. గ్రామంలో ఉన్న 17వ శతాబ్దపు బెనెడిక్ట్ ఆబే చూడద గ్గవి. దాదాపు 598 చదరపు కిలోమీటర్లు వెడల్పు ఉన్న సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుంది. దేశం మొత్తంలో ఒక అద్భుతమైన టూరిస్టు ప్రదేశం ఇది. ఇక్కడ ఒక ఓడరేవు కూడా ఉండడం ఒక విశేషం. ఈ సరస్సునే హంగేరీయన్ సముద్రం అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ 130 బీచ్‌లు ఉన్నాయి. సరస్సు రెండువైపులా అనేక చిన్న చిన్న గ్రామాలు, రిసార్టులు నిండి ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం పొడవునా యాత్రికులు సందడి చేస్తుంటారు. చిన్న చిన్న గుహలు, ఎకో హిల్, సక్స్ హిల్, అబే, ఇంకా సరస్సు చుట్టూ దాదాపు 30 చిన్న గ్రామాలు నెలకొని ఉన్నాయి. బుడాపెస్ట్ హంగేరీ దేశాన్ని దర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తూ ఉంటారు. సందర్శకుల రాకడలో ఈ దేశం ప్రపంచంలో పదమూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని బుడాపెస్ట్ సంవత్సరం పొడవునా సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వియన్నా గేట్ స్క్వేర్లు ఉన్న వరుస గృహాలు, సండోర్ రాజభవనం ఇప్పుడిది అధ్యక్ష భవనంగా మారింది. వర్కర్ట్ కాసినో, 17వ శతాబ్దంలో నిర్మించిన పెటెర్ఫీ ప్యాలెస్, గ్రేషుమ్ ప్యాలెస్, హంగేరియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, బుడా క్యాజిల్, స్టేట్ ఓపెరా హవుస్ గోల్డ్ మ్యూజియం, బాహవుస్ విల్లాలు, సిటీ పార్క్, ఇన్నర్ సిటి పరిశ్ చర్చి, కేవ్ చర్చి, లిబర్టీ విగ్రహం, లిబర్టీ బ్రిడ్జి, హీరోస్ స్క్వేర్, గ్రేట్ మార్కెట్ హాల్, మిల్లేనియం పార్లమెంట్ బిల్డింగ్ సెయింట్ స్టీఫెన్ బాసిలికా, గుల్ బాబా టోంబ్, సెయింట్ ఇస్త్వాన్ బాసిలికా, డాన్యూబ్ నది మీద నిర్మించిన వివిధ వంతెనలను తప్పక చూడాల్సిందే. మొత్తం ఏడు బ్రిడ్జిలు, ఏడు విధాలుగా ఉంటాయి. ఎగెర్ ఈ చారిత్రాత్మక నగరం దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ నగరం మాట్రాబక్ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఈ నగర ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుత శైలిలో శతాబ్దాల క్రితం నిర్మించిన క్యాజిల్‌లు, ధర్మల్ బాత్ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా టర్కిష్ ప్రజలు తమ ఉనికి తెలుపుకోవడానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఒంటి స్తంభ మినరెట్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ స్తంభం 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. లోపలి నుండి పైవరకు ఎక్కడానికి 97 మెట్లు ఉంటాయి. నగరంలో సెర్బియన్ల చర్చి రెక్టెంప్లమ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక వైన్ మ్యూజియం మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పిర్కర్ ప్రాంతంలో నిర్మించిన బాసిలికా ఒక గొప్ప కట్టడం. నగరంలో ఇళ్లు సాధారణంగా రెండు లేదా మూడు అంతస్తుల్లో ఉంటాయి. ఇంటి పైకప్పులన్నీ దాదాపు ఎరుపు రంగుతో ఉంటాయి. దూరం నుండి చూస్తే ఎరుపుదనం పరుచుకున్నట్లు కనబడుతుంది. మొహాక్స్ ఈ నగరం డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో పదిహేను, పదహారు శతాబ్దాలలో రెండు యుద్ధాలు జరిగాయి. మొదటిది క్రీ.శ.1526లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు గెలిచి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. రెండవది క్రీ.వ. 1687 లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు ఓడిపోయి కనుమరుగైపోయారు. ఓట్టోమాన్ రాజులు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆనాటి ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి. ఈ నగరంలో ఆనాడు యుద్ధాలలో మరణించిన 1700 మంది సైనికులకు గుర్తుగా మొహాక్స్ టార్టెనెల్మి ఎమ్లెంఖేమి అనే నిర్మాణం నేటికి నిలిచి ఉంది. ఈ నగరం ప్రతి వసంత మాసంలో బుసోజరాస్ కార్నివాల్ పండగ జరుగుతుంది. నగరం మధ్యలో టౌన్‌హాల్ భవనం, దాని నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మెమోరియల్ పార్క్, డాన్యూబ్ నది పరవ ళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నగరం నుండి ముగ్గురు వ్యక్తులు ప్రపంచానికి చాటి చెప్పారు. వారితో ఫెరెంక్ ఫాఫ్ గొప్ప ఆర్కిటెక్ట్, ఎండ్రేరోజ్దా ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్, నోర్బర్ట్ మిచెలిస్ ఒక గొప్ప రేసింగ్ డ్రైవర్.