బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోట్ రజత పతకం సాధించింది. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో.... శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్లో హరునా ఒకూనో (జపాన్) 72 సెకన్లలో పూజాను ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇదే టోర్నీ పురుషుల 77 కేజీల గ్రీకో రోమన్ విభాగం సెమీఫైనల్లో భారత రెజ్లర్ సజన్ 4–5తో సకురబా (జపాన్) చేతిలో ఓడిపోయి నేడు జరిగే కాంస్య పతక రేసులో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment