అమ్మాన్ సిటీ (జోర్డాన్): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది.
భారత్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), సవిత (62 కేజీలు), అంతిమ్ కుందు (65 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరడంతో భారత్ ఖాతాలో మరోమూడు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాగా ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్‌గా ప్రియా నిలిచింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment