goldmedal
-
Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్ తొలి గోల్డ్‌మెడల్ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్లో 1893.7 స్కోర్‌తో భారత్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1 స్కోర్) సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు -
పసిడితో మెరిసిన ప్రియా మాలిక్.. రెండో భారత రెజ్లర్‌గా
అమ్మాన్ సిటీ (జోర్డాన్): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది. భారత్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), సవిత (62 కేజీలు), అంతిమ్ కుందు (65 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరడంతో భారత్ ఖాతాలో మరోమూడు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాగా ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్‌గా ప్రియా నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా -
Thomas Cup Final 2022 : బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్
-
భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారీ నజరానా
బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్‌లాండ్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన ఫైనల్లో 3-0 తేడాతో విజయం సాధించి తొలి సారి స్వర్ణాన్ని భారత్ ముద్దాడింది. సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియోపై విజయం సాధించారు. ఇక మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15,23-21 వరుస సెట్లలో జొనాతన్ క్రిస్టీని ఓడించి 3-0 అధిక్యంతో థామస్ కప్‌ను కైవసం చేసుకునేలా చేశాడు. ఇక థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. చదవండి: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్ కప్ కైవసం -
Asian Boxing Championship: పూజా పసిడి పంచ్
దుబాయ్: నాలుగు పసిడి పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో రింగ్‌లోకి అడుగుపెట్టిన భారత మహిళా బాక్సర్లు చివరకు ఒక స్వర్ణ పతకంతో సంతృప్తి పడ్డారు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్ చాంపియన్ పూజా రాణి (75 కేజీలు) మళ్లీ స్వర్ణం సొంతం చేసుకోగా... ఐదుసార్లు చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు), తొలిసారి ‘ఆసియా’ టోర్నీ లో ఆడిన లాల్‌బుత్సాహి (64 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో పూజా రాణి 5–0తో మవ్లుదా మవ్లోనోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన పూజా రాణికి సెమీఫైనల్లో ‘వాకోవర్’ లభించింది. పూజాకు స్వర్ణ పతకంతోపాటు 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 25 వేలు) లభించింది. ఇతర ఫైనల్స్‌లో మేరీకోమ్ 2–3తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నజీమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో... లాల్‌బుత్సాహి 2–3తో మిలానా సఫ్రనోవా (కజకిస్తాన్) చేతిలో... అనుపమ 2–3తో లజత్ కుంగ్జిబయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మేరీకోమ్, లాల్‌బుత్సాహి, అనుపమాలకు రజత పతకాలతోపాటు 5 వేల డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సెమీఫైనల్లో ఓడిన లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సాక్షి చౌదరీ (64 కేజీలు), మోనిక (48 కేజీలు), సవీటి బురా (81 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. నేడు జరిగే పురుషుల విభాగం ఫైనల్స్‌లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), శివ థాపా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
బిలియర్డ్స్‌లో దుర్గాప్రసాద్‌కు స్వర్ణం
విజయవాడ స్పోర్ట్స్ : చెన్నైలో జరుగుతున్న ఆల్ ఇండియా రైల్వే బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ రైల్వే డివిజన్ క్రీడాకారుడు ఎల్.దుర్గాప్రసాద్ బిలియర్డ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. ఆయన ఫైనల్లో సదరన్ రైల్వేకి చెందిన రిఫత్ అలీపై విజయం సాధించి స్వర్ణం కైవసరం చేసుకున్నాడు. దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో కూడా దుర్గాప్రసాద్ స్వర్ణపతకం సాధించాడు. దుర్గాప్రసాద్‌ను డీఆర్ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం కె.వేణుగోపాలరావు, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ జె.ప్రదీప్‌కుమార్ అభినందించారు. -
కొవ్వూరు యువకుడికి పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్
పశ్చిమగోదావరి(కొవ్వూరు): పువ్వు పుట్టగానే పరిమళించినట్టే.. ప్రతిభ కూడా చిన్నప్పుడే తెలిసిపోతుందని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. చిన్నప్పుడు పాఠశాలలో ఏ పరరీక్ష నిర్వహించినా ముందుండే శేఖర్‌బాబు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. పీహెచ్‌డీలోనూ బంగారుపతకం సొంతం చేసుకున్నారు. ఓ వైపు ఐఎఫ్ఎస్ శిక్షణలో ఉంటూనే మరోవైపు కష్టపడి పీహెచ్డీ పూర్తిచేశారు. కొవ్వూరుకు చెందిన గెడ్డం శేఖర్‌బాబు కందిసాగులో అధిక దిగుబడి నిచ్చే జన్యువును కనుగొని పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిపిన ఈ ప్రయోగానికి గాను.. న్యూఢీల్లీలో శుక్రవారం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిందంబరం చేతుల మీదుగా బంగారుపతకాన్ని అందుకున్నారు. వ్యవసాయశాస్త్రంలో పీజీ పూర్తిచేసిన అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో మూడేళ్ల పాటు పీహెచ్డీ చేశారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు.