Courtesy: IPL Twitter
బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్‌లాండ్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన ఫైనల్లో 3-0 తేడాతో విజయం సాధించి తొలి సారి స్వర్ణాన్ని భారత్ ముద్దాడింది. సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియోపై విజయం సాధించారు.
ఇక మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15,23-21 వరుస సెట్లలో జొనాతన్ క్రిస్టీని ఓడించి 3-0 అధిక్యంతో థామస్ కప్‌ను కైవసం చేసుకునేలా చేశాడు. ఇక థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
చదవండి: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్ కప్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment