
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్ తొలి గోల్డ్‌మెడల్ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.
క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా(1890.1 స్కోర్) సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మూడో స్ధానంలో నిలిచిన చైనా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Comments
Please login to add a commentAdd a comment