world wrestling championship
-
అంతిమ్ అదరహో
బెల్గ్రేడ్: భారత మహిళా టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అండర్–20 ‘డబుల్ ప్రపంచ చాంపియన్’ అంతిమ్ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్ చాంపియన్ ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో అంతిమ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్ 2022, 2023 ప్రపంచ అండర్–20 చాంపియన్íÙప్లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది. 8 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్‌గా అంతిమ్ పంఘాల్ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్ (2006; కాంస్యం), బబిత ఫొగాట్ (2012; కాంస్యం), గీతా ఫొగాట్ (2012; కాంస్యం), వినేశ్ ఫొగాట్ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్ (2021; రజతం), సరితా మోర్ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
పసిడితో మెరిసిన ప్రియా మాలిక్.. రెండో భారత రెజ్లర్‌గా
అమ్మాన్ సిటీ (జోర్డాన్): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్ ప్రియా మలిక్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో ప్రియ 5–0తో లౌరా సెలివ్ క్యుహెన్ (జర్మనీ)పై గెలిచింది. భారత్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), సవిత (62 కేజీలు), అంతిమ్ కుందు (65 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరడంతో భారత్ ఖాతాలో మరోమూడు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాగా ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత మహిళ రెజ్లర్‌గా ప్రియా నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా -
భారత రెజ్లింగ్ ట్రయల్స్ 25, 26వ తేదీల్లో
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే భారత జట్లను ఈనెల 25, 26వ తేదీల్లో ఎంపిక చేయనున్నారు. పాటియాలాలో నిర్వహించే ఈ ట్రయల్స్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ఈ ట్రయల్స్‌కు హాజరు కావాల్సిందేనని భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్–హక్ ప్యానెల్ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది. సెపె్టంబర్ 16 నుంచి 24 వరకు బెల్గ్రేడ్లో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ప్రపంచ చాంపియన్íÙప్లో ఆయా కేటగిరీల్లో టాప్–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. -
2023 sports: ఏడాదంతా ఆడేద్దాం!
వచ్చేసింది 2023... క్రీడాభిమానులకు ఆటల విందు మోసుకొని వచ్చేసింది.... ఆద్యంతం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేందుకు వచ్చేసింది... ముందుగా హాకీ ప్రపంచకప్ మెగా ఈవెంట్‌తో కొత్త ఏడాది మొదలుకానుంది... ఆ తర్వాత తొలిసారి అమ్మాయిలకు నిర్వహిస్తున్న అండర్–19 టి20 ప్రపంచకప్ కనువిందు చేయనుంది... అనంతరం మహిళల టి20 ప్రపంచకప్‌తో ధనాధాన్ ధమాకా కనిపించనుంది... మండే వేసవిలో వినోదం పంచడానికి ఐపీఎల్ టోర్నీ... శీతాకాలంలో వన్డే వరల్డ్‌కప్.... కేవలం క్రికెట్టే కాదు... పంచ్ పవర్ చాటిచెప్పడానికి ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్... ‘పట్టు’పట్టడానికి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్... ‘రాకెట్’తో రఫ్ఫాడించేందుకు బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ‘రయ్ రయ్’ అంటూ సాగిపోయే ఫార్ములావన్ రేసులు... ఇంకా ఎన్నో... ఎన్నెన్నో టోర్నీలు మనను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం... మీ క్యాలెండర్‌లోనూ ఈ ఈవెంట్స్‌ను జత చేయండి... తప్పకుండా చూడండి! అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 16 ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ భారత్‌లో శ్రీలంక పర్యటన జనవరి 3 నుంచి 15 వరకు 3 టి20లు, 3 వన్డేలు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టి20లు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేలు ఐపీఎల్ టి20 టోర్నీ ఏప్రిల్–మే వెస్టిండీస్‌లో భారత్ పర్యటన జూలై–ఆగస్టు 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ జూలై 20 నుంచి ఆగస్టు 20 వరకు వేదిక: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొత్తం జట్లు: 32 ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 23– అక్టోబర్ 8 ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మొత్తం 23 రేసులు ఉన్నాయి. మార్చి 5న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలవుతుంది. అనంతరం వరుసగా బహ్రెయిన్ (మార్చి 5), సౌదీ అరేబియా (మార్చి 19), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 2), అజర్బైజాన్ (ఏప్రిల్ 30), మయామి (మే 7), ఎమిలియా రొమాగ్నా (మే 21), మొనాకో (మే 28), స్పెయిన్ (జూన్ 4), కెనడా (జూన్ 18), ఆస్ట్రియా (జూలై 2 ),బ్రిటన్ (జూలై 9), హంగేరి (జూలై 23), బెల్జియం (జూలై 30), డచ్ (ఆగస్టు 27), ఇటలీ (సెప్టెంబర్ 3), సింగపూర్ (సెప్టెంబర్ 17), జపాన్ (సెప్టెంబర్ 24), ఖతర్ (అక్టోబర్ 8), యూఎస్ఎ (అక్టోబర్ 22), మెక్సికో (అక్టోబర్ 29), సావోపాలో (నవంబర్ 5), లాస్‌వేగస్ (నవంబర్ 18) రేసులు జరుగుతాయి. నవంబర్ 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ ముగుస్తుంది. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ వేదిక: భువనేశ్వర్, రూర్కెలా (భారత్) జనవరి 13 నుంచి 29 వరకు మొత్తం జట్లు: 16 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 17 నుంచి 22 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్‌హామ్ మార్చి 14 నుంచి 19 వరకు సుదిర్మన్ కప్ టోర్నీ వేదిక: సుజౌ (చైనా) మే 14 నుంచి 21 వరకు ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా జూన్ 13 నుంచి 18 వరకు చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: చెంగ్జూ సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) ఆగస్టు 21 నుంచి 27 వరకు ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు ఆసియా చాంపియన్‌షిప్ వేదిక: దుబాయ్ (యూఏఈ) ఏప్రిల్ 25 నుంచి 30 వరకు సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో (భారత్) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: బుడాపెస్ట్ (హంగేరి) ఆగస్టు 19 – 27 పురుషుల వన్డే ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ వేదిక: భారత్ మొత్తం జట్లు: 10 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్; జనవరి 16 – 29 ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్; మే 28 – జూన్ 11 వింబుల్డన్ వేదిక: లండన్; జూలై 3 –17 యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 28 –సెప్టెంబర్ 10 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 16 –24 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: న్యూఢిల్లీ మార్చి 15 –31 ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) మే 1 – 14 –సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
బెల్గ్రేడ్ (సెర్బియా): నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 28 ఏళ్ల వినేశ్ రికార్డు నెలకొల్పింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ వినేశ్ కాంస్య పతకం సాధించింది. బుధవారం జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్‌గ్రెన్ (స్వీడన్)పై గెలిచింది. వాస్తవానికి మంగళవారం వినేశ్ తొలి రౌండ్లో 0–7తో ఖులాన్ బత్కుయగ్ (మంగోలియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. అయితే ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం వినేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ఫైనల్ చేరిన రెజ్లర్ చేతిలో అంతకుముందు రౌండ్లలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బౌట్లు నిర్వహిస్తారు. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో వినేశ్ 4–0తో జుల్దిజ్ ఇషిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది. తదుపరి రౌండ్లో వినేశ్తో పోటీపడాల్సిన లేలా గుర్బనోవా (అజర్బైజాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్‌కు ‘వాకోవర్’ లభించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం రేసులో నిషా మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరిత మోర్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–7తో లిసాక్ అన్హెలినా (పోలాండ్) చేతిలో... మాన్సి అహ్లావత్ క్వార్టర్ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్) చేతిలో... రితిక తొలి రౌండ్లో 2–6తో కెండ్రా అగస్టీన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. 🇮🇳's @Phogat_Vinesh wins her 2nd #WorldChampionship 🥉 after defeating Sweden's Joana Malmgren 8-0 Great resilience by #VineshPhogat after shocking 1st round defeat yesterday. She has now also become 1️⃣st Indian woman to have won 2️⃣ World Championships medals in #Wrestling 🤼♀️ pic.twitter.com/J0zpoWxKGz — SAI Media (@Media_SAI) September 14, 2022 -
World Wrestling Championship 2022: తొలి రౌండ్లోనే వినేష్ ఫోగట్ ఓటమి..
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్-2022లో భారత రెజ్లర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఇప్పటికే రెజ్లర్లు సోనమ్ మాలిక్,సుష్మా షోకీన్ ఇంటిముఖం పట్టగా.. తాజాగా భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్కమ్రించింది. మంగళవారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వినేష్‌ను మంగోలియాకు చెందిన రెజ్లర్ ఖులాన్ బత్ఖుయాగ్ ఓడించింది. మరోవైపు 50 కేజీల విభాగంలో రెజ్లర్ నీలం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని భారత్‌కు తొలి విజయం అందించింది. తొలి రౌండ్లో హంగేరి రెజ్లర్ టైమా స్జెకర్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో నీలం అడుగు పెట్టింది. అదే విధంగా మంగళవారం జరిగిన 65 కేజీల విభాగం తొలి రౌండ్లోనే భారత రెజ్లర్ షఫాలీ ఇంటిముఖం పట్టగా.. మరో రెజ్లర్ ప్రియాంక 76 కేజీల విభాగంలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. చదవండి: Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ -
Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర!
Anshu Malik First Indian Woman Win Silver Medal: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాలని ఆశించిన అన్షు మలిక్‌కు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ హెలెన్ లూయిస్ మరూలీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి విరామానికి 1–0తో అన్షు ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో భాగం ఆరంభంలోనే హెలెన్ 2 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచిన హెలెన్ తన ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంది. ఈ దశలో హెలెన్ తన పట్టుతో అన్షును కిందకు పడేసి ఆమె రెండు భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించి పెట్టింది. దాంతో హెలెన్ ‘బై ఫాల్’ పద్ధతిలో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. తాజా ఫలితంతో అన్షు రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కేంద్ర క్రీడాశాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సరితాకు కాంస్యం మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 59 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సరితా మోర్ కాంస్యంతో మెరిసింది. సారా జోనా లిండ్‌బోర్గ్ (స్వీడన్)తో జరిగిన కాంస్య పతక పోరులో సరిత 8–2తో విజయం సాధించింది. అల్కా తోమర్, బబితా ఫొగాట్, గీతా ఫొగాట్, వినేశ్ ఫొగాట్, పూజా ధాండాల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఆరో భారతీయ మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా పతకం నెగ్గిన ఏడో భారతీయ మహిళా రెజ్లర్‌గా సరిత గుర్తింపు పొందింది. చదవండి: Indian Hockey: హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు So proud of you Anshu ! That’s the spirit ! 1st 🇮🇳 woman wrestler to win a SILVER 🥈 at prestigious World Championship | @OLyAnshu | pic.twitter.com/aY2jNccXtG — Anurag Thakur (@ianuragthakur) October 7, 2021 -
కాంస్య పతక బౌట్లో పింకీ పరాజయం
Pinky loses bronze World Wrestling Championship.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత రెజ్లర్ పింకీ కాంస్య పతక బౌట్లో ఓడిపోయింది. జెనా రోజ్ బుర్కెర్ట్ (అమెరికా)తో జరిగిన బౌట్లో పింకీ 2–5తో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు. -
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు బజరంగ్ దూరం
ఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత వరల్డ్ బజరంగ్ పూనియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్‌కు ముందే అతనికి ఈ గాయం కాగా, అలాగే ఆటను కొనసాగించిన బజరంగ్ ఇప్పుడు చికిత్స కోసం విరామం తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అక్టోబర్ 2 నుంచి నార్వేలో జరిగే టోర్నీ దూరమయ్యాడు. క్వార్టర్స్‌లో సానియా జోడీ క్లీవ్‌లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్లీవ్‌లాండ్ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సానియా–క్రిస్టీనా మెక్హెల్ (అమెరికా) జంట 6–3, 6–2తో ఒక్సాన కలష్నికొవా (జార్జియా) – ఆండ్రీ మితు (రొమేనియా) జోడిపై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్–అమెరికా ద్వయం ఆధిపత్యమే కొనసాగింది. రెండు సెట్లలోనూ ఎక్కడ ప్రత్యరి్థకి అవకాశం ఇవ్వకుండా సానియా జోడీ చెలరేగింది. -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
World Junior Wrestling: ఒక రజతం, రెండు కాంస్యాలు..
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సంజూ (62 కేజీలు), భటేరి (72 కేజీలు) పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం ఫైనల్లో ఓడిన బిపాష (76 కేజీలు) రజతంతోనే సరిపెట్టుకుంది. సిమ్రన్ (50 కేజీలు), సితో (55 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. (అప్పుడు ఎందుకు నవ్వలేదు: రవి దహియాను ప్రశ్నించిన ప్రధాని మోదీ) మహిళల 76 కేజీల టైటిల్ బౌట్లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. 65 కేజీల కేటగిరీ సెమీ ఫైనల్లో భటేరి 3–2తో అమినా రొక్సానా (రొమేనియా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె మాల్డొవాకు చెందిన ఇరినా రింగాసితో తలపడనుంది. 62 కేజీల సెమీస్‌లో సంజూ దేవి 8–5తో బిర్గుల్ సొల్తనొవా (అజర్బైజాన్)పై గెలిచింది. తుది పోరులో ఆమె... ఎలీనా కసబియెవా (రష్యా)తో పోటీపడనుంది. 50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్ 7–3తో నటాలియా వరకిన (బెలారస్)పై, 55 కేజీల విభాగంలో సితో 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొందారు. 59 కేజీల కేటగిరీలో కుసుమ్కు నిరాశ ఎదురైంది. కాంస్యం కోసం తలపడిన ఆమె 1–3తో జాలా అలియెవా (అజర్బైజాన్) చేతిలో ఓడింది. 72 కేజీల సెమీ స్లో సనేహ్ 0–11తో కెన్నెడీ అలెక్సిస్ (అమెరికా) చేతిలో ఓడింది. ఆమె కాంస్యం కోసం పోటీ పడనుంది. భారత పురుష రెజ్లర్లు రజతం సహా 6 పతకాలు సాధించగా... మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలిచారు. -
జూనియర్ల జోరు
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్‌ను ఓడించాడు. రెపిచేజ్ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్ (74 కేజీలు), పృథ్వీ పాటిల్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్ 12–6తో కిర్గిజిస్తాన్‌కు చెందిన స్టాంబుల్ జానిబెక్పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్ (92 కేజీలు) 2–1తో ఇవాన్ కిరిలోవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్ (125 కేజీలు) 7–2తో అయిదిన్ అహ్మదోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్ చేరడంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్బాగ్ ఉల్జిబాత్పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్ రెజ్లర్ దిల్నాజ్ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్ ఉడుం పట్టు సెమీస్‌లో సడలింది. ఎమిలీ కింగ్ షిల్సన్ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ► 4 X 400 మీ. మిక్స్డ్ రిలేలో భారత్‌కు కాంస్యం ► జావెలిన్‌లో ఇద్దరు ఫైనల్‌కు నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్‌లలో పరుగెత్తారు. చివర్లో బ్యాటన్ అందుకున్న కపిల్...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ ఈవెంట్లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్ రజాక్ స్థానంలో ఫైనల్లో శ్రీధర్ బరిలోకి దిగాడు. వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు. షాట్‌పుట్‌లో ఫైనల్‌కు: వరల్డ్ చాంపియన్‌షిప్ మరో మూడు ఈవెంట్లలో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. షాట్‌పుట్‌లో అమన్‌దీప్ సింగ్ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్‌కు చేరుకుంది. జావెలిన్ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్ సింగ్ రాణా (71.05 మీటర్లు), జై కుమార్ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో సత్తా చాటి ఫైనల్ చేరారు. -
కాంస్య పతక పోరులో రవి ఓటమి
బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కే నిరాశే మిగిలింది. పురుషుల గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవి రాఠి పరాజయం పాలయ్యాడు. కాంస్య పతక పోరులో రవి రాఠి 0–8తో దిమిత్రి కామిన్స్కీ (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున రవీందర్ (61 కేజీలు), పూజా గెహ్లోట్ (53 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
రజతం నెగ్గిన భారత మహిళా రెజ్లర్ పూజ
బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోట్ రజత పతకం సాధించింది. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో.... శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్లో హరునా ఒకూనో (జపాన్) 72 సెకన్లలో పూజాను ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ పురుషుల 77 కేజీల గ్రీకో రోమన్ విభాగం సెమీఫైనల్లో భారత రెజ్లర్ సజన్ 4–5తో సకురబా (జపాన్) చేతిలో ఓడిపోయి నేడు జరిగే కాంస్య పతక రేసులో నిలిచాడు. -
ప్రపంచ రెజ్లింగ్ ఫైనల్లో పూజ
బుడాపెస్ట్: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లాట్ అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆమె 8–4తో జూనియర్ యూరోపియన్ రెజ్లింగ్ చాంపియన్ జెయ్నెప్ యెత్గిల్ (టరీ్క)ను కంగుతినిపించింది. క్వాలిఫయర్స్ ద్వారా బరిలోకి దిగిన పూజ అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్లో అయితే ఒక దశలో 2–4తో వెనుకబడింది. ఇక పరాజయం తప్పదనుకున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థిని అదే స్కోరు వద్ద నిలువరించిన భారత రెజ్లర్ చకచకా ఆరు పాయింట్లు చేసి గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత యువ రెజ్లర్... జపాన్ చెందిన హరునో ఒకునోతో తలపడుతుంది. ఇప్పటివరకు ఈ టోరీ్నలో భారత్ తరఫున ఏ ఒక్కరూ బంగారు పతకం గెలుపొందలేకపోయారు. ఇప్పుడు ఫైనల్లో గెలిస్తే అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా పూజ ఘనతకెక్కుతుంది. -
రవీందర్‌కు రజతం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. బుధవారం జరిగిన పురుషుల 61 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్లో రవీందర్ 3–5 పాయింట్ల తేడాతో ఉలుక్‌బెక్ జోల్‌డోష్‌బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. మూడు నిమిషాల తొలి రౌండ్ ముగిశాక 1–0తో ఆధిక్యంలో నిలిచిన రవీందర్ మరో మూడు నిమిషాల నిడివిగల రెండో రౌండ్లో మాత్రం తడబడ్డాడు. బౌట్ ముగియడానికి రెండు నిమిషాల సమయం ఉందనగా ఉలుక్‌బెక్ ఇంజ్యూరీ టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉలుక్‌బెక్ రెండు మూవ్‌మెంట్స్‌తో నాలుగు పాయింట్లు సంపాదించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో రవీందర్ తేరుకున్నా అప్పటికే ఆలస్యమై పోయింది. ఇదే టోర్నీ మహిళల 50 కేజీల విభాగంలో భారత రెజ్లర్ జ్యోతి కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో జ్యోతి 4–15తో కికా కగాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది.ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ టోర్నీలో భారత్‌కు ఓవరాల్‌గా లభించిన పతకాలు. ఈ ఐదూ రజతాలే కావడం గమనార్హం. గతంలో బజరంగ్, వినోద్ కుమార్, రీతూ ఫొగాట్ (2017లో), రవి దహియా (2018లో) రజత పతకాలు నెగ్గారు. -
దీపక్ ‘టాప్’ లేపాడు..
స్విట్జర్లాండ్: ఇటీవల ముగిసిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ దీపక్ పూనియా.. తాజాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్యూడబ్యూ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. తన 86 కేజీల కేటగిరీలో దీపక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 20 ఏళ్ల దీపక్ 82 పాయింట్లతో టాప్కు ఎగబాకాడు. అదే సమయంలో మాజీ వరల్డ్ చాంపియన్ యజ్దానిని వెనక్కి నెట్టాడు. ప్రస్తుత యజ్దాని 78 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది యాసర్ దోగు చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపక్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్నాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన దీపక్ గాయం కారణంగా తుది బౌట్లో పాల్గొనలేదు. దాంతో రజతంతోనే సంతృప్తి పడ్డాడు. నిలకడగా రాణిస్తున్న దీపక్ తన పాయింట్లను మెరుగుపరుచుకుంటూ ప్రథమ స్థానానికి ఎగబాకాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మరో భారత రెజ్లర్ బజరంగ్ పూనియా తన 65 కేజీల కేటగిరీలో టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఈ విభాగంలో వరల్డ్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన రష్యన్ రెజ్లర్ రషిదోవ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో భాగంగా 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఫొగట్ రెండో స్థానాన్ని ఆక్రమించారు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఫొగట్.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరారు. -
సాక్షి మాలిక్‌ను ఏడిపించారు!
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిస ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తంగా ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ వేదికపై భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్, రాహుల్ అవేర్‌లు కాంస్యాలు సాధించారు. అయితే ఈ ప్రదర్శన భారత రెజ్లింగ్ సమాఖ్య( డబ్యూఎఫ్ఐ)కు సంతృప్తినివ్వలేదు. ఎంతోమంది భారత స్టార్ రెజర్లు కల్గి ఉన్నప్పటికీ స్వర్ణం సాధించకపోవడంపై డబ్యూఎఫ్ఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా బజరంగ్ పూనియా సెమీ ఫైనల్ పోరు వివాదంగా ముగిసి అతను కాంస్యం సాధించినా దాన్ని పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు. దీనిపై బజరంగ్ పూనియా కోచ్ షాకో బెన్‌టినిడిస్‌ను నిలదీశారు డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ షరాన్ సింగ్. బజరంగ్ పూనియా తన కాలిని సరిగా మూవ్ చేయలేకపోవడాన్ని ప్రశ్నించారు. అతని లెగ్ మూమెంట్స్ అంతంగా మాత్రంగానే ఉన్నాయని, ఇది ప్రత్యర్థికి ఈజీగా పట్టు చిక్కడానికి వీలు కల్పింస్తుందంటూ బ్రిజ్ భూషణ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ ఈవెంట్లోనే ఇదే తరహా తప్పిదాలు చేస్తున్నా కోచ్‌గా మీరు ఏమీ చేస్తున్నారని నిలదీశారు. ఇక మహిళల విభాగంలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రీకో రోమన్ కేటగిరీలో ఉన్న సాక్షిని తీర్చిదిద్దడంలో కోచ్ విఫలం కావడాన్ని బ్రిజ్ భూషణ్ నిలదీశారు. సాక్షితో పాటు కోచ్‌ను ‘మీరు అసలు ఇక్కడకి ఎందుకు వచ్చారు. ఈ విభాగంలో ఇక నుంచి మిమ్మల్ని పంపకూడదనే ఆలోచనలో ఉన్నాం’ అని బ్రిజ్ భూషణ్ హెచ్చరించారు. దాంతో సాక్షి మాలిక్ ఒక్కసారిగా కన్నీట పర్యంతమయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాక్షి మాలిక్ కన్నీళ్లు పెట్టుకోవడంతో డబ్యూఎఫ్ఐ వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెజ్లర్లపట్ల ఇలా ప్రవర్తించడం తగదని బ్రిజ్ భూషణ్ వైఖరిని తప్పుబడుతున్నారు. -
ఒలింపిక్ పతకం సాధించినా...
న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తనకెదురైన ఓటమి గాయం ఒలింపిక్ పతకం సాధించినా మానేది కాదని భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జడ్జీలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా బజరంగ్ ఫైనల్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ‘మ్యాచ్‌లో పక్షపాతం, మోసం చేయడం ద్వారా ఎదురైయ్యే ఓటమి మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. నేను పసిడి పతకం గెలిచే అవకాశాన్ని నా తప్పుల ద్వారా చేజార్చుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లు భిన్నమైన టోరీ్నలు. నేను ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం చాలా కష్టపడ్డా. ఒలింపిక్ పతకం గెలిచినా ప్రస్తుతం నాకు ఎదురైన ఓటమి గాయం మానదు. ఇటువంటి ఓటములు భవిష్యత్తులో ఎదురైతే నాకు ఈ ఓటమే గుర్తొస్తుంది’ అంటూ బజరంగ్ బదులిచ్చాడు. జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించండి! జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించాలని బజరంగ్ డిమాండ్ చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రెజ్లర్లకు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ జాతీయ క్రీడగా రెజ్లింగ్ చేయాలనే ఆలోచన చేయగా దానికి బజరంగ్ మద్దతు తెలిపాడు. ప్రపంచ వేదికల మీద గత కొంత కాలంగా రెజ్లింగ్ భారత్‌కు పతకాలు అందిస్తూ వస్తోంది. అటువంటి రెజ్లింగ్‌ను జాతీయ క్రీడగా చేయడం సరైనదే అని బజరంగ్ అభిప్రాయపడ్డాడు. అయితే దీనిపై ఆచితూచి స్పందించిన క్రీడల మంత్రి తనకు అన్ని క్రీడలు సమానమేనని, వాటి అభివృద్ధికి దోహదపడతానని అన్నారు. నగదు పురస్కారాల ప్రదానం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఐదుగురు భారత రెజ్లర్లను కిరణ్ రిజిజు నగదుతో సత్కరించారు. రజతం గెలిచిన దీపక్ పూనియాకు రూ.7 లక్షలు, కాంస్యాలు సాధించిన బజరంగ్, వినేశ్ ఫొగాట్, రాహుల్ అవారే, రవి దహియాలకు తలా రూ.4 లక్షల రూపాయల చెక్‌లను బహూకరించారు. -
మన ‘పట్టు’ పెరిగింది
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తమ అత్యుత్తమ పతక ప్రదర్శనతో ఘనతకెక్కింది. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈ పోటీల్లో ఐదు పతకాలను సాధించింది. స్వర్ణం బరిలో నిలిచిన దీపక్ పూనియా (86 కేజీలు) పోటీకి దూరమయ్యాడు. గాయంతో అతను తలపడలేకపోయాడు. దీంతో రజతంతో తృప్తిచెందాల్సి వచ్చింది. రాహుల్ కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో ఇదివరకే బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), మహిళల కేటగిరీలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా భారత్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 79 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. రష్యా (190 పాయింట్లు), కజకిస్తాన్ (103 పాయింట్లు), అమెరికా (94 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గతంలో భారత్ మెరుగైన ప్రదర్శన 3 పతకాలే! 2013 ప్రపంచ రెజ్లింగ్‌లో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గింది. ఈవెంట్‌కు చివరి రోజైన ఆదివారం జరిగిన 61 కేజీల కాంస్య పతక పోరులో రాహుల్ అవారే ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ మహారాష్ట్ర రెజ్లర్ 11–4తో 2017 పాన్ అమెరికా చాంపియన్ టైలర్ గ్రాఫ్ (అమెరికా)ను మట్టికరిపించాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రాహుల్ చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా చాంపియన్íÙప్ (2009, 2011)లలో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. 86 కేజీల విభాగం ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్ యజ్దానీతో పోటీపడాల్సిన యువ రెజ్లర్ దీపక్ పూనియా చీలమండ గాయంతో బరిలోకి దిగలేదు. దాంతో యజ్దానిని విజేతగా ప్రకటించగా, దీపక్ ఇప్పటి వరకు భారత్ నుంచి దీపక్ సహా ఐదుగురే రెజ్లర్లు ప్రపంచ పోటీల్లో ఫైనల్ చేరగా... సుశీల్ (2010) మాత్రమే విజేతగా నిలిచాడు. బిషంబర్ సింగ్ (1967), అమిత్ దహియా (2013), బజరంగ్ (2018) ఫైనల్లో ఓడిపోయారు. -
భారత పోరు ‘బెస్ట్’తో ముగిసింది..
నూర్సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఆఖరి రోజు కూడా భారత్ హవా కొనసాగింది. ఆదివారం జరిగిన 61 కేజీల కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం కోసం జరిగిన బౌట్లో రాహుల్ అవేర్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. రాహుల్ అవేర్ 11-4 తేడాతో అమెరికన్ రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను చిత్తు చేసి కాంస్యం ఒడిసి పట్టుకున్నాడు. నాన్ ఒలింపిక్ కేటగిరీలో జరిగిన ఈ పోరులో రాహుల్ ఆరంభంలో తడబడ్డప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. మొదటి రౌండ్లో తొలుత రెండు పాయింట్లు వెనుకబడ్డ రాహుల్.. వరుసగా పాయింట్లు సాధించి తన ఆధిక్యాన్ని 4-2తో పెంచుకున్నాడు. ఆపై రెండో రౌండ్లో రాహుల్ 10-2 తేడాతో దూసుకుపోయాడు. తన ఆధిక్యాన్ని కడవరకూ ఇలాగే కొనసాగించిన రాహుల్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ ఐదు పతకాల్లో ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్‌లు కాంస్యాలతో మెరిశారు. -
పాపం దీపక్.. పసిడి పోరును వద్దనుకున్నాడు
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ రెజ్లర్ దీపక్ పూనియా వైదొలిగాడు. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండానే నిష్క్రమించాడు. ఎడమకాలికి గాయం కారణంగా పసిడి పోరు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో రజతంతోనే సరిపెట్టుకున్నాడు. 86 కేజీల ఫ్రీస్టైయిల్ కేటగిరీలో హసన్ యజ్దాని(ఇరాన్)తో తలపడాల్సి ఉండగా గాయం వేధించింది. ఇక చేసేది లేక ఫైనల్ బౌట్‌ను ఆడలేనని నిర్వాకులకు స్పష్టం చేశాడు. ఫలితంగా యజ్దానికి స్వర్ణం లభించగా, దీపక్ పూనియా రన్నరప్‌గా నిలిచాడు. దీనిపై దీపక్ పూనియా మాట్లాడుతూ.. ‘ నేను స్వర్ణ పతకం కోసం ఫైట్ చేయలేకపోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన బాగున్నా, టైటిల్ ఫైట్‌ను కోల్పోయాను. నా ఎడమ కాలు బాగా బాధించింది. దానిపై ఎక్కువ ఒత్తిడి పడితే ఆ గాయం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాలి గాయంతో రెజ్లింగ్ బౌట్లో పాల్గొనడంలో చాలా కష్టం. యజ్దానితో తుది పోరులో తలపడే అవకాశం నా ముందున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఇక ఒలింపిక్స్ పతకం సాధించడంపై దృష్టి సారిస్తున్నా’ అని దీపక్ పూనియా పేర్కొన్నాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో 20 ఏళ్ల దీపక్ 8–2 తేడాతో స్టెఫాన్ రీచ్మత్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్ చేరడంతోనే దీపక్ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్ క్యాడెట్ టైటిల్ గెలుచుకొని వెలుగులోకి వచ్చిన దీపక్ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. -
దీపక్ వెలుగులు
గత నెలలో దీపక్ పూనియా జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. జూనియర్ స్థాయి ఆటగాడు సీనియర్‌కు వచ్చేసరికి ఫలితాలు అంత సులువుగా రావనేది క్రీడా వర్గాల్లో ప్రచారం ఉన్న మాట. కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే దానిని దీపక్ తప్పుగా నిరూపించాడు.ఆడుతున్న తొలి సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే సత్తా చాటుతూ 86 కేజీల విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. తుది పోరులోనూ ఇదే జోరు కొనసాగిస్తే సుశీల్ కుమార్ తర్వాత విశ్వవిజేతగా నిలిచిన రెండో భారత్ రెజ్లర్‌గా చరిత్రకెక్కుతాడు. 61 కేజీల విభాగం సెమీస్‌లో ఓడిన మరో భారత రెజ్లర్ రాహుల్ అవారే ఆదివారం కాంస్య పతక పోరులో బరిలోకి దిగుతాడు. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ కెరటం దీపక్ పూనియా సత్తా చాటాడు. ఈ పోటీల 86 కేజీల విభాగంలో దీపక్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో 20 ఏళ్ల దీపక్ 8–2 తేడాతో స్టెఫాన్ రీచ్మత్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్ చేరడంతోనే దీపక్ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఇరాన్‌కు చెందిన హసన్ యజ్దానీచరాతితో దీపక్ తలపడతాడు. పోటీ లేకుండా... మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్ క్యాడెట్ టైటిల్ గెలుచుకొని వెలుగులోకి వచి్చన దీపక్ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. తొలి పీరియడ్‌లో 1–0తో ముందంజ వేసిన దీపక్ రెండో పీరియడ్‌లో ప్రత్యరి్థని పడగొట్టి 4–0తో దూసుకుపోయాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయినా... మరోసారి రీచ్మత్పై సంపూర్ణ ఆధిక్యం కనబర్చి 8–2తో బౌట్‌ను ముగించాడు. సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత మరే భారత రెజ్లర్ ఈ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు దీపక్ దానికి విజయం దూరంలో నిలిచాడు. అంతకుముందు హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో దీపక్ 7–6తో కార్లోస్ మెండెజ్ (కొలంబియా)ను ఓడించి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ►4 దీపక్ ఫైనల్ చేరడంతో భారత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్లయింది. 2013లో భారత్‌కు అత్యధికంగా మూడు పతకాలు రాగా... ఈసారి నాలుగు ఖాయమయ్యాయి. ఒకవేళ నేటి బౌట్లో రాహుల్ కూడా గెలిస్తే భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరుతాయి. ►5 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఫైనల్‌కు అర్హత పొందిన ఐదో భారత రెజ్లర్ దీపక్ పూనియా. గతంలో బిషంబర్ సింగ్ (1967లో), సుశీల్ కుమార్ (2010లో), అమిత్ దహియా (2013లో), బజరంగ్ (2018లో) ఈ ఘనత సాధించారు. ఈ నలుగురిలో సుశీల్ ఫైనల్లో నెగ్గి స్వర్ణం సాధించగా... మిగతా ముగ్గురు రజతం దక్కించుకున్నారు. రాహుల్‌కు నిరాశ 61 కేజీల నాన్ ఒలింపిక్ కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవారే సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. బెకా లోమ్టాదె (జార్జియా) 10–6 స్కోరుతో రాహుల్‌పై గెలిచాడు. నేడు జరిగే కాంస్యపతక పోరులో టైలర్ గ్రాఫ్ (అమెరికా) లేదా మిహై ఇసాను (మాల్డొవా) లతో రాహుల్ తలపడతాడు. ఇతర భారత రెజ్లర్లలో జితేందర్ (79 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, మౌసమ్ ఖత్రీ (97 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
నాల్గో భారత రెజ్లర్‌గా..
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ దీపక్ పూనియా విజయం సాధించాడు. ఆసక్తిని రేకెత్తించిన బౌట్లో దీపక్ పూనియా 7-6 తేడాతో కార్లోస్ ఈక్విర్డో(కొలంబియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. కాగా, టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫై అయిన నాల్గో రెజ్లర్‌గా దీపక్ పూనియా నిలిచాడు. ఇప్పటికే వినేశ్ ఫొగట్, బజరంగ్ పూనియా, రవి కుమార్‌లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు వీరు ముగ్గురు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి కాంస్యాలను గెలుచుకున్నారు.(ఇక్కడ చదవండి: బజరంగ్, రవి కంచు మోత) ఇక నాన్ ఒలింపిక్ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రాహుల్ అవేర్ సెమీస్‌కు చేరాడు. రాహుల్ అవేర్ 10-7 తేడాతో కజికిస్తాన్‌కు చెందిన కైలియెవ్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన బౌట్లో నాల్గో సీడ్‌గా బరిలోకి దిగిన దీపక్ పూనియా ఎక్కడ కూడా పట్టు సడలనివ్వలేదు. కడవరకూ తన త్రోలతో ఆకట్టుకున్న పూనియా ఒక్క పాయింట్ తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. -
బజరంగ్, రవి కంచు మోత
ఆతిథ్య నిర్వాకం బజరంగ్ స్వర్ణావకాశాన్నే దెబ్బతీసింది. కానీ పతకాల పూనియా ఘన చరిత్రను మాత్రం అడ్డుకోలేకపోయింది. రోజు వ్యవధిలోనే తనకెదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ భారత ‘ఖేల్‌రత్న’ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. మెగా ఈవెంట్లలో అతనికిది మూడో పతకం. తద్వారా ప్రపంచ చాంపియన్íÙప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్‌గా అతను ఘనతకెక్కాడు. 2013లో కాంస్యం నెగ్గిన బజరంగ్ గతేడాది రజతం సాధించాడు. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు) ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కంచుమోత మోగించారు. శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లలో బజరంగ్ 8–7తో తుల్గతుముర్ ఒచిర్ (మంగోలియా) పై... రవి 6–3తో ఆసియా చాంపియన్ రెజా అహ్మదాలీ అట్రినగర్చి (ఇరాన్)పై గెలిచారు. అయితే వెటరన్ స్టార్ సుశీల్ కుమార్‌కు (74 కేజీలు) తొలి రౌండ్లోనే షాక్ ఎదురైంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అయితే ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్íÙప్లో బరిలోకి దిగిన 36 ఏళ్ల సుశీల్‌కు ఈసారి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. గద్జియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన తొలి రౌండ్ బౌట్లో సుశీల్ 9–11తో ఓడిపోయాడు. ఒకదశలో 9–4తో ఆధిక్యంలో నిలిచిన సుశీల్ ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. సుశీల్‌పై గెలిచిన ఖద్జిమురద్ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెపిచేజ్’ అవకాశం లేకుండా పోయింది. మిగతా పోటీల్లో 125 కేజీల ఈవెంట్లో సుమిత్ 0–2తో లిగెటి (హంగేరి) చేతిలో... 70 కేజీల బౌట్లో కరణ్ 0–7తో నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... 92 కేజీల కేటగిరీలో ప్రవీణ్ 0–8తో సగలిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల కేటగిరీలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బజరంగ్ ఆఖరిదాకా ‘పట్టు’ సడలించకుండా తలపడి గెలిచాడు. గురువారం సెమీఫైనల్ బౌట్లో తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ చాంపియన్ రెజ్లర్ ఈ బౌట్లో 8–7తో మంగోలియాకు చెందిన తుల్గ తుముర్ ఒచిర్‌పై విజయం సాధించాడు. ఒకదశలో 2–6తో వెనుకబడిన బజరంగ్ ఆ తర్వాత దూకుడు పెంచి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి నిమిషంలో ఒక పాయింట్ కోల్పోయిన బజరంగ్ ఒక పాయింట్ తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెమీస్ చేరడంతోనే బజరంగ్‌తో పాటు రవి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
‘టోక్యో’కు సుశీల్ క్వాలిఫై కావాలంటే..
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల 74 కేజీల కేటగిరీలో సుశీల్ 9-11 తేడాతో కడ్జిమురాద్ గాడ్జియెవ్(అజెర్బైజాన్)చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ పోరు రౌండ్-1లో సుశీల్ కుమార్ ఆధిక్యంలో నిలిచినా చివరకు ఓటమి తప్పలేదు. బ్రేక్ సమయానికి ఐదు పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సుశీల్.. ఆపై వెనకబడ్డాడు. తిరిగి పుంజుకున్న గాడ్జియెవ్.. సుశీల్‌ను తేరుకోనివ్వలేదు. దాంతో రెండు పాయింట్ల తేడాతో సుశీల్ పరాజయం చెందాడు. దాంతో సుశీల్ కుమార్ టోక్యో ఒలింపిక్స్ బెర్తు క్లిష్ట తరంగా మారింది. గాడ్జియెవ్ ఫైనల్‌కు చేరితేనే సుశీల్‌కు రెపిచేజ్ ద్వారా ఒలింపిక్స్ బెర్తు ఆశలు సజీవంగా ఉంటాయి. కాంస్య పతకం కోసం జరిగే రెపిచేజ్‌లో సత్తాచాటితేనే సుశీల్ కాంస్యంతో పాటు ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేసుకుంటాడు. ఇదిలా ఉంచితే, ప్రవీణ్ రాణా రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు జరిగిన 92 కేజీల ఫ్రీస్టైయిల్ రెజ్లింగ్ కేటగిరీలో ప్రవీణ్ 12-1 తేడాతో చాంగ్జె సు(దక్షిణ కొరియా)పై గెలిచాడు. -
అంపైర్లు.. ఇక మీరెందుకు?
న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెమీఫైనల్లో బజరంగ్ పూనియా పట్ల అంపైర్లు నిర్దయగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే పలువురు ధ్వజమెత్తగా తాజాగా భారత్ స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా మండిపడ్డాడు. ఓవరాల్ ప్రదర్శన చూడకుండా ఏకపక్షంగా కజికిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించడాన్ని తప్పుపట్టాడు. ‘ ఎవరైనా బజరంగ్- నియజ్బోకొవ్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్ మ్యాచ్ చూశారా. అందులో ఎవరిది ఆధిపత్యమో స్పష్టంగా కనబడుతోంది.(ఇక్కడ చదవండి: బజరంగ్‌ను ఓడించారు) అసలు అంపైర్లు మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు. మీరు మ్యాచ్‌కు అంపైర్లగా ఉండి ఏమిటి ఉపయోగం. ఒక మెగా టోర్నమెంట్లో ఇంతటి పక్షపాతంగా వ్యవహరిస్తారా. ఎట్టిపరిస్థితుల్లోనూ కజికిస్తాన్ రూల్స్‌కు లోబడి ఆడలేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. నిన్నటి సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించాడు. అయినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. -
బజరంగ్‌ను ఓడించారు
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బజరంగ్ ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...ఒకే సారి నాలుగు పాయింట్లు సాధించిన ‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. ఈ బౌట్లో ఓటమితో బజరంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు రజతం, బంగారం దూరమయ్యాయి. కాంస్యం కోసం బజరంగ్... డేవిడ్ హబట్ (స్లోవేనియా)తో తలపడతాడు. మహిళల ఈవెంట్లో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కాంస్యం బరిలో నిలిచిన పూజ ధండా కూడా ఓడిపోయింది. పట్టించుకోని రిఫరీలు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజరంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురు లేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో, పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. పైగా బౌట్ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా నియజ్బెకొవ్ కోలుకునేందుకు చాలా సమయం ఇచ్చారు. కనీసం మూడు సార్లు ఇలా జరగ్గా ఒక్కసారి హెచ్చరిక కూడా జారీ చేయలేదు. బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో అతను 6–1తో యుకి టకహషి (జపాన్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జువర్ వుగుయెవ్ (రష్యా) 6–4తో రవి జోరుకు బ్రేకులేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం రవికి ఊరట. సాక్షి మలిక్ అవుట్... మహిళల 59 కేజీల కాంస్య పతక పోరులో పూజ 3–5తో జిన్ గ్రూ పీ (చైనా) చేతిలో ఓడింది. 62 కేజీల కేటగిరీలో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి 7–10తో నైజీరియాకు చెందిన అమినట్ అడెనియి చేతిలో కంగుతింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ 0–2తో ఒలింపిక్ చాంపియన్ సార దొషొ (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. సాక్షి, దివ్యలను ఓడించిన ప్రత్యర్థులు క్వార్టర్స్‌లో ఓడటంతో రెపిచేజ్ అవకాశం లేకుండా పోయింది. -
ఇది కదా దురదృష్టమంటే..
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్) : భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన పూనియా ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియా పాపమైంది. దీంతో నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. సెమీస్ ఓటమితో బజ్రంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా కూడా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు ఇప్పుడు రజతం, బంగారం దూరమయ్యాయి. అంతా కలిసి ఏక ‘పక్ష’మయ్యారు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజ్రంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురేలేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం కజకిస్తాన్‌కు చెందిన డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ కుస్తీ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. ఆ సర్కిల్లో ప్రత్యర్థి త్రో ప్రభావవంతంగా ఉందని అదనంగా 4 పాయింట్లు కట్టబెట్టి నియజ్బెకొవ్‌ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్స్‌లో అలవోకగా...: అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజ్రంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ జౌర్ యుగెయెవ్(రష్యా) చేతిలో పరాజయం పాలై కాంస్య పోరులో నిలిచాడు. -
ఒలింపిక్స్ బెర్త్ పట్టేశారు..
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ ఫోగాట్ కాంస్య పతకం నెగ్గడంతో పాటు.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పురుషుల రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఫలితంగా ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియాకు చెందిన సన్ జాంగ్‌ను 8-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బజరంగ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. అదేవిధంగా పరుషుల 57 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ రవి దహియా జపాన్ క్రీడాకారుడు యుకి తకాషిని 6-1 తేడాతో ఓడించి సగర్వంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టడంతో పాటు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ 62 కేజీల విభాగంలో నైజీరియా క్రీడాకారిణి అమెనాట్ అడెనియీ చేతిలో ఓడిపోయింది. అయితే అడెనియీ ఫైనల్‌కు చేరడంపైనే సాక్షి మాలిక్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పతకం ఆధారపడి ఉంది. నైజీరియా క్రీడాకారిణి ఫైనల్ చేరుకుంటేనే సాక్షికి రెపిచేజ్ ఆడే అవకాశం దక్కుతుంది. -
వినేశ్ ‘కంచు’పట్టు
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బంగారానికి దూరమైనా... బంగారంలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోలేదు. రెపిచేజ్‌లో విరామమెరుగని పోరాటం చేసిన ఆమె వరుస విజయాలతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో పాటు కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. 25 ఏళ్ల వినేశ్ మూడు ప్రపంచ రెజ్లింగ్ ఈవెంట్లలో తలపడినా... ఒక్కసారి కూడా పతకాన్ని నెగ్గలేకపోయింది. నాలుగోసారి బరిలోకి దిగిన ఆమెకు గురువారం ముగ్గురు క్లిష్టమైన ప్రత్యర్థులే ఎదురయ్యారు. చివరకు అందరిని ఓడిస్తూ అనుకున్నది సాధించింది. మహిళల 53 కేజీల రెపిచేజ్ తొలి బౌట్లో 5–0తో యులియా (ఉక్రెయిన్)ను ఓడించింది. రెండో బౌట్లో వినేశ్ 8–2తో ప్రపంచ నంబర్‌వన్ సారా అన్ హిల్డెబ్రంట్ (అమెరికా)ను మట్టికరిపించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఆమె... కాంస్య పతక పోరులో 4–1తో మరియా ప్రివొలరకి (గ్రీస్)ను చిత్తు చేసింది. నాన్ ఒలింపిక్ 59 కేజీల కేటగిరీలో పూజ ధండా సెమీఫైనల్లో ఓడింది. రష్యా రెజ్లర్ ఒచరొవా 10–0తో పూజను ఓడించింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో గుల్నోరా (ఉజ్బెకిస్తాన్) లేదా జింగ్రు పె (చైనా)లతో పూజ తలపడుతుంది. 50 కేజీల రెపిచేజ్ బౌట్లో సీమా 3–11తో పొలెస్‌చుక్ (రష్యా) చేతిలో ఓడింది. ►5 చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఐదో భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో అల్కా తోమర్ (2006), ‘ఫొగాట్ సిస్టర్స్’ గీత (2012), బబిత (2012), పూజ ధండా (2018) ఈ ఘనత సాధించారు. వీరందరూ కాంస్య పతకాలే గెలిచారు. -
వినేశ్ ఓడింది కానీ..!
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ఆమె పసిడి ‘పట్టు’ ముగిసినా... టోక్యో దారి మిగిలే ఉంది. మహిళల 53 కేజీల కేటగిరీలో ఆమెకు ‘రెపిచేజ్’తో కాంస్యం గెలిచే అవకాశాలున్నాయి. మరో మహిళా రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) కూడా ఓడినప్పటికీ, వినేశ్ లాగే ఒలింపిక్స్ బెర్తు, కాంస్యం చేజిక్కించుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7–0తో వినేశ్‌ను ఓడించింది. అనంతరం ఈ జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్‌కు నేడు జరిగే ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆమె కాంస్యం గెలవాలంటే ముగ్గురిని ఓడించాలి. లేదంటే కనీసం ఇద్దరిపై గెలిచినా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తుంది. యులియా (ఉక్రెయిన్), ప్రపంచ నంబర్‌వన్ సారా అన్ (అమెరికా), ప్రివొలరకి (గ్రీస్)లతో వినేశ్ తలపడనుంది. ఇప్పటివరకు కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వినేశ్... ప్రపంచ రెజ్లింగ్‌లో మాత్రం నెగ్గలేకపోయింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో సీమా 2–9తో మరియా స్టాండిక్ (అజర్బైజాన్) చేతిలో పరాజయం చవిచూసింది. మూడు ఒలింపిక్ పతకాల విజేత అయిన మరియా ఫైనల్ చేరడంతో సీమా కూడా ‘రెపిచేజ్’ అవకాశం దక్కించుకుంది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే ఆమె... మెర్సి(నైజీరియా), పొలెస్‌చుక్ (రష్యా)లను ఓడించాలి. కాంస్యం నెగ్గాలంటే వారిద్దరితో పాటు చైనా రెజ్లర్ యనన్ సన్‌పై గెలవాలి. భారత్‌కే చెందిన కోమల్ (72 కేజీలు), లలిత (55 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. వారిని ఓడించిన రెజ్లర్లు ఫైనల్‌కు చేరకపోవడంతో మరో అవకాశం లేకుండా పోయింది. -
రెండో రౌండ్ దాటలేదు
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో సోమవారం మూడు విభాగాల్లో భారత రెజ్లర్లు రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయారు. గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు) రెండో రౌండ్లో ఓటమి చెందగా... నవీన్ (130 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే నవీన్‌ను ఓడించిన క్యూబా రెజ్లర్ ఆస్కార్ పినో హిండ్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో నవీన్‌కు నేడు ‘రెపిచేజ్’ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరుకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తొలి రౌండ్ బౌట్లలో వాగ్నర్ (ఆస్ట్రియా)పై గుర్ప్రీత్, జానెస్ (ఫిన్లాండ్)పై మనీశ్ గెలిచారు. అయితే రెండో రౌండ్ బౌట్లలో గుర్ప్రీత్ 1–3తో నెమిస్ (సెర్బియా) చేతిలో... మనీశ్ 0–10తో కియోబాను (మాల్డొవా) చేతిలో ఓడిపోయారు. -
భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. ఆదివారం గ్రీకో–రోమన్ విభాగంలో బరిలో నిలిచిన మనీశ్ (67 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) తొలి రౌండ్లో నిష్క్రమించగా... రవి (97 కేజీలు) రెండో రౌండ్లో ఓడాడు. మొదటి రౌండ్లో రవి 5–0తో చెంగ్ హో చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో రవి 0–7తో ఆర్టర్ ఒమరొవ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన 67 కేజీల విభాగం తొలి రౌండ్లో మనీశ్ 1–10తో డేవిడ్ తిహోమిరొవ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో, 87 కేజీల విభాగంలో సునీల్ 0–6తో జోసెఫ్ పాట్రిక్ (అమెరికా) చేతిలో ఓడారు. నేడు గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో దిగుతారు. -
బజరంగ్ సాధిస్తాడా!
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లింగ్ చరిత్రలో ఒకే ఒక్కడు సుశీల్ కుమార్ మాత్రమే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. 2010లో అతను ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి నుంచి మరో స్వర్ణం మన ఖాతాలో చేరలేదు. ఇప్పుడు స్వర్ణం గెలుచుకునే లక్ష్యంతో వరల్డ్ నంబర్‌వన్ బజరంగ్ పూనియా (65 కేజీలు) శనివారం మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నీ అయిన ఈ మెగా ఈవెంట్లో మొత్తం 108 ఒలింపిక్ బెర్త్‌లు ఖరారవుతాయి. పురుషుల ఫ్రీస్టయిల్ (57, 65, 74, 86, 97, 125 కేజీలు), గ్రీకో రోమన్ (60, 67, 77, 87, 97, 130 కేజీలు), మహిళల ఫ్రీస్టయిల్ (50, 53, 57, 62, 68, 76 కేజీలు) విభాగాల్లో టాప్–6లో నిలిచిన వారు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన ఇదే పోటీల్లో రజతం సాధించిన బజరంగ్ తన ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జూనియర్ వరల్డ్ చాంపియన్ దీపక్ పూనియా (86 కేజీలు) ఇక్కడ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. బజరంగ్ 19న, సుశీల్ 20న, దీపక్ 21న బరిలోకి దిగుతారు. -
పూజ ధండాకు కాంస్య పతకం
బుడాపెస్ట్ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆమె 10–7 తేడాతో గ్రేస్ జాకబ్ బులెన్ (నార్వే)ను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో భజరంగ్ పూనియా రజతం తర్వాత భారత్‌కు లభించిన రెండో పతకం ఇదే కావడం విశేషం. అల్కా తోమర్ (2006 – 59 కేజీ), బబితా ఫొగాట్ (2012 – 51 కేజీలు), గీత ఫొగాట్ (2012 – 55 కేజీలు) తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్‌గా పూజ ధండా గుర్తింపు పొందింది. కాంస్యం కోసం జరిగిన మరో బౌట్లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5–10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది. -
కాంస్య పతకం రేసులో రెజ్లర్ సుమీత్
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సుమీత్ ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం తలపడనున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమీత్ సెమీఫైనల్లో 0–5తో చైనా రెజ్లర్ జెవె డింగ్ చేతిలో ఓడిపోయాడు. అమర్‌వీర్ (కెనడా)–నికోలస్ ఎడ్వర్డ్ (అమెరికా) మధ్య మ్యాచ్ విజేతతో నేడు కాంస్యం కోసం జరిగే పోరులో సుమీత్ ఆడతాడు. భారత్‌కే చెందిన జితేందర్ (74 కేజీలు), పవన్ కుమార్ (86 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... సోన్బా తనాజీ (61 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
సాక్షి, వినేశ్ కూడా అవుట్
పారిస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (60 కేజీలు), వినేశ్ ఫోగట్ (48 కేజీలు) కూడా ఈ మెగా ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లలో సాక్షి 1–3తో ల్యూసా నైమెష్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలవ్వగా, వినేశ్‌పై విక్టోరియా ఆంథోని (అమెరికా)పైచేయి సాధించింది. వీరితో పాటు శీతల్ తోమర్ (53 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన శీతల్ ప్రిక్వార్టర్స్‌లో 10–0తో గెలుపొంది, క్వార్టర్స్‌లో 2–4తో ఎస్టేరా డోబ్రే (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. నవ్‌జ్యోత్ కౌర్ 5–10తో ఆకిర్బాట్ నసన్‌బుర్మా (మంగోలియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఇక భారత్ పతక ఆశలన్నీ ఆసియన్ చాంపియన్ బజ్రంగ్ పూనియా (65కేజీలు), ఒలింపియన్ సందీప్ తోమర్ (57 కేజీలు)లపైనే ఉన్నాయి. -
సాక్షి, బజరంగ్‌లపై దృష్టి
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పారిస్: పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో కలిపి భారత్ తరఫున మొత్తం 24 మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సాక్షి మలిక్ ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గురువారం 60 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాక్షితోపాటు వినేశ్ ఫోగట్ (48 కేజీలు)పై భారత బృందం ఆశలు పెట్టుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), సత్యవర్త్ కడియన్ (97 కేజీలు) పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన బజరంగ్ 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. తొలి రోజు సోమవారం గ్రీకో రోమన్ విభాగంలో (71 కేజీలు, 75 కేజీలు, 85 కేజీలు, 98 కేజీలు) పోటీలు జరుగుతాయి. రాత్రి గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం -
నర్సింగ్కు కాంస్యం మిస్
బుడాపెస్ట్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. బుధవారం జరిగిన పురుషుల 74 కేజీల రెప్‌చేజ్ రౌండ్లో నర్సింగ్ 1-6తో అలీ షబానో (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో 10-2తో కకబెర్ కుబ్జెటి (రష్యా)పై నెగ్గిన నర్సింగ్... రెండో రౌండ్లో 0-7తో జోర్గాన్ బురోగస్ (అమెరికా) చేతిలో ఓడాడు. అయితే జోర్డాన్ ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. మరోవైపు మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 51 కేజీల విభాగం రెండో రౌండ్లో వినేశ్ 3-6తో ఇసబెల్లా సంబు (సెనెగల్) చేతిలో పరాజయం చవిచూసింది. 48 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో నిర్మలా దేవి 0-7తో అలైసా లాంపీ (అమెరికా) చేతిలో ఓడింది. -
అమిత్, గీతలపైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించాలనే నిర్ణయం వచ్చాక నూతనోత్సాహంతో 22 మంది సభ్యులుగల భారత బృందం ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ వారం రోజులపాటు జరుగుతుంది. 16 నుంచి 18 వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో; 18 నుంచి 20 వరకు మహిళల విభాగంలో; 20 నుంచి 22 వరకు గ్రీకో రోమన్ విభాగంలో బౌట్లు ఉంటాయి. గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత రెజ్లర్లు అలాంటి ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. బరిలో 22 మంది రెజ్లర్లు ఉన్నా భారత ఆశలన్నీ ఇద్దరిపైనే ఉన్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఆసియా చాంపియన్ అమిత్ కుమార్ (55 కేజీలు)... మహిళల విభాగంలో గీత పోగట్ (59 కేజీలు) పతకాలు నెగ్గే అవకాశాలున్నాయి. గత ఏడాది కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గీత కాంస్య పతకాన్ని గెలిచింది. లండన్ ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ గాయాల కారణంగా ఈ పోటీల్లో పాల్గొన డంలేదు. సోమవారం తొలి రోజున పురుషుల ఫ్రీస్టయిల్ కేటగేరిలో 55 కేజీలు, 66 కేజీలు, 96 కేజీల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్స్‌తోపాటు ఫైనల్స్ ఉంటాయి. తొలి రౌండ్లో యాసుహిరో (జపాన్)తో అమిత్; 66 కేజీల తొలి రౌండ్లో రోషన్ (శ్రీలంక)తో అరుణ్ కుమార్; 96 కేజీల తొలి రౌండ్లో గామిని (శ్రీలంక)తో సత్యవర్త పోటీపడతారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు స్వర్ణం, రజతంతోపాటు ఐదు కాంస్య పతకాలు సాధించింది. రష్యాలో జరిగిన 2010 ఈవెంట్లో సుశీల్ కుమార్ భారత్‌కు ఏకైక స్వర్ణ పతకాన్ని అందించాడు.