బుడాపెస్ట్: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లాట్ అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆమె 8–4తో జూనియర్ యూరోపియన్ రెజ్లింగ్ చాంపియన్ జెయ్‌నెప్ యెత్గిల్ (టరీ్క)ను కంగుతినిపించింది. క్వాలిఫయర్స్ ద్వారా బరిలోకి దిగిన పూజ అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్లో అయితే ఒక దశలో 2–4తో వెనుకబడింది. ఇక పరాజయం తప్పదనుకున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుంది.
ప్రత్యర్థిని అదే స్కోరు వద్ద నిలువరించిన భారత రెజ్లర్ చకచకా ఆరు పాయింట్లు చేసి గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత యువ రెజ్లర్... జపాన్ చెందిన హరునో ఒకునోతో తలపడుతుంది. ఇప్పటివరకు ఈ టోరీ్నలో భారత్ తరఫున ఏ ఒక్కరూ బంగారు పతకం గెలుపొందలేకపోయారు. ఇప్పుడు ఫైనల్లో గెలిస్తే అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా పూజ ఘనతకెక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment