![Pooja Dhanda wins bronze medal in 57kg category - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/26/PUJA.jpg.webp?itok=FaKkjolm)
బుడాపెస్ట్ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆమె 10–7 తేడాతో గ్రేస్ జాకబ్ బులెన్ (నార్వే)ను ఓడించింది. ఈ మెగా ఈవెంట్‌లో భజరంగ్ పూనియా రజతం తర్వాత భారత్‌కు లభించిన రెండో పతకం ఇదే కావడం విశేషం. అల్కా తోమర్ (2006 – 59 కేజీ), బబితా ఫొగాట్ (2012 – 51 కేజీలు), గీత ఫొగాట్ (2012 – 55 కేజీలు) తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్‌గా పూజ ధండా గుర్తింపు పొందింది. కాంస్యం కోసం జరిగిన మరో బౌట్‌లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5–10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment