Pooja Dhanda
-
పూజ పసిడి పట్టు
న్యూఢిల్లీ: డాన్ కొలోవ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత మహిళా రెజ్లర్ పూజా ధండా స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పూజా 59 కేజీల విభాగంలో అజేయంగా నిలిచింది. ఆమె వెయిట్ కేటగిరీలో నలుగురు రెజ్లర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు జరగ్గా... పూజా మూడు బౌట్లలోనూ విజయం సాధించింది. లి బౌట్లో పూజా 12–0తో కొర్నెలియా (లిథువేనియా)పై... రెండో బౌట్లో 4–3తో సరితా (భారత్)పై నెగ్గగా... మూడో బౌట్లో ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. ఇదే టోర్నీ పురుషుల 61 కేజీల విభాగంలో సందీప్ తోమర్ (భారత్) రజతం గెలిచాడు. ఫైనల్లో సందీప్ 0–10తో సనాయెవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
పూజ ధండాకు కాంస్య పతకం
బుడాపెస్ట్ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆమె 10–7 తేడాతో గ్రేస్ జాకబ్ బులెన్ (నార్వే)ను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో భజరంగ్ పూనియా రజతం తర్వాత భారత్‌కు లభించిన రెండో పతకం ఇదే కావడం విశేషం. అల్కా తోమర్ (2006 – 59 కేజీ), బబితా ఫొగాట్ (2012 – 51 కేజీలు), గీత ఫొగాట్ (2012 – 55 కేజీలు) తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్‌గా పూజ ధండా గుర్తింపు పొందింది. కాంస్యం కోసం జరిగిన మరో బౌట్లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5–10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది. -
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణాల వేట కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చారు. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 17కు చేరుకుంది. ప్రత్యర్థి వేల్స్‌కు చెందిన ఛారిగ్ కేన్ మీద 10-0 పాయింట్ల తేడాతో రెజ్లర్ పునియా ఘన విజయం సాధించారు. రజతం నెగ్గిన పూజా భారత మహిళా రెజ్లర్ పూజా ధండా రజతం నెగ్గారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఫైనల్లో ఓటమి చెందడంతో ఆమె రజతంతో సరిపెట్టుకున్నారు. స్వర్ణం కోసం ఆమె చేసిన పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు నేటి ఉదయం 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణం నెగ్గగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు. మరో భారత షూటర్ అనీష్ భన్వాలా 15 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించారు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం అందించాడు. ఇప్పటివరకూ భారత్ 37 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 9రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత రెజ్లర్ పూజ