
న్యూఢిల్లీ: డాన్ కొలోవ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా రెజ్లర్ పూజా ధండా స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పూజా 59 కేజీల విభాగంలో అజేయంగా నిలిచింది. ఆమె వెయిట్ కేటగిరీలో నలుగురు రెజ్లర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్‌లు జరగ్గా... పూజా మూడు బౌట్‌లలోనూ విజయం సాధించింది.
లి బౌట్‌లో పూజా 12–0తో కొర్నెలియా (లిథువేనియా)పై... రెండో బౌట్‌లో 4–3తో సరితా (భారత్)పై నెగ్గగా... మూడో బౌట్‌లో ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. ఇదే టోర్నీ పురుషుల 61 కేజీల విభాగంలో సందీప్ తోమర్ (భారత్) రజతం గెలిచాడు. ఫైనల్లో సందీప్ 0–10తో సనాయెవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment