గోల్డ్‌కోస్ట్ : కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణాల వేట కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేర్చారు. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 17కు చేరుకుంది. ప్రత్యర్థి వేల్స్‌కు చెందిన ఛారిగ్ కేన్ మీద 10-0 పాయింట్ల తేడాతో రెజ్లర్ పునియా ఘన విజయం సాధించారు.
రజతం నెగ్గిన పూజా
భారత మహిళా రెజ్లర్ పూజా ధండా రజతం నెగ్గారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం ఫైనల్లో ఓటమి చెందడంతో ఆమె రజతంతో సరిపెట్టుకున్నారు. స్వర్ణం కోసం ఆమె చేసిన పోరాటం ఆకట్టుకుంది. మరోవైపు నేటి ఉదయం 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణం నెగ్గగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సాధించారు. మరో భారత షూటర్ అనీష్ భన్వాలా 15 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించారు. 25 మీటర్ల రాపిడ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం అందించాడు.
ఇప్పటివరకూ భారత్ 37 పతకాలు సాధించగా.. అందులో 17 స్వర్ణాలు, 9రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
భారత రెజ్లర్ పూజ
Comments
Please login to add a commentAdd a comment