గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది.
కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్‌లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
- 2010- ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం
- 2014- గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం
- 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం
Comments
Please login to add a commentAdd a comment