gold coast
-
బాబోయ్... భరించలేం!
గోల్డ్‌కోస్ట్ (ఆ్రస్టేలియా): బ్రిటిష్ రాజ్యమేలిన దేశాల మధ్య ప్రతి నాలుగేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే కామన్వెల్త్ క్రీడలు ఆతిథ్య నగరాలకు గుదిబండగా మారాయి. ఆ్రస్టేలియాలాంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహణ పెనుభారంగా భావిస్తున్నాయి. మాకొద్దంటే మాకొద్దని ఘనమైన ఆతిథ్యానికి దూరం జరుగుతున్నాయి. తాజాగా 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఆ్రస్టేలియాకు చెందిన మరో నగరం గోల్డ్‌కోస్ట్ కూడా వైదొలిగింది. రెండేళ్లలో జరిగే ఈ క్రీడల హక్కుల్ని తొలుత ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రం దక్కించుకుంది. అయితే క్రీడాగ్రామం నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు, రవాణా, ఇతరత్రా ఆధునిక సదుపాయాల కల్పన తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్ధారించుకున్నాక విక్టోరియా ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు ఈ జూలైలోనే వెల్లడించింది. దీంతో 2018లో ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించిన గోల్డ్‌కోస్ట్ మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచి్చంది. అయితే 700 కోట్ల డాలర్లకు పైగా వ్యయమయ్యే ఈ క్రీడల ఆతిథ్యాన్ని మరోసారి భరించడం కష్టమని వివరిస్తూ గోల్డ్‌కోస్ట్ కూడా ఈ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగింది. ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందిగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)కు గోల్డ్‌కోస్ట్ నగర మేయర్ టామ్ టేట్ సూచించారు. ఆస్ట్రేలియా కాకుండా మరో మూడు దేశాలు కామన్వెల్త్ క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అనుకున్నట్లుగా 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగితే మాత్రం మరుసటి ఏడాది (2027) జరగొచ్చు. -
Gareth Morgan: 6 బంతుల్లో 6 వికెట్లు
గోల్డ్‌కోస్ట్: ఆ్రస్టేలియా క్లబ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్–3 పోటీల్లో ఒక బౌలర్ ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. ముద్గీరబ నేరంగ్ అండ్ డిస్ట్రిక్ట్స్ క్లబ్ కెపె్టన్ గారెత్ మోర్గాన్ ఈ ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుపై అతను ఈ రికార్డు సృష్టించాడు. 40 ఓవర్ల మ్యాచ్‌లో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ క్లబ్ 39 ఓవర్లలో 174/4 వద్ద నిలిచింది. చివరి ఓవర్లో మరో 5 పరుగులు చేస్తే చాలు. అయితే గారెత్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించడంతో 4 పరుగుల తేడాతో గెలుపు ముద్గీరబ జట్టు సొంతమైంది. అంతకుముందే ఈ ఇన్నింగ్స్‌లో మరో వికెట్ తీసిన గారెత్ మొత్తంగా 7/16తో ముగించాడు. గతంలో ప్రొఫెషనల్ క్రికెట్లో నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), అల్ అమీన్ (బంగ్లాదేశ్), అభిమన్యు మిథున్ (భారత్) ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. -
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 6 బంతుల్లో 6 వికెట్లు
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్లో భాగంగా ఆదివారం ముగ్గీరాబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముజీరబా నీరంగ్ జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు. 40 ఓవర్లలో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ప్యారడైజ్ విజయానికి కేవలం 5 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉండడంతో ప్యారడైజ్ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సమయంలో ముగ్గీరాబా కెప్టెన్ మోర్గాన్ స్వయంగా బౌలంగ్ ఎటాక్‌కు వచ్చాడు. తన వేసిన చివరి ఓవర్ లో 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టి.. తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మోర్గన్ తన బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతుల్లో నలుగుర్ని క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు పంపగా.. చివరి రెండు వికెట్లను బౌల్డ్రూపంలో పొందాడు. అంతర్జాతీయ మీడియా రిపోర్టులు ప్రకారం.. మోర్గాన్ గోల్డ్‌కోస్ట్ కౌన్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: World Cup 2023: భారత్- న్యూజిలాండ్ సెమీస్‌కు అంపైర్లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా -
రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!
ఒకప్పటి అమెరికా టెలివిజన్ టాక్ షో సృష్టికర్త, నిర్మాత ఫిల్ డోనాహ్యూ బంగ్లా నేలమట్టమవుతోంది. ఇంద్ర భవనం లాంటి ఆ బంగ్లా ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆయన హయాంలో అది దాదాపు 200 కోట్లకు విక్రయించిన విలావంతమైన భవనాన్ని నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్ వద్ద ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేసే ఆ కట్టడం కనుమరుగువుతుందంటే చుట్టు పక్కల నివాసితులు సైతం కలత చెందారు. అంతలా అందర్నీ కట్టిపడేసిన భవనం ఎందుకు కూల్చేయాలనకుంటున్నారు? ప్రధాన కారణం ఏమిటో వింటే అవాక్కవుతారు. వివరాల్లోకెళ్తే..రాజభవనంలా ఉండే గోల్డ్ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనర్ ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్ ఆఫ్ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. 80వ దశకంలో టాక్ షో సృష్టికర్త డోనాహ్య, అతని భార్య, నటి మార్లో థామస్ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఈ బంగ్లాలో ఇతర వెస్ట్పోర్ట్ నివాసితులు, మరికొందరూ నటీనటులు ఎందరో ఇక్కడ గడిపి వెళ్లేవారు. 2006లో డొనహ్యు ఆ బంగ్లా దగర్లోనే మరో మల్టి మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‌ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్లకు అల్లిసన్‌కు అనే ఫైనాన్షియర్‌కి విక్రయించి వార్తల్లో నిలిచాడు. అల్లిసన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వద్ద అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పనిచేసేవాడు. నాటి ఒబామా సైతం బీచ్ వద్ద ఉండే ఈ అందమైన భవనం కోసం డబ్బును వెచ్చించేందుకు యత్నించినట్లు సమాచారం. 2013లో అల్లిసన్ మరణం తర్వాత ఆ భవనాన్ని పర్యవేక్షించేవాళ్లు లేరు. 2020లో రైనర్ దంపతులు కేవలం రూ. 136 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఆ భవనం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అది రాత్రి పూట సంచరించే ఎలుకలకు నిలయంగా మారింది. దీంతో ఆ దంపతులు ఈ బంగ్లాను కూల్చివేసేలా అనుమతించాలని హిస్టారిక్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. హిస్టారిక్ డిస్డ్రిక్ కమిషన్ మాత్రం ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజుల నిరీక్షించాలని ఆ దంపతులకు స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్ వెల్లడించింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం తోపాగు అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ యత్నిస్తోంది. (చదవండి: కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..) -
War of the Golden Stool: సరిగ్గా ఇదే రోజు రగిలింది విప్లవాగ్ని...
బ్రిటీష్‌వారి కన్ను గోల్డ్‌కోస్ట్ (ఈనాటి ఘనా)పై పడింది. యుద్ధానికి కాలుదువ్వారు. అయితే బ్రిటిష్ ప్రభువులకు అంత తేలిగ్గా ఆ రాజ్యం చేజిక్కలేదు. నాలుగో ప్రయత్నంలో మాత్రమే గోల్డ్కోస్ట్ను స్వాధీనపరుచుకోగలిగారు. అయితే వారి దృష్టి బంగారు సింహాసనంపై పడింది (పేరుకే ఇది సింహాసనం. పీట సైజులో ఉంటుంది. అందుకే గోల్డెన్ స్టూల్ అని పిలిచారు) ‘నువ్వెక్కడైనా రాజేకానీ ఇక్కడ మాత్రం కాదు. ఈ సింహాసనంపై కూర్చోడానికి వీలులేదు’ అని ఎదురు తిరిగి ఆ సింహాసనంపై తమకు ఉన్న పవిత్రభావాన్ని, సెంటిమెంట్‌ను చాటుకున్నారు జనాలు. ‘ఆరునూరైనా కూర్చొని తీరుతాను’ అని ఆవేశపడ్డాడు బ్రిటీష్ గవర్నర్. అంతే...జనం కోసం సైనికులు కాదు జనమే సైనికులై జంగ్ సైరన్ ఊదారు. మార్చి 28,1900 లో యుద్ధం మొదలైంది. ఆరునెలల పాటు కొనసాగింది. ఎంతోమంది చనిపోయారు. బలమైన బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తి ముందు వారు నిలవలేక పోవచ్చు. కానీ ఆ సింహాసనాన్ని బ్రిటిష్‌వారికి దక్కకుండా, మూడో కంటపడకుండా దాచడంలో విజయం సాధించారు. ఆ తరువాత కాలంలో మాత్రం ఈ సింహాసనంపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించారు బ్రిటిష్ పాలకులు. చరిత్రలో సామాన్యుడి పోరాటానికి పట్టం కట్టిన ఈ యుద్ధం ‘గోల్డెన్స్టూల్ వార్’గా ప్రసిద్ధి పొందింది. -
తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా
సిడ్నీ : సముద్రంలో వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని కష్టపడి విడిపించిన వ్యక్తికి ఆస్ట్రేలియా అధికారులు జరిమానా విధించారు. గోల్డ్‌కోస్ట్‌లోని సముద్రపు నీటిలో మంగళవారం ఓ భారీ తిమింగలం వలలో చిక్కుకుపోయింది. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చినా వెంటనే ఎవరూ రాకపోవడంతో ఆ యువకుడు దాన్ని కాపాడటానికి ముందుకు వచ్చాడు. వెంటనే అక్కడికి తన బోటులో వెళ్లి, వలలో చిక్కుకుపోయిన తిమింగలాన్ని తన వద్ద ఉన్న కత్తి సహాయంతో విడిపించాడు. అయితే ఎంతో కష్టపడి దాన్ని విడిపిస్తే, ఒడ్డుకు రాగానే అధికారులు తనకు జరిమానా విధించారని ఆ యువకుడు వాపోయాడు. కౌన్సిల్ ఆస్తులకు నష్టం కలిగించినందుకు, తిమింగలానికి దగ్గరగా వెళ్లినందుకుగానూ క్వీన్స్లాండ్ స్టేట్ అధికారులు జరిమానా విధించినట్టు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియాలోని బీచ్‌ల చుట్టూరా వలలను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. -
నాకు ఏ అవమానం జరగలేదు: మను
ఛండీగడ్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించిన పదహారేళ్ల షూటర్ మను భాకర్‌కు అవమానం జరిగింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రదర్శనతో పిన్న వయసులోనే స్వర్ణం సాధించిన ఆమెకు సొంతూరిలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది. ఛార్కీ దాద్రీ పట్టణంలో ఫోగట్ కాప్ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు పూలమాలలతో మను భాకర్ ను సత్కరించిన అనంతరం ఆమె వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. అయితే కొంత మంది వీవీఐపీలు రావడంతో మను భాకర్ తన కుర్చీలో నుంచి లేవాల్సి వచ్చింది. ‘పెద్దలు’ కుర్చీల్లో ఆసీనులు కావడంతో ఆమె నేలపైనే కూర్చోవలసి వచ్చింది. కాగా, రెజ్లర్లు వినేష్ ఫోగట్, బబితా కుమారీలను కూడా ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ ఘటనపై మను భాకర్ తండ్రి స్పందిస్తూ.. అదేం లేదు. పెద్దల్ని గౌరవించడంలో భాగంగానే ఆమె నేలపై కూర్చుంది. అది సంప్రదాయంలో భాగమే. ఆమె తన చర్యతో పెద్దల్ని గౌరవించడం పట్ల యువతకు ఒక సందేశాన్నిచ్చింది. దీన్ని అనవసరంగా రాద్దాంతం చేయొద్దని వ్యాఖ్యానించారు. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే సత్తా చాటిన భాకర్, సీనియర్లను తలదన్ని ఎయిర్ పిస్టల్ షూటింగ్లో 240.9 పాయింట్లు (కామన్వెల్త్ గేమ్స్ రికార్డు) సాధించి బంగారు పతకాన్ని గెలుపొందడం విశేషం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మను భాకర్ స్పందించారు. మీరేదో ఊహించుకుని వార్తలు రాయడం సరికాదని ఆమె మీడియాను ఉద్దేశించి అన్నారు. ‘నాకు ఏ అవమానం జరగలేదు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దల్ని గౌరవించి నేను కింద కూర్చున్నాను. దానికి ఎందుకు అంత ప్రాధాన్యం.. పెద్దల్ని గౌరవించడం తప్పా..? మన కన్నా పెద్దవారొచ్చినప్పుడు వారిని గౌరవించకుండా హుందాగా అలానే కూర్చుంటారా..? అని ప్రశ్నించింది. -
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
-
వరుసగా మూడో కామన్వెల్త్లో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. గురువారం జరిగిన పురుషుల 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రెజ్లర్ సుశీల్ భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని చేర్చారు. స్వర్ణం కోసం జరిగిన పోరులో దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది. కామన్వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2010- ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2014- గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం 2018- ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణం -
పసిడి పోరుకు మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పంచ్ అదిరింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో మేరీకోమ్ 5-0 తేడాతో శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షిపై గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా మేరీకోమ్ రజత పతకం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ మహిళల 48 కేజీల కేటగిరీలో భాగంగా మొత్తం ఐదు రౌండ్లు పాటు జరిగిన సెమీస్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మేరీకోమ్ 30-27, 30-27, 30-27, 30-27, 30-27 తేడాతో అనూష దిల్రుక్షిపై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే పసిడి పోరులో ఉత్తర ఐర్లాండ్ క్రిస్టినా ఓ హరాతో మేరీకోమ్ తలపడనుంది. -
భారత్ ఖాతాలో మరో పసిడి
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్.. హీనా సిద్దూ పసిడి పతకాలు సొంతం చేసుకోగా.. తాజాగా శ్రేయాసి సింగ్ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్లో పోటీపడిన శ్రేయాసి.. ఫైనల్లో ఆస్ట్రేలియా ఫేవరేట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించింది. 2014 లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి, ఈసారి స్వర్ణాన్ని ముద్దాడింది. ఇదే ఈవెంట్లో మరో ఇండియన్ షూటర్ వర్ష వర్మన్ ఒక్క పాయింట్ తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్‌లో భారత్‌కు చెందిన షూటర్ అంకుర్ మిట్టల్‌కు కాంస్యం దక్కింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 24 పతకాలతో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
-
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 38 రికార్డు స్కోర్ నమోదు చేయడంతో హీనాకు పసిడి ఖాయమైంది. ఇప్పటికే 10మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుకెక్కింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 11కు చేరగా 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం మెడల్స్ సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
-
కామన్వెల్త్ : బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడిని సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్ జోడిలు గెలుపొంది భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అంతకుముందు సెమీ ఫైనల్లో సింగపూర్‌పై విజయం సాధించి తుది పోరుకు చేరిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. అదే ఊపును ఫైనల్లో కూడా కొనసాగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అశ్విన్ పొన్నప్ప-సాత్విక్ జోడి 21-14, 21-14, 21-15 తేడాతో చాన్ పెంగ్ సూన్-గో లి యింగ్ ద్వయంపై గెలిచి ఆధిక్యం సాధించగా, ఆపై శ్రీకాంత్ 21-17, 21-14 తో చాంగ్ లీపై విజయం సాధించాడు. దాంతో భారత్‌కు 2-0తో స్పష్టమైన ఆధిక్యం లభించింది. కాగా, పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఓటమి పాలైంది. సాత్విక్-చిరాగ్ జోడి 15-21, 19, 21తేడాతో పరాజయం చెందింది. దాంతో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది. ఇక చివరి మ్యాచ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-11,19-21, 21-9 తేడాతో చీహ్‌పై గెలుపును సాధించింది. తొలి గేమ్‌ను గెలిచిన సైనా, రెండో గేమ్‌ను చేజార్చుకుంది. కాగా, కీలకమైన ఆఖరి గేమ్‌లో పుంజుకున్న సైనా.. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి గేమ్‌ను 21-9 తేడాతో గెలుచుకున్న సైనా నెహ్వాల్ భారత్‌కు స్వర్ణాన్ని ఖాయం చేసింది. ఇది భారత్‌కు 10వ స్వర్ణం. కాగా, పతకాల సంఖ్య 19కు చేరింది. -
కామన్వెల్త్ గేమ్స్: భారత్ పసిడి జోరు.!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత అథ్లేట్స్ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్స్ టేబుల్ టెన్నిస్( టీటీ)లో భారత్ బృందం అచంట శరత్, సాతియన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్ స్వర్ణపతకం సాధించారు. టీమ్ ఈవెంట్లో భాగంగా సోమవారం నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 లతేడాతో బోడే అబియోడన్‌ను ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. రెండో గేమ్‌లో సత్యన్ జ్ఞానశేఖర్ 10-12, 11-3, 11-3, 11-4 తేడాతో సెగన్ టోరిలియోపై నెగ్గడంతో భారత్ 2-0తో పై చేయి సాధించింది. ఇక మూడో గేమ్ డబుల్స్‌లో జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్‌ల జోడి 11-8,11-5,11-3ల తేడాతో ఓలాజిడ్ ఓమాతియో, అబియోడన్ జంటను ఓడించడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. దీంతో భారత స్వర్ణాల సంఖ్య 9కి చేరగా పతకాల సంఖ్య 18కి చేరింది. ఇప్పటివరకూ 9 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
షూటింగ్: భారత మహిళల గురి అదుర్స్!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు. ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
కామన్వెల్త్లో భారత్ గోల్డెన్ రన్!
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. తాజాగా భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్‌ను కొల్లగొట్టాడు. కాగా, ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్ కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్ కాంస్యాన్ని సాధించాడు. దీంతో భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాల (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 48 పతకాల(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు)తో రెండోస్థానంలో ఉంది. -
రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత వనితలు
-
పసిడి కాంతలు...
తొలి రోజు ఒకటి... రెండో రోజు ఒకటి... మూడో రోజు రెండు... నాలుగో రోజు మూడు... మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పసిడి పతకాల వేట మరింత జోరందుకుంది. ఈ ‘పసిడి’ పతకాల విజయ యాత్రలో అమ్మాయిలు తమ అద్వితీయ విన్యాసాలతో భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. పోటీల నాలుగో రోజు ఆదివారం భారత క్రీడాకారిణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్ యాదవ్ (69 కేజీలు) ‘లిఫ్ట్’కు బంగారు పతకం ఒడిలోకి చేరగా... ఆ తర్వాత షూటింగ్లో మను భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) గురికి మరో పసిడి పతకం వచ్చేసింది. చివర్లో మహిళల టీటీ జట్టు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్‌ను బోల్తా కొట్టించి ఈ క్రీడల చరిత్రలోనే తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. గోల్డ్‌కోస్ట్: భారత్ తరఫున మొదటి మూడు రోజులు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు కొల్లగొట్టగా... నాలుగోరోజు వీరి సరసన షూటర్లు, టీటీ క్రీడాకారిణులు కూడా చేరారు. ఫలితంగా కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఒకేరోజు మూడు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. మను మళ్లీ మెరిసె... పతకాలు సాధించే విషయంలో తమపై పెట్టుకున్న అంచనాలను భారత షూటర్లు నిజం చేశారు. ఆదివారం మొదలైన షూటింగ్ ఈవెంట్ తొలి రోజే మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హరియణాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మను భాకర్ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 240.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ 234 పాయింట్లు స్కోరు చేసి రజతం గెల్చుకుంది. గత నెలలో మెక్సికో ఆతిథ్యమిచ్చిన సీనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు, సిడ్నీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన మను అదే జోరును కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కనబరిచి ప్రపంచకప్‌లలో తాను నెగ్గిన పసిడి పతకాలు గాలివాటమేమీ కాదని నిరూపించింది. క్వాలిఫయింగ్‌లో 388 పాయింట్లు... ఫైనల్లో 240.9 పాయింట్లు స్కోరు చేసి మను కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పడం విశేషం. మరోవైపు మహిళల స్కీట్ ఫైనల్లో భారత షూటర్ సానియా షేక్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ రవి కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో రవి 224 పాయింట్లు సాధించాడు. మరో భారత షూటర్ దీపక్ కుమార్ 162 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు... వరుసగా నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు స్వర్ణం సాధించడం విశేషం. మహిళల 69 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పూనమ్ యాదవ్ మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకుంది. 2014 గ్లాస్కో గేమ్స్‌లో పూనమ్ 63 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించింది. పురుషుల 94 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్ ఠాకూర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను మొత్తం 351 కేజీలు (స్నాచ్‌లో 159+క్లీన్ అండ్ జెర్క్‌లో 192) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. 2014 గ్లాస్కో గేమ్స్‌లో వికాస్ 85 కేజీల విభాగంలో రజతం గెలిచాడు. మహిళల 75 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సీమా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మనిక మెరుపులు... ఆదివారం అన్నింటికంటే హైలైట్ భారత మహిళల టీటీ జట్టు ప్రదర్శన. టీమ్ విభాగంలో వరుసగా ఐదో స్వర్ణం సాధించాలని ఆశించిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్ జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఫైనల్లో భారత్ 3–1తో సింగపూర్‌ను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సింగపూర్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈసారి విజేతగా నిలిచి బదులు తీర్చుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల మనిక బాత్రా తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి భారత చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ మనిక 11–8, 8–11, 7–11, 11–9, 11–7తో ప్రపంచ 4వ ర్యాంకర్ ఫెంగ్ తియన్వెను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మధురిక ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో మౌమా దాస్–మధురిక ద్వయం 11–7, 11–6, 8–11, 11–7తో యిహాన్ జూ – మెంగ్యు యూ జోడీని ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 11–4, 11–7తో యిహాన్ జూపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు స్వర్ణాన్ని గెల్చుకుంది. ‘‘ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఒలింపిక్ పతక విజేతను నేను ఓడిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆమెపై గెలిచిన క్షణాన నేను ప్రపంచం శిఖరాన ఉన్నట్లు భావించాను’ అని మనిక వ్యాఖ్యానించింది. స్వర్ణ పతకాలతో భారత మహిళల టీటీ బృందం -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట
-
కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలో నాలుగో రోజు భారత్ పంట పండింది. టేబుల్ టెన్నిస్(టీటీ)లో మానికా బత్రా అండ్ కో స్వర్ణం సాధించింది. టీమ్ ఈవెంట్లో భాగంగా ఆదివారం ఢిపెండింగ్ చాంపియన్ సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా పతకాల సంఖ్య పన్నెండుకు చేరింది. మానికా బత్రా, మౌమా దాస్, మాధురికా పట్కార్, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రాబుదేలతో కూడిన భారత టీటీ జట్టు.. ఏలిన్, వాన్లింగ్ జింగ్, తియాన్వి,మెన్గ్యూ, యిహాన్ జోలతో కూడిన పటిష్టమైన సింగపూర్‌ను మట్టికరిపించింది. అండర్ డాగ్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. అదే ఊపును తుది పోరులో కూడా కొనసాగించిన భారత్ ఏకంగా పసిడిని ఖాతాలో వేసుకుఉంది. దాంతో నాలుగో రోజు ఆటలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు దక్కాయి. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. -
కామన్వెల్త్ గేమ్స్ : 6 స్వర్ణాలతో నాలుగోస్థానంలో భారత్
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. నాలుగో రోజు వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం గెలవగా.. 10 మీటర్ల మహిళల ఏయిర్ పిస్టల్ విభాగంలో మనూ భాకర్ స్వర్ణం సాధించారు. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. 10 మీటర్ల పురుషుల ఏయిర్ పిస్టల్ విభాగంలో రవికుమార్ కాంస్యం సొంతం చేసుకోగా.. పురుషుల 94 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వికాస్ ఠాకుర్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యలతో మొత్తం11 మెడల్స్‌తో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఎనిమిది పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. ఇక ఈ జాబితాలో 66 పతకాలతో(23 స్వర్ణాలు) ఆస్ట్రేలియా తొలిస్థానంలో ఉండగా.. 37 పతకాలతో(15 స్వర్ణాలు) ఇంగ్లండ్, 23 పతకాలతో(6 స్వర్ణాలు) కెనడా భారత్‌కన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. 18 పతకాలు గెలిచిన స్కాట్లాండ్ స్వర్ణపతకాల సంఖ్య(4) భారత్ కన్నా తక్కువగా ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది. -
అట్టహాసంగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం