క్రికెట్ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్‌లో భాగంగా ఆదివారం ముగ్గీరాబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముజీరబా నీరంగ్ జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కాడు.
40 ఓవర్లలో 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ప్యారడైజ్ విజయానికి కేవలం 5 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉండడంతో ప్యారడైజ్ విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఈ సమయంలో ముగ్గీరాబా కెప్టెన్ మోర్గాన్ స్వయంగా బౌలంగ్ ఎటాక్‌కు వచ్చాడు. తన వేసిన చివరి ఓవర్ లో 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టి.. తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మోర్గన్ తన బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతుల్లో నలుగుర్ని క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు పంపగా.. చివరి రెండు వికెట్లను బౌల్డ్‌రూపంలో పొందాడు. అంతర్జాతీయ మీడియా రిపోర్టులు ప్రకారం.. మోర్గాన్ గోల్డ్‌కోస్ట్ కౌన్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: World Cup 2023: భారత్- న్యూజిలాండ్ సెమీస్‌కు అంపైర్‌లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా
Comments
Please login to add a commentAdd a comment