కామన్వెల్త్ దేశాల మధ్య క్రీడల పండగకు తెర లేచింది. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని కరారే స్టేడియంలో 21వ కామన్వెల్త్ క్రీడలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత త్రివర్ణపతాకం చేత పట్టుకుని ఆరంభ కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించారు.