![Mehuli Ghosh And Apurvi Chandela Wins Silver, Bronze - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/9/Mehuli-Ghosh-And-Apurvi-Cha.jpg.webp?itok=KWfYzPMS)
రజతం, కాంస్య పతకాలతో మెహులి ఘోష్, అపూర్వి చండేలా
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్‌లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు.
ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment