air rifle event
-
దివ్యాంశ్, రమిత కొత్త ప్రపంచ రికార్డులు
డార్ట్మండ్ (జర్మనీ): ఇంటర్నేషనల్ సైసన్ స్టార్ట్ ఫర్ షూటర్స్ (ఐఎస్ఎఎస్) షూటింగ్ టోరీ్నలో భారత రైఫిల్ షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, రమితా జిందాల్ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో దివ్యాంశ్ 254.4 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచాడు. ఈ క్రమంలో 253.7 పాయింట్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో రమిత 254.1 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 254 పాయింట్లతో హాన్ జియాయు (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రమిత సవరించింది. -
ISSF World Cup: సోనమ్ మస్కర్కు రజత పతకం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ఐదో పతకం లభించింది. కైరోలో జరుగుతున్న ఈ టోరీ్నలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకం సాధించింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సోనమ్‌కు ఇదే తొలి ప్రపంచకప్ టోర్నీ కావడం విశేషం. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సోనమ్ 252.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అనా జాన్సెన్ (జర్మనీ; 253 పాయింట్లు) స్వర్ణం, అనెటా స్టాన్కివిజ్ (పోలాండ్; 230.4 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
ISSF World Cup 2024: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
భారత షూటర్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కైరోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోరీ్నలో ఆదివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లిహాయో 253.3 పాయింట్ల తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. -
Shooting C’ships 2023: ధనుశ్ శ్రీకాంత్ జట్టుకు స్వర్ణం, ఆంధ్ర షూటర్‌కు కాంస్యం
చాంగ్వాన్ (కొరియా): గురి తప్పని ప్రదర్శనతో భారత యువ షూటర్లు ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మంగళవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్, అభినవ్ షా, పార్థ్ రాకేశ్ మానెలతో కూడిన భారత బృందం పసిడి పతకం గెల్చుకుంది. ధనుశ్ శ్రీకాంత్, అభినవ్, పార్థ్ బృందం మొత్తం 1886.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో గౌతమి భానోత్, సోనమ్ మస్కర్, స్వాతి చౌధరీలతో కూడిన భారత జట్టు 1886.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఆంధ్ర షూటర్ ఉమామహేశ్‌కు కాంస్యం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయవాడకు చెందిన ఉమామహేశ్ 229 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. రొమైన్ అఫ్రెరె (ఫ్రాన్స్; 251.2 పాయింట్లు) స్వర్ణం, హాంగ్హావో వాంగ్ (చైనా; 251 పాయింట్లు) రజతం సాధించారు. ఉమామహేశ్తోపాటు ఫైనల్లో పోటీపడ్డ అభినవ్ షా 207.2 పాయింట్లతో నాలుగో స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 164.9 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. 64 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అభినవ్ షా 631.4 పాయింట్లతో తొలి స్థానంలో, ధనుశ్ శ్రీకాంత్ 629.9 పాయింట్లతో మూడో స్థానంలో, ఉమామహేశ్ 627.9 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ రైజా ధిల్లాన్ రజత పతకం సాధించింది. ఆరుగురు షూటర్లు పాల్గొన్న ఫైనల్లో రైజా, మిరోస్లావా హకోవా (స్లొవేకియా) 51 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే స్వర్ణ, రజత పతకాల కోసం ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా మిరోస్లావా రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం ఖరారు చేసుకోగా... ఒక పాయింట్ సాధించిన రైజాకు రజతం దక్కింది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్ గురి అదిరింది. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత్ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న రుద్రాంక్ష్ ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్ షూటర్ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్ 633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అంకుశ్ కిరణ్ జాదవ్ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ మ్యాచ్‌కు అర్హత సాధించారు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్ 261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ర్యాంకింగ్ మ్యాచ్‌లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్ లిహావో షెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్‌గా రుద్రాంక్ష్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రుద్రాంక్ష్ రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్‌కు అర్హత పొంది ఔరా అనిపించాడు. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్ రుద్రాంక్ష్ . గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సంధూ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్) ఈ ఘనత సాధించారు. -
భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌లో భారత్ గురి కుదిరింది. మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మెహులి ఘోష్– షాహు తుషార్ మనే జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ఓడినా... కనీసం రజతమైనా దక్కుతుంది. 60 షాట్ల క్వాలిఫయర్స్‌లో భారత జోడీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 30 జంటలు ఇందులో గురిపెట్టగా... మెహులి–తుషార్ ద్వయం 634.4 స్కోరుతో టాప్‌లేపింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, హంగేరి జోడీలు పసిడి పతకం కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శివ నర్వాల్–పాలక్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత పొందింది. -
అర్జున్ గురి అదిరె...
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఈ సీజన్‌లోని మూడో ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పసిడి బోణీ కొట్టింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అర్జున్ బబూటా సంచలన ఫలితంతో స్వర్ణ పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అర్జున్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం. 2016 జూనియర్ ప్రపంచకప్‌లో అతను స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అమెరికా షూటర్ లుకాస్ కొజెనిస్కయ్తో జరిగిన ఫైనల్లో అర్జున్ 17–9తో గెలుపొందాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫైనల్లో పోటీపడుతున్న ఇద్దరు షూటర్లలో తొలుత 16 పాయింట్లు గెలిచిన షూటర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో షాట్లో ఇద్దరు షూటర్లలో అత్యధిక స్కోరింగ్ షాట్ సాధించిన షూటర్‌కు రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇద్దరు స్కోరింగ్ షాట్ సమంగా ఉంటే ఒక్కో పాయింట్ ఇస్తారు. లుకాస్‌తో జరిగిన ఫైనల్లో 13 షాట్లలో అర్జున్ ఎనిమిదింట పైచేయి సాధించగా, లుకాస్ నాలుగు షాట్లలో భారత షూటర్కంటే ఎక్కువ స్కోరు చేశాడు. మరో షాట్లో ఇద్దరూ సమానంగా స్కోరింగ్ షాట్ కొట్టారు. అంతకుముందు ఎనిమిది మంది మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో అర్జున్ 261.1 పాయింట్లు, లుకాస్ 260.4 పాయింట్లు సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన పార్థ్ మఖీజా 258.1 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
Avani Lekhara: భారత 'అవని' పులకించింది..
AVANI LEKHARA Wins Gold Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో అవని 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఫైనల్లో అవని ఏకంగా 249.6 రికార్డు స్కోర్‌తో స్వర్ణాన్ని సాధించి భారతావనిని పులకింపజేసింది. అవని గోల్ట్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకం హోల్డ్‌లో పెట్టడంతో అధికారికంగా భారత పతకాల సంఖ్య ఆరుగా ఉంది. ఇదిలా ఉంటే, జైపుర్‌కి చెందిన 19 ఏళ్ల అవని లేఖారా.. పదేళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. నడుము కింద భాగం చచ్చుబడిపోవడంతో ఆమె నరకం అనుభవించింది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. ఈ బాధను తనలో తానే దిగమింగుకున్న అవని.. ఏదైనా రంగంలో పట్టు సాధించాలని అప్పుడే నిర్ణయించుకుంది. తండ్రి సూచన మేరకు ఆర్చరీ, షూటింగ్లలో శిక్షణ పొందింది. శిక్షణలో రైఫిల్‌ని తొలిసారి తాకినప్పుడే అవని ఈ రంగంలో ఎలాగైనా రాణించాలని డిసైడ్ చేసుకుంది. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఎ షాట్ ఎట్ హిస్టరీ' పుస్తకం ఆమెలో స్పూర్తిని రగిల్చింది. అది చదివాక ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత రైఫిల్ కూడా లేక కోచ్ దగ్గర అరువు తెచ్చుకుని శిక్షణ ప్రారంభించిన అవని.. మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు పతకాలు సాధించింది. ఇక 2017లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ పోటీల్లో రజతాన్ని సాధించిన అవని అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. సరైన శిక్షణ, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేస్తూ.. పాల్గొన్న ప్రతి పోటీలో ఏదో ఒక పతకం సాధిస్తూ వచ్చింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను నెరవేర్చుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకధారులు: 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో) 7. వినోద్ కూమార్- కాంస్య పతకం(హోల్డ్) (డిస్కస్ త్రో) చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
బోణీ అదిరింది
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలిరోజే భారత్ రెండు రజతాలతో ఖాతా తెరిచింది. షూటర్ తుషార్ మానే... జూడో ప్లేయర్ తబాబి దేవి తంగ్జామ్ రజత పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తుషార్ 247.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో సెర్బియా షూటర్లు గ్రిగొరి షమకోవ్ (249.2) స్వర్ణం, అలెక్సా మిత్రోవిక్ (సెర్బియా) కాంస్యం గెలుచుకున్నారు. చివరి షాట్ దాకా భారత ఆటగాడు స్వర్ణం రేసులో నిలిచాడు. అప్పటి వరకు షమకోవ్కు దీటుగా గురి కుదరగా... చివరి షాట్ తుషార్‌ను రజతానికి పడేసింది. ఇందులో అతనికి 9.6 పాయింట్లు రాగా, షమకోవ్ 9.9 పాయింట్లతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. మహిళల జూడో 44 కేజీల ఫైనల్లో తబాబి దేవి తంగ్జామ్ 1–11తో మరియా జిమినెజ్ (వెనిజులా) చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల హాకీలో భారత్ 10–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. రవిచంద్ర, సాగర్, సుదీప్ రెండేసి గోల్స్, శివమ్, రాహుల్, సంజయ్, మణిందర్ తలా ఒక గోల్ చేశారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లీగ్ మ్యాచ్‌లో జక్కా వైష్ణవి రెడ్డి 21–13, 21–6తో ఎలీనా అండ్రూ (స్పెయిన్)పై గెలిచింది. -
భళా... భారత గురి
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ షూటర్ల హవా కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్ ఆరో రోజు మన షూటర్లు 2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం సాధించారు. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో హృదయ్ హజారికా స్వర్ణం సాధించగా... మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు వరల్డ్ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఒక రజతం, కాంస్యం దక్కాయి. 17 ఏళ్ల హృదయ్ ఫైనల్లో మొహమ్మద్ అమీర్ (ఇరాన్)తో కలిసి 250.1 పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో విజేతను తేల్చేందుకు షూట్‌ఆఫ్ నిర్వహించగా... అందులో హజారికా 10.3 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. అమీర్ 10.2 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నాడు. గ్రిగోరీ షామకోవ్ (228.6 పాయింట్లు–రష్యా)కు కాంస్యం దక్కింది. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత జట్టు సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి కైవసం చేసుకుంది. ఎలవెనిల్ వలరివన్ (631), శ్రేయ అగర్వాల్ (628.5), మాణిని కౌశిక్ (621.2)లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 1880.7 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పడంతో పాటు పసిడి సొంతం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 249.8 పాయింట్లు సాధించి త్రుటిలో స్వర్ణం చేజార్చుకుంది. షై మెంగాయో ( 250.5 పాయింట్లు–చైనా) స్వర్ణం నెగ్గగా... శ్రేయ అగర్వాల్ (228.4 పాయింట్లు, భారత్) కాంస్యం చేజిక్కించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలు (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. మరోవైపు సీనియర్ పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్లు నిరాశ పరిచారు. స్వప్నిల్, అఖిల్, సంజీవ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
షూటింగ్ గురితో భారత్ బోణీ
ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రవి–అపూర్వీ జంటకు కాంస్యం రెజ్లింగ్‌లో పసిడి పట్టుకు ముందు ఉదయమే షూటింగ్లో భారత్ కాంస్యంతో పతకాల ఖాతా తెరిచింది. మిక్స్డ్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అపూర్వీ చండీలా–రవి కుమార్ జోడీ 429.9 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ జంట ఇంగ్షిన్ లిన్–షావోచున్ 494.1 స్కోరుతో బంగారు పతకం గెలుచుకుంది. చైనాకు చెందిన రుయోజు జావో–హవోరన్ యంగ్ (492.5 స్కోరు) జంట రజతం సొంతం చేసుకుంది. పురుషుల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధు, లక్ష్యయ్ షెరాన్, మహిళల ట్రాప్‌లో శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్స్‌కు అర్హత పొందారు. మిక్స్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మను భాకర్–అభిషేక్ వర్మ జంట ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో విఫలమైంది. చైనాదే తొలి పసిడి... జకార్తా ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం చైనా దక్కించుకుంది. పురు షుల వుషు క్రీడాంశంలో సన్ పియువాన్ బంగారు పతకం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియా ఆటగాడు జేవియర్‌కు రజతం దక్కగా, చైనీస్ తైపీకి చెందిన సయి సెమిన్ కాంస్యం గెలిచాడు. తొలి రోజు ఓవరాల్‌గా చైనా (7 స్వర్ణాలు+5 రజతాలు+4 కాంస్యాలు) 16 పతకాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 2 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. -
షూటింగ్: భారత మహిళల గురి అదుర్స్!
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా ఐదోరోజు భారత ఆటగాళ్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్లు రజతం, కాంస్య పతకాలు సాధించారు. మెహులి ఘోష్ రజతం నెగ్గగా, అదే విభాగంలో అపూర్వి చండేలా కాంస్యం కైవసం చేసుకున్నారు. టాప్ పొజిషన్లో నిలిచిన సింగపూర్‌కు చెందిన లిండ్సే వెలోసో స్వర్ణం అందుకున్నారు. ఇప్పటివరకూ 8 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టిన భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి ఉదయం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన జీతూరాయ్ స్వర్ణం గెలుచుకోగా, ఓమ్ ప్రకాశ్ మితర్వాల్ కాంస్యంతో సాధించిన విషయం తెలిసిందే. -
భళా...అభినవ్