![Shooting aims india get medal - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/20/RAVI-APOORVI-BRONZE1.jpg.webp?itok=2_5-paff)
ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో రవి–అపూర్వీ జంటకు కాంస్యం రెజ్లింగ్‌లో పసిడి పట్టుకు ముందు ఉదయమే షూటింగ్‌లో భారత్ కాంస్యంతో పతకాల ఖాతా తెరిచింది. మిక్స్‌డ్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా–రవి కుమార్ జోడీ 429.9 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ జంట ఇంగ్షిన్ లిన్–షావోచున్ 494.1 స్కోరుతో బంగారు పతకం గెలుచుకుంది. చైనాకు చెందిన రుయోజు జావో–హవోరన్ యంగ్ (492.5 స్కోరు) జంట రజతం సొంతం చేసుకుంది. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్లు మానవ్‌జీత్ సింగ్ సంధు, లక్ష్యయ్ షెరాన్, మహిళల ట్రాప్‌లో శ్రేయాసి సింగ్, సీమా తోమర్ ఫైనల్స్‌కు అర్హత పొందారు. మిక్స్‌డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్–అభిషేక్ వర్మ జంట ఫైనల్స్‌కు అర్హత సంపాదించడంలో విఫలమైంది.
చైనాదే తొలి పసిడి...
జకార్తా ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం చైనా దక్కించుకుంది. పురు షుల వుషు క్రీడాంశంలో సన్ పియువాన్ బంగారు పతకం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియా ఆటగాడు జేవియర్‌కు రజతం దక్కగా, చైనీస్ తైపీకి చెందిన సయి సెమిన్ కాంస్యం గెలిచాడు. తొలి రోజు ఓవరాల్‌గా చైనా (7 స్వర్ణాలు+5 రజతాలు+4 కాంస్యాలు) 16 పతకాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 2 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment