దివ్యాంశ్, రమిత కొత్త ప్రపంచ రికార్డులు | Divyansh Panwar and Ramita Jindal new world records in Air Rifle | Sakshi
Sakshi News home page

దివ్యాంశ్, రమిత కొత్త ప్రపంచ రికార్డులు

Published Tue, Mar 19 2024 12:52 AM | Last Updated on Tue, Mar 19 2024 12:52 AM

Divyansh Panwar and Ramita Jindal new world records in Air Rifle - Sakshi

డార్ట్‌మండ్‌ (జర్మనీ): ఇంటర్నేషనల్‌ సైసన్‌ స్టార్ట్‌ ఫర్‌ షూటర్స్‌ (ఐఎస్‌ఎఎస్‌) షూటింగ్‌ టోరీ్నలో భారత రైఫిల్‌ షూటర్లు దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్, రమితా జిందాల్‌ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో దివ్యాంశ్‌ 254.4 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచాడు.

ఈ క్రమంలో 253.7 పాయింట్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును దివ్యాంశ్‌ బద్దలు కొట్టాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌ ఫైనల్లో రమిత 254.1 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 254 పాయింట్లతో హాన్‌ జియాయు (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రమిత సవరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement