world records
-
16 ఏళ్ల వయసు.. వేల అడుగుల ఎత్తు..
సాక్షి, సిటీబ్యూరో: 16 ఏళ్లకే 16 వేలకుపైగా అడుగుల పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ్ కార్తికేయ. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్ మాసిఫ్(16,050 అడుగులు)ను అధిరోహించిన అతి పిన్న వయసు్కడైన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. నిర్మల్ పుర్జా నేతృత్వంలో బూట్స్, క్రాంపాన్స్–ఎలైట్ ఎక్స్‌పెడ్ బృందంలో విశ్వనాథ్ ఈ నెల 3న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అనంతరం సురక్షితంగా బేస్ క్యాంప్‌నకు చేరుకు న్నాడు. నవంబర్ 21న హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 25న యూనియన్ గ్లేసియర్‌కు చేరుకున్నాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం బేస్ క్యాంప్‌నకు తరలించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యాన్ని సాధించాడు. ‘నీకు నచి్చంది చేయడం వల్ల సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం ఉంటుంది’అని తన తల్లి చెప్పేదని ఆయన అన్నారు. -
వన్స్‌మోర్... వరల్డ్ రికార్డు
సిలెసియా (పోలాండ్): క్రీడాకారులెవరైనా ఒకసారి ప్రపంచ రికార్డు సృష్టిస్తేనే ఎంతో గొప్ప ఘనతగా భావిస్తారు. రెండుసార్లు బద్దలు కొడితే అద్భుతం అనుకుంటారు... మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొలి్పతే అసాధారణం అనుకుంటారు... మరి 10 సార్లు ప్రపంచ రికార్డులను సవరించిన వారిని ఏమనాలి...! ప్రస్తుతానికి మోండో డుప్లాంటిస్ అని అనాల్సిందే. వరల్డ్ రికార్డులు తన చిరునామాగా మలుచుకొని... ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులువా అన్నట్లు స్వీడన్ పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోతున్నాడు. మూడు వారాల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో తొమ్మిదోసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్... తాజాగా పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో 10వసారి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాంటిస్కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇదే మీట్లో నార్వేకు చెందిన జాకబ్ ఇంగెబ్రింగ్స్టెన్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇంగెబ్రింగ్స్టెన్ 7 నిమిషాల 17.55 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో 1996లో కెన్యా అథ్లెట్ డేనియల్ కోమెన్ (7 నిమిషాల 20.67 సెకన్లు) నెలకొలి్పన వరల్డ్ రికార్డు తెరమరుగైంది. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు జాకబ్‌కు కూడా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. -
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది. -
దివ్యాంశ్, రమిత కొత్త ప్రపంచ రికార్డులు
డార్ట్మండ్ (జర్మనీ): ఇంటర్నేషనల్ సైసన్ స్టార్ట్ ఫర్ షూటర్స్ (ఐఎస్ఎఎస్) షూటింగ్ టోరీ్నలో భారత రైఫిల్ షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, రమితా జిందాల్ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో దివ్యాంశ్ 254.4 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచాడు. ఈ క్రమంలో 253.7 పాయింట్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో రమిత 254.1 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 254 పాయింట్లతో హాన్ జియాయు (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రమిత సవరించింది. -
వారెవ్వా.. బామ్మా! ఒకేరోజు మూడు ప్రపంచ రికార్డులు
రికార్డులకు, అవార్డలుకు వయస్సుతో పనేముందని నిరూపించిందో బామ్మ. 99 ఏళ్ల వయసులో ఈజీగా ఈత కొట్టడం మాత్రమే కాదు. ఒకే రోజు ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. డచ్-కెనడియన్ బెట్టీ బ్రస్సెల్ ఈ నెల 20న అద్భుతమైన ఈ ఫీట్ సాధించింది. 400-మీటర్ల ఫ్రీస్టైల్, 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 50-మీటర్ల బ్యాక్ అనే మూడు విభాగాల్లో తన సత్తా చాటింది. తనకు ఏజ్ అస్సలు మేటర్ కాదంటోంది. ఇదీ చదవండి: ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా? స్విమ్మింగ్ కెనడా లెక్కల ప్రకారం 12 నిమిషాల 50 సెకన్లతో ఉన్న 400-మీటర్ల ఫ్రీస్టైల్ రికార్డును దాదాపు నాలుగు నిమిషాల్లో బ్రేక్ చేసింది. అలాగే 50-మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ను ఐదంటే ఐదు సెకన్లలో ఛేదించి వాహ్వా అనిపించుకుంది. ‘‘నేను రేసులో ఉంటే ఇక దేన్నీ పట్టించుకోను. ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్!'‘ అని చెప్పిందామె. (Oyster Mushrooms: బెనిఫిట్స్ తెలిస్తే.. అస్సలు వదలరు!) బ్రస్సెల్ 60 సంవత్సరాల వయస్సు నుండి మాత్రమే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ ఉండటం విశేషం. కానీ ఇటీవలి అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను దక్కించుకుంది. ‘‘అమ్మా నీకు ముసలి తనం వచ్చేసిందని నా 70 ఏళ్ల చిన్న కొడుకుఅంటూ ఉంటాడు. కానీ నాకు అలా అనిపించదు. నిజంగా అలసి పోయినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. అంతే’’ అంటారామె. అలాగే రికార్డుల గురించి కూడా ఆలోచించను. చేయాల్సిన పనిని ధైర్యంగా చేసేస్తాను. గెలిస్తే సంతోషిస్తాను అంటుంది బోసి నవ్వులతో. బ్రస్సెల్స్ ఇప్పటికీ కనీసం వారానికి రెండుసార్లు స్విమ్మింగ్ చేస్తుంది. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్‌కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్‌రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్‌లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్‌లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్‌లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్‌ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో మెన్స్ క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. చైనాలోని హోంగ్జూలో నేపాల్- మంగోలియాతో బుధవారం తొలి టీ20 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ 34 బంతుల్లోనే శతకం బాదిన అతడు.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కుశాల్, దీపేంద్ర ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన నేపాల్ 314 పరుగులు స్కోరు చేసింది. ప్రపంచ రికార్డులు బద్దలు తద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. తద్వారా అఫ్గనిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. సిక్సర్ల జట్టుగా ఇక ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మరో అరుదైన ఘనత కూడా ఖాతాలో వేసుకుంది నేపాల్ క్రికెట్ జట్టు. టీ20 ఫార్మాట్ హిస్టరీలో సింగిల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్‌గా నిలిచింది. నేపాల్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 26 సిక్స్‌లు బాదగా.. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్‌లు కొట్టింది. సంచలన విజయం మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
4 వరల్డ్ రికార్డులు సాధించిన 14 ఏళ్ల నగర బాలుడు..
హైదరాబాద్: అతి ఎత్తైన పర్వాతాలను అధిరోహిస్తూ ఇప్పటికే 3 వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్న నగరానికి చెందిన 14 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ మరో వరల్డ్ రికార్డును సాధించాడు. ఈ నెల 17న లద్దాక్ సమీపంలో హిమాలయాల్లోని 6,400 మీటర్ల ఎత్తైన కాంగ్ యాట్సే–1 పర్వతాన్ని అధిరోహించి నాల్గో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విశ్వనాథ్ కార్తికేయ గతంలోనే 6.270 మీటర్ల ఎత్తున్న కాంగ్ యాట్సే పర్వతాన్ని, 6,240 మీటర్ల ఎతైన ద్జోజొంగో పర్వాతాన్ని అధిరోహించి ఈ పర్వతాల శిఖరాగ్రాలను చేరుకున్న అతిపిన్న వయస్కునిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఐరోపాలోనే అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వత తూర్పు(5,621మీ), పడమర(5,642మీ) శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పర్వత శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ప్రయాణం సాగిందిలా..., తన నాల్గో వరల్డ్ రికార్డ్ శ్రీకాంగ్ యాట్సే–1శ్రీను పూర్తి చేయడంలో భాగంగా ఈ నెల 7న 3 వేల మీటర్ల ఎత్తలోని శ్రీలేహ్శ్రీకు చేరుకున్నాడు. అనంతరం 5,100 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంపును 13వ తేదీన చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో రెండు రోజుల ట్రెక్కింగ్ తరువాత 5,700 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్–1ను, 16న 5,900 మీటర్ల బేస్ క్యాంప్–2ను చేరుకున్నాడు. చివరగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ నెల 17న 6,400 మీటర్ల ఎత్తైన శిఖరాగ్రాన్ని చేరుకుని రికార్డు సృష్టించాడు. ట్రెక్కింగ్‌పైన ఆసక్తిని క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అతడి తల్లి లక్ష్మీ తెలిపింది. ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే లక్ష్యంగా తన కుమారుడి ప్రయాణం ముందుకు సాగుతుందన్నారు. ట్రెక్కింగ్‌తో పాటు చదువులను సైతం అదే క్రమంలో కొనసాగిస్తున్నాడన్నారు. 4వ వరల్డ్ రికార్డు సాధించిన విశ్వనాథ్ కార్తికేయ ఈ రోజు నగరానికి చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్‌లోనే. దాంతో భారత్‌లో జెమ్ క్యాపిటల్‌గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్‌లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్‌చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్‌కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్‌కు ఆహ్వానించగా భారత్‌కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్‌లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్‌ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్‌ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్‌కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్‌హీట్‌ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్‌చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్‌ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్‌గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లేఆఫ్‌లో సెంచరీ చేసిన ఏడో బ్యాటర్‌గా; ఒక్క శతకంతో ఇన్ని రికార్డులా
గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లోనే పీక్ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్-2 పోరులో గిల్ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న గిల్‌కు ఇది సీజన్లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక్క సెంచరీతో గిల్ తన పేరిట చాలా రికార్డులు లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌లో సెంచరీ బాదిన ఏడో క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్ 2014లో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు, ఐపీఎల్ 2018లో షేన్ వాట్సన్ 117 పరుగులు, ఐపీఎల్ 2014లో వృద్ధిమాన్ సాహా 115 పరుగులు, ఐపీఎల్ 2022లో మురళీ విజయ్ - 113, ఐపీఎల్ 2022లో రజత్ పాటిదార్ 112 పరుగులు, ఐపీఎల్ 2022లో జోస్ బట్లర్ 106 పరుగులు ప్లేఆఫ్‌లో సెంచరీలు చేశారు. ► ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) శుబ్‌మన్ గిల్ నిలిచాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో 129 పరుగులు చేసిన గిల్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ తరపున 122 పరుగులు ఇప్పటివరకు టీమిండియా తరపున ఏ బ్యాటర్‌కైనా ప్లేఆప్లో అత్యధిక స్కోరు. తాజాగా గిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక 2020లో పంజాబ్ కింగ్స్ తరపున 132 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ఒక సీజన్లో 800 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇంతకముందు విరాట్ కోహ్లి 2016లో 973 పరుగులు చేశాడు. ఇక సెంచరీల విషయంలోనూ మరొక రికార్డు సాధించాడు. ఒక సీజన్లో మూడు సెంచరీలు చేసిన గిల్.. ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి(2016లో నాలుగు సెంచరీలతో) ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి(2016), బట్లర్(2022) నాలుగు సెంచరీలతో సంయుక్తంగా తొలి స్థానంలో ఉండగా.. గిల్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ► ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా గిల్.. సాహా, రజత్ పాటిదార్లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 49 బంతుల్లోనే శతకం అందుకోగా.. గతంలో సాహా ఐపీఎల్ 2014 ఫైనల్లో, రజత్ పాటిదార్(2022 ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో) 49 బంతుల్లోనే శతకం సాధించారు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో గిల్ తొలిస్థానంలో ఉన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇంతకముందు వృద్దిమాన్ సాహా(2014 ఫైనల్). క్రిస్ గేల్(2016 ఫైనల్), వీరేంద్ర సెహ్వాగ్(2014 క్వాలిఫయర్-2), షేన్ వాట్సన్(2018 ఫైనల్) తలా 8 సిక్సర్లు బాదారు. 𝙂𝙄𝙇𝙇𝙞𝙖𝙣𝙩! 👏👏 Stand and applaud the Shubman Gill SHOW 🫡🫡#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/ADHi0e6Ur1 — IndianPremierLeague (@IPL) May 26, 2023 His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 చదవండి: గిల్ సెంచరీ.. ఒకే సీజన్లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా -
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
ఆల్‌టైమ్ పర్ఫెక్ట్ టీ20 మ్యాచ్.. డజన్‌కు పైగా రికార్డులు బద్దలు
సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న (మార్చి 26) జరిగిన రసవత్తర మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కూడా కొల్లగొట్టారు. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి. ఆ రికార్డులేవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ (సౌతాఫ్రికా- 259 టార్గెట్) అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్- 258/5 అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్ స్కోర్- 259/4 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35 అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394 వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో) సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15 బంతుల్లో) పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0 (సౌతాఫ్రికా) అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో) మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149) -
4 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. శుభ్‌మన్ గిల్ పేరిట పలు రికార్డులు
అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇవాళ (జనవరి 24) న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న గిల్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 112 చేశాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీని, గత 4 వన్డేల్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 208) కూడా ఉంది. ఇవాల్టి మ్యాచ్‌లో గిల్ సెంచరీ సాధించాక పలు ప్రపంచ రికార్డుల్లో భాగమయ్యాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వన్డే సెంచరీలు (21) పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన ఇమామ్ ఉల్ హాక్ (9) అగ్రస్థానంలో ఉండగా.. క్వింటన్ డికాక్ (16), డెన్నిస్ అమిస్ (18), షిమ్రోన్ హెట్మేయర్ (22) 2, 3, 5 స్థానాల్లో నిలిచారు. భారత్ తరఫున అతి తక్కువ వన్డేల్లో 4 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ 24 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. గిల్ 21 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో గిల్ మరో ప్రపంచ రికార్డును సమం చేశాడు. 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరసన నిలిచాడు. బాబర్ 2016 విండీస్ సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో అన్నే పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఇమ్రుల్ కయేస్ (349), డికాక్ (342), గప్తిల్ (330) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38.4 ఓవర్ల పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. రోహిత్ (101), గిల్ (112)తో పాటు కోహ్లి (36), ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఔటయ్యారు. -
అతిపెద్ద హాకీ స్టిక్ సైకత శిల్పంగా ప్రపంచ రికార్డు
దేశంలో పురుషుల హాకీ ప్రపంచకప్ జరుగుతున్నందున ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ మేరకు ఆయన అతి పెద్ధ హాకీ స్టిక్ రూపంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. దీన్ని లాభాప్రేక్షలేని సంస్థ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద సైకత హాకీ స్టిక్‌గా గుర్తించింది. ఒడిశాలో కటక్‌లోని మహానది ఒడ్డున సుమారు 5 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన సైకత శిల్పాన్ని పట్నాయక్ రూపొందించారు. ఈ క్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ..వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికేట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. (చదవండి: ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..) -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 112 ఏళ్ల రికార్డు బద్దలు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ రికార్డుల మోత మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలి రోజే 506 (4 వికెట్ల నష్టానికి) పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1910 డిసెంబర్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్ తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. World Record Day!#ENGvPAK pic.twitter.com/1WqQzmhNpC — RVCJ Media (@RVCJ_FB) December 1, 2022 ఈ రికార్డుతో పాటు తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్ తొలి సెషన్లో 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్లో 158 పరుగులు స్కోర్ చేసింది. తాజాగా ఇంగ్లండ్.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది. Stumps in Rawalpindi 🏏 England rewrite record books on their historic return to Pakistan 🙌 #WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/WPDooIc2ee — ICC (@ICC) December 1, 2022 ఇవే కాక, ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఈ మ్యాచ్‌లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు 75 ఓవర్లలో 6.75 రన్‌రేట్ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. -
38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు
విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా తమిళనాడు-అరుణాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన గ్రూప్-సి మ్యాచ్ కనీవినీ ఎరుగని రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) డబుల్ సెంచరీతో శివాలెత్తడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాలీ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యంత భారీ విజయంగా రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. ఓపెనర్లు జగదీశన్, సాయ్ సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం ఆసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్.. 28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటై, లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మణిమారన్ సిద్ధార్థ్ (5/12) అరుణాచల్‌ప్రదేశ్ పతనాన్ని శాశించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జగదీశన్ వ్యక్తిగతంతా పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే టోర్నీలో 4 వరుస శతకాలు బాదిన (114 నాటౌట్, 107, 168, 128) జగదీశన్.. తాజాగా డబుల్ సెంచరీతో వరుసగా ఐదో శతకాన్ని నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు చేయడం ప్రపంచ రికార్డు. గతంలో శ్రీలంక దిగ్గజం సంగక్కర, సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్, భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా 4 శతాకలు బాదారు. ఈ మ్యాచ్‌లో డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ (శ్రీలంకపై 264 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జగదీశన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ విభాగంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268) పేరిట ఉండేది. డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి శతకాన్ని సాధించేందుకు 76 బంతులు తీసుకున్న అతను.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని ఇన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం కూడా లిస్ట్-ఏ క్రికెట్లో రికార్డే. మొత్తానికి నారాయణ్ జగదీశన్ ధాటికి లిస్ట్-ఏ రికార్డులు చాలావరకు బద్ధలయ్యాయి. అతను సృష్టించిన విధ్వంసం ధాటికి పలు ప్రపంచ రికార్డులు సైతం తునాతునకలయ్యాయి. అతని సిక్సర్ల సునామీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొట్టుకుపోయింది. -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్
ప్రొద్దుటూరు: బుడి బుడి అడుగులు వేస్తున్న రెండేళ్ల 10 నెలల చిన్నారి వినిశకు నోబెల్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శాస్త్రి నగర్‌కు చెందిన విశ్వనాథుల సౌమ్యప్రియ, పవన్‌కుమార్ కుమార్తె వినిశ ప్రతిభ చూపినందుకు నోబెల్ వరల్డ్ వారు ‘వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్’ ప్రశంసా పత్రం, మెడల్, రూ.2వేలు అందించారు. ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో ఈ చిన్నారి 30 పద్యాలు, సోలార్ సిస్టం, వారాలు, నెలల పేర్లు, చెస్ పెట్టడంలో, 50 జీకే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఈ అవార్డు బహూకరించారు. ఈ చిన్నారి గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. -
శభాష్ విజయ్.. యోగాలో గిన్నిస్ రికార్డ్
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్ట్ 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డ్యాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చదవండి: 17 నుంచి గుంటూరులో అగ్రి ఇన్ఫోటెక్–2021 భార్యాభర్తలిద్దరికీ గిన్నిస్‌బుక్‌లో స్థానం విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు విజయ్‌కు కూడా అదే యోగాలో గిన్నిస్ బుక్‌లో స్థానం లభించడం గొప్పవిషయమని గిన్నిస్‌బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. చైనాలో కుంగ్ ఫూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతోమంది నిష్ణాతులు ఉంటారని, అక్కడ పోటీని తట్టుకొని యోగాసనాల్లో గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం సంతోషంగా ఉందని విజయ్ ‘సాక్షి’తో చెప్పారు. -
బుల్లి భగవద్గీత.. చదరపు సెంటీమీటరు పుస్తకంలో..!
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్‌లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్‌రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు. -
చూపుడు వేలుపై 3 గంటలకు పైగా
భవానీపట్న (ఒడిశా): హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆకట్టుకోగా... ఓ ఒడిశా యువకుడు మరో అరుదైన ఫీట్ చేశాడు. బొలాంగిర్ జిల్లాలోని జముత్జోలా గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌గోపాల్ భోయ్ కుడిచేతి చూపుడు వేలుపై ఏకంగా 3 గంటల 22 నిమిషాల 22 సెకన్లపాటు హాకీ స్టిక్‌ను నిలబెట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించాడు. గిన్నిస్ నిబంధనల మేరకు సమయాన్ని నమోదుచేసే వారు, జడ్జిలు, వీక్షకుల సమక్షంలో... వీడియో చిత్రీకరణ జరుగుతుండగా... రాజ్‌గోపాల్ ఈ అరుదైన ఫీట్ చేశాడు. అత్యధిక సమయం చూపుడు వేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టిన వరల్డ్ రికార్డు ప్రస్తుతం 2 గంటల 22 నిమిషాలతో బెంగళూరుకు చెందిన హిమాంశు గుప్తా పేరిట ఉంది. రాజ్‌గోపాల్ విన్యాసానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను నిశితంగా అధ్యయనం చేసిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అతని ఘనతను గుర్తించి సర్టిఫికెట్ జారీచేయనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తి కావాలని... సంకల్పబలంతోనే ఇది సాధ్యమని ఈ ఫీట్‌కు నిర్వాహకునిగా వ్యవహరించిన సత్యపిర్ ప్రధాన్ అన్నారు. -
Tokyo Olympics: ప్రపంచ రికార్డులను ఎత్తేశాడు
జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె సంచలన ప్రదర్శన చేశాడు. బుధవారం పురుషుల +109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో లాషా... తన ఆకారానికి తగ్గట్టే బరువులను ఇట్టే ఎత్తేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు... 176 కేజీల బరువుతో అజానుబాహుడైన లాషా... మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన అలీ డెవౌడి (ఇరాన్) కంటే లాషా 47 కేజీలు ఎక్కువగా ఎత్తడం విశేషం. ఒలింపిక్స్‌లో లాషాకు ఇది రెండో స్వర్ణం. 2016 రియోలో +105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అతడు బంగారు పతకంతో మెరిశాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్‌లో 200+క్లీన్ అండ్ జెర్క్‌లో 241)తో రజతాన్ని.... మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్‌లో 190+క్జీన్ అండ్ జెర్క్‌లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు. -
సోనూసూద్ చిత్రం.. 12 వరల్డ్ రికార్డులు
చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దాసరి యశ్వంత్ ఆర్ట్ వర్క్‌లో 12 వరల్డ్ రికార్డులు సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ కేపీ కుమార్ వెల్లడించారు. గత నెల 22న తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ అయిన సోనూసూద్ 2,938.548 అడుగుల చిత్రాన్ని 2 గంటల 57 నిమిషాలలో పూర్తి చేసి ఒకేసారి 12 వరల్డ్ రికార్డులు సాధించాడని పేర్కొన్నారు. వరల్డ్ రికార్డులు అందించే టీం సభ్యులు ఈ చిత్రాన్ని పరిశీలించి, అతి తక్కువ సమయంలో దీనిని పూర్తి చేసినట్లు గుర్తించారన్నారు. ఇందుకు సంబంధించిన వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలను ఈ నెల 3వ తేదీన విద్యార్థి యశ్వంత్‌కు అందజేసినట్లు చెప్పారు. రెండు చేతులతోను, రెండు కాళ్లతోను, నోటితోను బొమ్మలు వేయగలడం, 7 అడుగుల చిత్రాన్ని రివర్స్‌లో వేయడం యశ్వంత్ ప్రత్యేకతని తెలిపారు. వరల్డ్ రికార్డులు సాధించిన యశ్వంత్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా!
ఒకప్పుడు ఎవరి ఫోన్ నంబర్ అయినా తడుముకోకుండా టకటకా చెప్పేవాళ్లం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంట్లో వాళ్ల నంబర్లు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో.. ప్రపంచ దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడ వినియోగించే కరెన్సీ పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతోంది పదేళ్ల సారా ఛిపా. భారతసంతతికి చెందిన సారా ఇటీవల జరిగిన వరల్డ్ రికార్డ్స్ పోటీలో పాల్గొని.. 196 దేశాల పేర్లు, రాజధానులు, ఆయా దేశాల్లో వాడే కరెన్సీ పేర్లను అవలీలగా చెప్పి వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఈ రికార్డు సాధించిన వారంతా దేశాల పేర్లు వాటి రాజధానుల పేర్లు మాత్రమే చెప్పగా.. సారా వీరందరికంటే ఒక అడుగు ముందుకేసి ఆయా దేశాల కరెన్సీల పేర్లు కూడా చెప్పడం విశేషం. గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎమ్‌జీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో పాల్గొన్న సారా అన్ని దేశాల కరెన్సీ, రాజధానుల పేర్లు కరెక్టుగా చెప్పి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంది. కాగా ఈవెంట్‌ను యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ మాధ్యమాలలో లైవ్ టెలికాస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని భిల్వారా.. సారా స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ వృత్తిరీత్యా గత తొమ్మిదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. సారాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. జెమ్స్ మోడరన్ అకాడమీలో ఆరోతరగతి చదువుతోన్న సారా 1500 గంటలకు పైగా సాధన చేసి ఈ కేటగిరీలో గెలిచిన తొలి భారతసంతతి వ్యక్తిగా నిలిచింది. అనుకోకుండా.. సారా వరల్డ్ రికార్డులో పాల్గొనాలని మెమరీ టెక్నిక్స్ నేర్చుకోలేదు. లాక్డౌన్ సమయంలో జ్ఞాపకశక్తి, సృజనాత్మకు పదును పెట్టేందుకు ముంబైకు చెందిన ‘బ్రెయిన్ రైమ్ కాగ్నిటివ్ సొల్యూషన్’ వ్యవస్థాపకులు సుశాంత్ మీసోర్కర్ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కొన్ని సెషన్ల తరువాత సారాలో చురుకుదనం గమనించిన సుశాంత్ ఆమెకు మరింత ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు పోటీలో పాల్గొనేందుకు ప్రేరేపించారు. ప్రారంభంలో 585 పేర్లను గుర్తు పెట్టుకోవడానికి సారాకు గంటన్నర పట్టేది. సాధన చేస్తూ చేస్తూ కేవలం 15 నిమిషాల్లోనే పేర్లను చెప్పగలిగేది. మూడు నెలల పాటు ఎంతో కష్టపడి క్రియేటివ్ లెర్నింగ్, మెమరీ టెక్నిక్‌ల ద్వారా దేశాల రాజధానులు, కరెన్సీ పేర్లను గుర్తుపెట్టుకుంది. షైన్ విత్ సారా సారా జ్ఞాపకశక్తిపరంగా చురుకైన అమ్మాయే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా. వివిధ కార్యక్రమాల్లో స్టేజిపై నాట్యప్రదర్శనలు ఇచ్చింది. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగా, బ్రీతింగ్ టెక్నిక్లను సాధన చేస్తోంది. ఇంకా ‘షైన్ విత్ సారా’ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతూ..‘‘ఇన్క్రెడిబుల్ ఇండియా’’ పేరుతో వీక్లి సిరీస్‌లను అందిస్తోంది. ‘‘నేను ఈ రికార్డును నెలకొల్పడానికి నా గురువు సుశాంత్, తల్లిదండ్రులే నాకు ప్రేరణ. నా మీద నమ్మకముంచి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు వరల్డ్ రికార్డును సాధించగలిగాను’’ అని సారా చెప్పింది. ‘‘ప్రపంచ రికార్డు హోల్డర్‌కు తండ్రినైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. యూఏఈలో ఉంటున్నప్పటికీ నేను భారతీయుడినైనందుకు ఎంతో గర్వంగా ఉంది. సారా జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సారా తండ్రి సునీల్ చెప్పారు.