ఐదు ప్రపంచ రికార్డులు | China bags two weightlifting golds in Asiad | Sakshi
Sakshi News home page

ఐదు ప్రపంచ రికార్డులు

Published Fri, Sep 26 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

ఐదు ప్రపంచ రికార్డులు

ఐదు ప్రపంచ రికార్డులు

ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో గురువారం ఐదు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో మూడు షూటింగ్‌లోనే రావడం విశేషం. మహిళల ‘డబుల్ ట్రాప్’ టీమ్ విభాగంలో యాఫి జాంగ్, యిట్లింగ్ బాయ్, మీ జూలతో కూడిన చైనా జట్టు 315 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో షెంగ్‌బో, జిన్ లాన్, గాంగ్ లియులతో కూడిన చైనా బృందం 1876 పాయింట్లతో ప్రపంచ రికార్డు లిఖించింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 75 కేజీల విభాగంలో కిమ్ ఉన్‌జు (ఉత్తర కొరియా) క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 164 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.ఆర్చరీలో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియా  238 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement