Womens Weightlifting
-
మీరా ఔరా అనిపించేనా?
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో... పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌కు పతకం అందించి సంబరాల్లో ముంచెత్తిన భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను... బుధవారం ‘పారిస్’ క్రీడల బరిలోకి దిగనుంది. 49 కేజీల విభాగంలో గత ఒలింపిక్స్‌లో 202 కేజీలు (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.అయితే కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాను.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఆ రెండూ మహిళా లిఫ్టర్లే గెలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో దిగ్గజ లిఫ్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా... టోక్యోలో మీరాబాయి రజతం నెగ్గింది. గత ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిన మీరాబాయి.. ఆ తర్వాత గాయాల బారిన పడి అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది.2022 కామన్వెల్త్ క్రీడల్లో మాత్రమే 200 కేజీల మార్కు దాటగ లిగింది. ఇక తాజాగా ‘పారిస్’ క్రీడల్లో మీరాబాయి ఎంట్రీ వెయిట్ 200 కేజీలుగా నమోదు చేసుకుంది. ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ హో జీహుయి (చైనా), డెలాక్రజ్ (అమెరికా), సురోచన ఖామ్బో (థాయ్‌లాండ్), మిహేలా కామ్బెయి (రొమేనియా) మీరాకన్నా మెరుగైన ఎంట్రీ వెయిట్ నమోదు చేసుకున్నారు. ఈసారి పోటీల తీవ్రతను బట్టి చూస్తే.. మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన (205 కేజీలు) కనబర్చగలిగితేనే పతకం రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనా లిఫ్టర్ హో జీహుయి మరోసారి స్వర్ణంపై గురి పెట్టింది. మీరాబాయి గాయం నుంచి పూర్తిగా కోలుకుందని కోచ్ విజయ్ శర్మ పేర్కొన్నారు. ‘మీరా 200 కేజీలు సునాయాసంగా దాటగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎత్తిన 202 కేజీల బరువును మించిన ప్రదర్శన చేస్తుంది. సవాలు స్వీకరించేందుకు చాను సిద్ధంగా ఉంది’ అని విజయ్ శర్మ అన్నాడు. -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించిన భారత యువ వెయిట్ లిఫ్టర్
Harshada Sharad Garud First Indian To Win Gold At Junior World Weightlifting Championship: న్యూఢిల్లీ: గతంలో ఏ జూనియర్ భారతీయ వెయిట్‌లిఫ్టర్‌కు సాధ్యంకాని ఘనతను మహారాష్ట్ర అమ్మాయి హర్షద శరద్ గరుడ్ సొంతం చేసుకుంది. గ్రీస్‌లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్షద మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఈ పుణే అమ్మాయి గుర్తింపు పొందింది. Meet the first podium of the 2022 IWF Junior World Championships! It was fantastic to watch the W45kg Group A in Heraklion, Greece. Congratulations to the winners!🏋🏻♀️🇬🇷 🥇Sharad Garud Harshada (IND) 🥈Cansu Bektas (TUR) 🥉Teodora-Luminita Hincu (MDA) pic.twitter.com/vW1azofbNv — IWF (@iwfnet) May 2, 2022 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన హర్షద ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరి సింది. స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కాన్సు బెక్టాస్ (టర్కీ–150 కేజీలు) రజతం... హిన్కు లుమినిత (మాల్డోవా–149 కేజీలు) కాంస్యం నెగ్గారు. గతంలో భారత్ తరఫున ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి (2013 లో), జిలీ దలబెహెరా (2018లో) కాంస్యాలు... అచింత (2021లో) రజతం సాధించారు. #GreatNews 🥳 🇮🇳 begins campaign at IWF World Junior #Weightlifting Championships 2022 with a GOLD Harshada Garud Sharad 🏋️♀️clinches 🥇in Women's 45kg with a total lift of 153kg (Snatch- 70kg, Clean & Jerk- 83kg) Heartiest congratulations 🎊 👏 📽️ @iwfnet pic.twitter.com/lvMBJq061a — SAI Media (@Media_SAI) May 2, 2022 చదవండి: IPL 2022: ధోని ఉన్నాడుగా.. ఇది జరిగి తీరుతుంది: సెహ్వాగ్ -
Mirabai Chanu: మీరా భారత్ మహాన్
ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఏనాడూ పోటీల తొలి రోజు భారత్‌కు పతకం రాలేదు. కానీ ఈసారి విశ్వ క్రీడల మొదటి రోజే భారతీయులు శుభవార్త విన్నారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తన ఆటతో ఔరా అనిపించింది. యావత్ భారతావనిని మురిసేలా చేసింది. కచ్చితంగా పతకం సాధిస్తుందని తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికతో ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమైన ఈ మణిపూర్ లిఫ్టర్ అసలైన రోజున ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఆరంభం నుంచే పూర్తి విశ్వాసంతో ప్రదర్శన చేసి తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకుంది. టోక్యో: ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తెరదించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించగా... 21 ఏళ్ల తర్వాత మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 28 పతకాలు సాధించగా... ఏనాడూ పోటీల తొలిరోజే భారత్ ఖాతాలో పతకం చేరలేదు. కానీ మీరాబాయి అద్వితీయ ప్రదర్శన కారణంగా తొలిసారి విశ్వ క్రీడల ఈవెంట్స్ మొదలైన తొలి రోజే భారత్‌కు పతకాల పట్టికలో చోటు లభించింది. ఆద్యంతం ఆత్మవిశ్వాసంతో... ఎనిమిది మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. చైనాకు చెందిన జిహుయ్ హు 210 కేజీలు(స్నాచ్‌లో 94+క్లీన్ అండ్ జెర్క్‌లో 116) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇండోనేసియా లిఫ్టర్ విండీ కాంటిక 194 కేజీలు బరువెత్తి (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మీరాబాయి స్నాచ్ ఈవెంట్ తొలి ప్రయత్నంలో 84 కేజీలను... రెండో ప్రయత్నంలో 87 కేజీలను సులువుగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎత్తింది. 89 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో మాత్రం ఆమె విఫలమైంది. దాంతో 87 కేజీల ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 110 కేజీలు... రెండో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తింది. 117 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. దాంతో 115 కేజీల ప్రదర్శననను పరిగణనలోకి తీసుకున్నారు. ‘ఒలింపిక్ పతకం సాధించాలనే నా కల నిజమైంది. రియో ఒలింపిక్స్ కోసం కూడా ఎంతో కష్టపడ్డాను కానీ ఆ రోజు నాకు అనుకూలించలేదు. టోక్యోలో నన్ను నేను నిరూపించుకోవాలని అదే రోజు లక్ష్యంగా పెట్టుకున్నాను. రియో ఫలితం తర్వాత చాలా బాధపడ్డా. ఆ సమయంలో నాపై ఉన్న తీవ్ర ఒత్తిడిని అధిగమించలేకపోయాను. ఎన్నో రోజుల తర్వాత గానీ కోలుకోలేదు. అప్పటినుంచి నా శిక్షణ, టెక్నిక్ పద్ధతులు మార్చుకున్నాను. ఈ ఐదేళ్లలో మరింతగా శ్రమించాను. గత ఐదేళ్లలో మా ఇంట్లో నేను ఐదు రోజులు మాత్రమే ఉన్నాను. ఇప్పుడు సగర్వంగా ఈ పతకంతో ఇంటికి వెళ్లి అమ్మ చేతి వంట తింటాను. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎంతో మంది అమ్మాయిలు రాణిస్తున్నారు.వారు మరిన్ని ఘనతలు సాధించేలా నా ఈ పతకం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా. –మీరాబాయి చాను ‘రియోలో పతకం సాధించకపోవడంతో నాపై చాలా ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మీరా సాధనలో కొన్ని మార్పులు చేశాం. దాంతో వరుసగా సానుకూల ఫలితాలు వచ్చాయి. రోజురోజుకూ ఆమె ఆట మెరుగైంది. గత ఐదేళ్లలో తిండి, నిద్రకు తప్ప మిగతా సమయమంతా ప్రాక్టీస్‌కే వెచ్చించింది. కరోనా కారణంగా ఒలింపిక్‌కు అర్హత సాధించేందుకు మాకు రెండున్నరేళ్లు పట్టాయి. ఈ ప్రస్థానం ఇలా పతకాన్ని అందించడం సంతోషంగా ఉంది. –విజయ్ శర్మ, హెడ్ కోచ్ -
ఐదు ప్రపంచ రికార్డులు
ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో గురువారం ఐదు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో మూడు షూటింగ్‌లోనే రావడం విశేషం. మహిళల ‘డబుల్ ట్రాప్’ టీమ్ విభాగంలో యాఫి జాంగ్, యిట్లింగ్ బాయ్, మీ జూలతో కూడిన చైనా జట్టు 315 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో షెంగ్బో, జిన్ లాన్, గాంగ్ లియులతో కూడిన చైనా బృందం 1876 పాయింట్లతో ప్రపంచ రికార్డు లిఖించింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 75 కేజీల విభాగంలో కిమ్ ఉన్జు (ఉత్తర కొరియా) క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 164 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.ఆర్చరీలో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియా 238 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.