భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్‌వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్‌చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది.
ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్‌ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది.
కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment