Mirabai Chanu
-
Olympics: నెలసరి మూడో రోజు.. వీక్నెస్ వల్ల: మీరాబాయి చాను
‘‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కోచ్ చెప్పినట్లుగా చేశాను. పతకం సాధించలేకపోయినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. గాయం నుంచి కోలుకునే క్రమంలో తక్కువ సమయమే దొరికినా దానిని సద్వినియోగం చేసుకోగలిగాను.85 కిలోల బరువు ఎత్తడం కోసం ఎంతగానో ప్రాక్టీస్ చేశా. కాంపిటీషన్ సమయంలోనూ పొరపాట్లకు తావివ్వలేదు. క్లీన్ అండ్ జెర్క్ విషయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నిజానికి.. పోటీకి సిద్ధమవుతున్నపుడే నా నెలసరి మొదలైంది.ఇది మూడోరోజు. అది కూడా ప్రభావం చూపింది. వీక్నెస్ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. దేశం కోసం పతకం గెలవాలని ఎంతగానో కృషి చేశాను. అయినా.. ఆటలో గెలుపోటములు భాగమే. వచ్చే ఒలింపిక్స్ కోసం మరింత కష్టపడతా. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి పతకం అందిస్తా’’ అంటూ భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఉద్వేగానికి లోనైంది.నాలుగోస్థానంతో సరిప్యారిస్ ఒలింపిక్స్-2024లో మీరాబాయి తృటిలో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ మణిపూర్ ఆణిముత్యం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఫలితంగా కాంస్య పతకం చేజారింది. ఫైనల్లో 12 మంది పోటీపడగా.. మీరాబాయి మొత్తం 199 కేజీల బరువు మాత్రమే ఎత్తగలిగింది. స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.ఇక ఈ విభాగంలో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయ్ మొత్తం 206 కేజీల బరువెత్తి( (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) స్వర్ణం సాధించగా.. రొమేనియాకు చెందిన మిహేలా వలెంటీనా మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సురోద్చనా ఖాంబావ్ 200 కేజీల బరువెత్తి కాంస్యం కైవసం చేసుకుంది.చదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
మీరాబాయికి నాలుగో స్థానం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత స్టార్ మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో మీరాబాయి మొత్తం 199 కేజీల బరువెత్తి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హు జిహుయ్ (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) మొత్తం 206 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మిహేలా వలెంటీనా (రొమేనియా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. సురోద్చనా ఖాంబావ్ (థాయ్‌లాండ్; స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) 200 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. పారిస్‌లోనూ మీరాబాయి పతకం సాధించి ఉంటే ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందేది. అవినాశ్‌కు 11వ స్థానం మరోవైపు బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే 8 నిమిషాల 14.18 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచాడు. సూఫియాన్ (మొరాకో) స్వర్ణం, రూక్స్ (అమెరికా) రజతం, కిబివోట్ (కెన్యా) కాంస్యం గెలిచారు. -
Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తొలిసారిగా పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఆమె స్వర్ణం కోసం.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్తో తలపడనుంది. చాంప్-డి- మార్స్ ఎరీనాలో మ్యాట్- బి మీద ‘పసిడి పట్టు’ పట్టేందుకు సిద్దమైంది. రాత్రి 11.23 నిమిషాలకు ఈ బౌట్ మొదలుకానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇక వినేశ్తో పాటు మిగిలిన క్రీడాకారుల నేటి(ఆగష్టు 7) షెడ్యూల్ ఇదే!రెజ్లింగ్ మహిళల ప్రీస్టయిల్ 53 కేజీలు: అంతిమ్ పంఘాల్ వర్సెస్ జైనెప్ యెట్గిల్ (మధ్యాహ్నం గం. 3:05 నుంచి) వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల (పతక పోరు): మీరాబాయి చాను (రాత్రి గం. 11:00 నుంచి)అథ్లెటిక్స్ మిక్స్డ్ మారథాన్ వాక్: ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్ (ఉదయం గం. 11:00 నుంచి). పురుషుల హైజంప్ (క్వాలిఫికేషన్): సర్వేశ్ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి). మహిళల జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): అన్ను రాణి (మధ్యాహ్నం గం. 1:55 నుంచి). మహిళల 100 మీటర్ల హర్డిల్స్: జ్యోతి యర్రాజీ (హీట్–4) (మధ్యాహ్నం గం. 2:09 నుంచి). పురుషుల ట్రిపుల్ జంప్ (క్వాలిఫికేషన్): ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్ (రాత్రి గం.10:45 నుంచి). పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ (అవినాశ్ సాబ్లే; అర్ధరాత్రి గం. 1:13 నుంచి).భారత టీటీ జట్టు నిష్క్రమణ పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కథ ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో భారత్ 0–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్–మానవ్ ఠక్కర్ జోడీ 2–11, 3–11, 7–11తో మా లాంగ్–వాంగ్ జంట చేతిలో 0–1తో వెనుకబడింది.రెండో మ్యాచ్‌లో ఐదోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఆచంట శరత్ కమల్ 11–9, 7–11, 7–11, 5–11తో ఫాన్ జెన్‌డాంగ్ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి ఆశలు రేకెత్తించిన శరత్ అదే జోరు చివరి వరకు కొనసాగించ లేకపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్ రెండో పోరులో మానవ్ ఠక్కర్ 9–11, 6–11, 9–11తో వాంగ్ చేతిలో పరాజయం పాలవడంతో భారత ఓటమి ఖరారైంది. -
మీరా ఔరా అనిపించేనా?
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో... పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌కు పతకం అందించి సంబరాల్లో ముంచెత్తిన భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను... బుధవారం ‘పారిస్’ క్రీడల బరిలోకి దిగనుంది. 49 కేజీల విభాగంలో గత ఒలింపిక్స్‌లో 202 కేజీలు (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.అయితే కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాను.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఆ రెండూ మహిళా లిఫ్టర్లే గెలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో దిగ్గజ లిఫ్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా... టోక్యోలో మీరాబాయి రజతం నెగ్గింది. గత ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిన మీరాబాయి.. ఆ తర్వాత గాయాల బారిన పడి అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది.2022 కామన్వెల్త్ క్రీడల్లో మాత్రమే 200 కేజీల మార్కు దాటగ లిగింది. ఇక తాజాగా ‘పారిస్’ క్రీడల్లో మీరాబాయి ఎంట్రీ వెయిట్ 200 కేజీలుగా నమోదు చేసుకుంది. ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ హో జీహుయి (చైనా), డెలాక్రజ్ (అమెరికా), సురోచన ఖామ్బో (థాయ్‌లాండ్), మిహేలా కామ్బెయి (రొమేనియా) మీరాకన్నా మెరుగైన ఎంట్రీ వెయిట్ నమోదు చేసుకున్నారు. ఈసారి పోటీల తీవ్రతను బట్టి చూస్తే.. మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన (205 కేజీలు) కనబర్చగలిగితేనే పతకం రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనా లిఫ్టర్ హో జీహుయి మరోసారి స్వర్ణంపై గురి పెట్టింది. మీరాబాయి గాయం నుంచి పూర్తిగా కోలుకుందని కోచ్ విజయ్ శర్మ పేర్కొన్నారు. ‘మీరా 200 కేజీలు సునాయాసంగా దాటగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎత్తిన 202 కేజీల బరువును మించిన ప్రదర్శన చేస్తుంది. సవాలు స్వీకరించేందుకు చాను సిద్ధంగా ఉంది’ అని విజయ్ శర్మ అన్నాడు. -
వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
బ్యాంకాక్: భారత స్టార్ మహిళా లిఫ్టర్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం దాదాపు ఖరారైంది. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి మూడో స్థానంలో నిలిచింది. 6 నెలల విరామానంతరం బరిలోకి దిగిన ఆమె గ్రూప్ ‘బి’లో పోటీపడి మొత్తం 184 కేజీల (81+103) బరువెత్తింది. తద్వారా మీరా మూడో స్థానంలో నిలిచింది. ఫలితమిలా ఉన్నప్పటికీ తప్పనిసరి టోర్నీల్లో పాల్గొనడంతో పాటు, 49 కేజీల కేటగిరీలో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉంది. చైనా లిఫ్టర్ జియాన్ హుయ్‌హువా అగ్రస్థానంలో ఉండగా, ప్రతి కేటగిరీ నుంచి టాప్–10 లిఫ్టర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి. దీంతో 2017 ప్రపంచ చాంపియన్ మీరాబాయి జూలైలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత పొందడం లాంఛనం కానుంది. ప్రపంచకప్ ముగిశాక క్వాలిఫయర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. మణిపూర్‌కు చెందిన మీరాబాయికివి వరుసగా మూడో ఒలింపిక్స్ క్రీడలు కానున్నాయి. రియో ఒలింపిక్స్‌లో మీరాబాయి విఫలంకాగా, టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. -
ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు మీరాబాయి దూరం.. కారణం?
Asian Weightlifting Championships: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో తాష్కెంట్లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఆమె దూరం కానుంది. అక్టోబర్‌లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల సందర్భంగా మీరాబాయి తుంటికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆమె మరే టోర్నీ బరిలోనూ దిగలేకపోయింది. ఇక ప్రపంచ మాజీ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన మీరాబాయి మార్చిలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగమైన ప్రపంచకప్ టోర్నీతో.. ఆమె పునరాగమనం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వారియర్స్ ఘనవిజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 60–42తో గెలిచింది. వారియర్స్ తరఫున కెపె్టన్ మణీందర్ సింగ్ 15 పాయింట్లు, నితిన్ 14 పాయింట్లు స్కోరు చేశారు. ఈ గెలుపుతో వారియర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం
2021-22 ఏడాదికి గానూ భారత క్రికెట్లో(పురుషులు, మహిళలు) కలిపి కేవలం 114 మంది క్రికెటర్లకు మాత్రమే జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) డోపింగ్ టెస్టులు హాజరయ్యారని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తెలిపింది. మంగళవారం వాడా(WADA) ఇండియా యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ పేరిట ఒక రిపోర్టును విడుదల చేసింది. దేశంలోని అథ్లెట్లకు నిర్వహించిన డోపింగ్ టెస్టుకు సంబంధించి తెలియని చాలా విషయాలు రిపోర్టులో చాలా ఉన్నాయని వాడా పేర్కొంది. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సమాచార హక్కు చట్టం కింద 2021-22లో ఎంత మంది ఇండియన్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్సీ(నాడా-NADA) ప్రకారం 2021, 2022 ఏడాదిలో మొత్తంగా 5961 డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో కేవలం 114 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా వాళ్లు వివిధ రకాల క్రీడలకు చెందిన అథ్లెట్లు ఉన్నారు. ఇందులో 1717 మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు చెందినవారే ఉన్నారు. రోహిత్ శర్మకు ఆరుసార్లు.. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యధికంగా ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రిపోర్టులో ఉంది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, యూఏఈ వేదికగా రోహిత్‌కు ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్, చతేశ్వర్ పుజారా సహా మరో నలుగురు క్రికెటర్లకు ఒకసారి డోపింగ్ టెస్టు నిర్వహించారు. కోహ్లికి ఒక్కసారి కూడా.. మరో ఆసక్తికర విషయమేంటంటే.. బీసీసీఐలో కాంట్రాక్ట్ కలిగి ఉన్న 25 మంది ఆటగాళ్లలో 12 మందికి ఒక్కసారి కూడా డోపింగ్ టెస్టు నిర్వహించలేదు. ఆ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.. బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వికెట్ కీపర్లు సంజూ శాంసన్, కోన శ్రీకర్ భరత్‌లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఇక మహిళల జట్టులో మాత్రం కాంట్రాక్ట్ కలిగి ఉన్న ప్రతీ క్రికెటర్‌కు కనీసం ఒక్కసారైనా డోపింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలకు మూడుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ డేటా ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని సూచించదు. అయినప్పటికీ, సంభావ్య నేరస్థులను పట్టుకోవడంలో NADA తగినంతగా చేయడం లేదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తన వాదనను ఇది మరింత నొక్కి చెబుతుంది. దేశంలోని ఒలింపిక్ అథ్లెట్లను టార్గెట్ చేస్తున్న నాడా డోపింగ్ టెస్టుల కోసం పురుషుల క్రికెటర్ల నమూనాలను సేకరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పరోక్షంగా బీసీసీఐ హస్తం ఉందని.. నాడా వారికి భయపడే అతి తక్కువ మంది క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోందని వాడా స్పష్టం చేసింది. రవి దహియా ఇంటికి 18సార్లు.. ఇక జనవరి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ(నాడా) డోపింగ్ టెస్టు నిర్వహించడం కోసం ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రవీ దహియా ఇంటికి 18సార్లు వెళ్లినట్లు సమాచారం. నిషేధిక డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో న్యూఢిల్లీతో పాటు తన సొంత రాష్ట్రం హర్యానాలోని సోన్పట్కు వెళ్లి అతని యూరిన్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. నీరజ్ చోప్రాను వదల్లేదు.. ఇక మహిళా వెయిట్‌లిఫ్టర్.. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాభాయి చానుకు కూడా ఎనిమిది సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. పాటియాల, గాంధీనగర్‌తో పాటు విదేశాల్లోనూ ఆమెకు డోపింగ్ టెస్టులు చేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాను కూడా వదల్లేదు. 2021 నుంచి 2022 ఏడాదిలో నీరజ్ చోప్రాకు ఐదుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. పాటియాలా, ఫిన్లాండ్, అమెరికాలోనూ ఈ టెస్టులు చేవారు. అయితే ఇవన్నీ ఆటగాళ్లకు ఎలాంటి కాంపిటీషన్స్ లేనప్పుడు కూడా నిర్వహించడం ఆసక్తి కలిగించింది. మరి భారత క్రికెటర్లు ఏడాది పొడవునా ఏదో ఒక సిరీస్ ఆడుతూనే ఉంటారు. క్షణం తీరిక లేకుండా స్వదేశం, విదేశాల్లో టోర్నీలు ఆడే టీమిండియా మధ్యలో ఐపీఎల్ కూడా ఆడుతుంది. మరి ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి డోపింగ్ టెస్టులు క్రమం తప్పకుండా చేయాల్సిందే. ఫిట్నెస్ సాధించడానికి 'యోయో(YOYO)' పేరుతో ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారే తప్ప ఎవరైనా క్రికెటర్ నిషేధిత డ్రగ్ ఏమైనా వాడుతున్నాడా అనేది డోపింగ్ టెస్టులో నిర్వహిస్తేనే బయటపడుతుంది. మన దేశంతో పోలిస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లకు క్రమం తప్పకుండా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. ఇంగ్లండ్ ఏజెన్సీ 96 మంది పురుషుల క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తే.. ఆస్ట్రేలియా ఏజెన్సీ 69 మంది మెన్స్ క్రికెటర్లకు నిర్వహించింది. కానీ భారత్‌లో మాత్రం నాడా 12 మంది పురుషుల క్రికెటర్లకు మాత్రమే డోపింగ్ టెస్టులు నిర్వహించింది. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్ ‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్... -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
PV Sindhu: ‘బీబీసీ అవార్డు’ రేసులో పీవీ సింధు
న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండోసారి ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో నిలిచింది. 2020లో సింధుకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్ బీబీసీ మంగళవారం విడుదల చేసిన 2022 నామినీల్లో తెలుగు తేజంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, గోల్ఫర్ అదితి అశోక్, పారాలింపియన్ షూటర్ అవనీ లేఖరా ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఈ నెల 28 వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మార్చి 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. 2021 సంవత్సరంలో భారత చెస్ దిగ్గజం కోనేరు హంపికి ఈ అవార్డు లభించింది. చదవండి: India Vs West Indies 2nd Odi: సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా; గత మ్యాచ్‌లో ఒక్క బంతికే అవుటయ్యాడు... ఆ కెప్టెన్ రాణించేనా? -
అమృతాంజన్ బ్రాండ్ అంబాసిడర్లుగా చాను, పునియా
ముంబై: టోక్యో ఒలింపిక్ గేమ్స్ విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ తెలిపారు. టీవీ, డిజిటల్ ప్రకటనలతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులుగా తమకు ఎదురయ్యే కండరాలు నొప్పులు మొదలైన సమస్యల నుంచి ఉపశమనానికి అమృతాంజన్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడ్డాయని మీరా బాయ్ చాను, బజరంగ్ పునియా తెలిపారు. -
మీరాబాయి... పారిస్‌లో స్వర్ణం సాధించాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కోసం ప్రయత్నించాలని భారత వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం న్యూఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 51వ రైజింగ్ డే వేడుకల్లో మీరాబాయిని అమిత్ షా సన్మానించారు. మీరాబాయి కష్టానికి, నిబద్ధతకు పతకం రూపంలో టోక్యోలో ప్రతిఫలం లభించింది. దేశంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు కూడా ఆమె ఘనతను కొనియాడారు. ఆమెకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను. దేశమంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది’ అని అమిత్ షా అన్నారు. చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
ఆమ్వే ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మీరాబాయి చాను
ప్రముఖ న్యూట్రిలైట్ కంపెనీ ఆమ్వే ఇండియా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానును ప్రకటించింది. ఈ ఒప్పందంపై మీరాబాయి చాను సంతకం చేసింది. న్యూట్రిలైట్ డైలీ, ఒమేగా, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ వంటి ఆమ్వే ప్రచారా కార్యక్రమాలలో ఇక నుంచి మీరాబాయి చాను కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్యం, పోషకాహార రంగాన్ని ఏకీకృతం చేయడంపై ఆమ్వే దృష్టి సారించింది. అందుకోసమే చానుతో సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం తెలిపింది. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం) "మీరాబాయి చానుతో మా అనుబంధం ఒక సహజ ఎంపిక. ఆమె ఫిట్ నెస్ పట్ల కనబర్చిన నిబద్ధత సాటిలేనిది. ప్రజలు మరింత మెరుగ్గా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, అందుకే ఆమెను భాగస్వామిగా ఎంచుకునట్లు" ఆమ్వే ఇండియా సీఈఓ అన్షు బుధ్రాజా తెలిపారు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో 26 ఏళ్ల చాను మహిళల 49 కిలోల విభాగంలో 204 కిలోల (87 కిలోల+115 కిలోలు) విభాగంలో రజత పతకాన్ని సాధించడంతో దేశమంతా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. -
లిటిల్ మాస్టర్ తో వెయిట్ లిఫ్టర్
-
'సచిన్ సార్‌ను కలిశాను.. చాలా హ్యాపీగా ఉంది'
ముంబై: టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ విశేషాలను గురించి సచిన్ ఆమెను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు. అనంతరం సచిన్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్లో మీరాబాయి చాను షేర్ చేసుకుంది. ''సచిన్ సార్‌ని ఉదయం కలిశాను. నన్ను ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికి మరిచిపోలేను. నిజంగా ఎంతో స్ఫూర్తి పొందాను.. చాలా హ్యాపీగా ఉంది'' అంటూ ట్వీట్ చేసింది. కాగా మీరాబాయి చేసిన ట్వీట్‌పై సచిన్ కూడా రిప్లై ఇచ్చాడు. మీరాబాయిని కలవడం నాకు సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో రజతం తెచ్చినందుకు ఎంతో గర్విస్తున్నా.. మున్ముందు జరిగే క్రీడల్లో ఇలాంటి అద్భుత ప్రదర్శనలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌ను మరిపిస్తూ ఏడు పతకాలతో మురిసిన భారత్ టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు కొల్లగొట్టింది. Loved meeting @sachin_rt Sir this morning! His words of wisdom & motivation shall always stay with me. Really inspired. pic.twitter.com/Ilidma4geY — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021 -
ఇకపై చాను ఐనాక్స్‌లో ఎక్కడైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో దేశానికి రజత పతకం అందించిన మీరాబాయి చానుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెను మరో బంపర్ ఆఫర్ వరించింది. చానుకు జీవితకాలం పాటు సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రకటించింది. టోక్యోలో పతకం గెలిచే ప్రతి భారత అథ్లెట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతి అథ్లెట్‌కు ఏడాది పాటు టికెట్లు ఫ్రీగా టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని ఐనాక్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ఐనాక్స్కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. INOX takes immense pride in all the endeavors of #TeamIndia at #Tokyo2020 🌟✨We are happy to announce free movie tickets for lifetime for all the medal winners🏅& for one year for all the other athletes🎟️🎟️#AayegaIndia #INOXForTeamIndia #EkIndiaTeamIndia #Respect #JaiHind 🇮🇳 pic.twitter.com/evaAAJbgKx— INOX Leisure Ltd. (@INOXMovies) July 27, 2021 ఇదిలా ఉంటే, అంతకుముందు డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాను.. జీవితకాలం ఎన్ని పిజ్జాలు తిన్నా ఫ్రీ ఆఫర్ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పతకం అందుకుంటున్న సందర్భంగా పిజ్జా తినాలనుందని చాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొమినోస్ ఈ మేరకు స్పందించింది. ఇక విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన చానుపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ. 2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేసింది. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా చానుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది. -
అడిషనల్ ఎస్పీ మీరాబాయి
ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్‌లో తొలిరోజే భారత్‌కు పతక బోణీ అందించిన మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వరాష్ట్రం మణిపూర్ బ్రహ్మరథం పట్టింది. 49 కేజీల కేటగిరీలో రజతం గెలి చిన ఆమె మంగళవారం సొంతూరుకు చేరుకుంది. ఇంఫాల్ విమానాశ్రయంలో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు, క్రీడావర్గాలు మీరాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కార వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆమెకు కోటి రూపాయల చెక్‌ను, అడిషనల్ ఎస్పీ (స్పోర్ట్స్) నియామక పత్రాన్ని అందజేశారు. ఇదే వేడుకలో మీరా ఇద్దరు కోచ్‌లు అనిత, బ్రొజెన్లను కూడా ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె పదవీ బాధ్యతల కోసం నూతనంగా తీర్చిదిద్దిన అడిషనల్ ఎస్పీ చాంబర్ దాకా సీఎం, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర డీజీపీ ఎస్కార్టుగా వచ్చారు. ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు... కనీవినీ ఎరుగని స్వాగత సత్కారాలు తన మన స్సుకు హత్తుకోవడంతో మీరా కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. తన విజయానికి అద్భుతమైన స్వాగతానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
రజతంతో స్వదేశంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంతగడ్డపై అడుగు పెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. భారత ఆర్మీ జవాన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం మీరాబాయి కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నితీశ్ ప్రమాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసింది. మరోవైపు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమ ఉద్యోగి అయిన మీరాబాయికి రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. 2018 నుంచి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా పని చేస్తున్న మీరాబాయికి పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైనా లిఫ్టర్ డోపింగ్ వార్తలతో అలజడి... మీరాతో పోటీ పడి స్వర్ణం సాధించిన జిహుయ్ హౌ ‘డోపింగ్’కు పాల్పడినట్లు, నిర్ధారణ అయితే మీరాకు స్వర్ణం లభిస్తుందంటూ సోమవారం ఉదయం నుంచి పలు పత్రికలు, వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పోటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జిహుయ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తుందంటూ ఒక భారత మీడియా ప్రతినిధి రాసిన వార్త దీనికంతటికీ కారణమైంది. అయితే ఐఓసీ నుంచి గానీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి గానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత ఒలింపిక్ సంఘం కూడా తమకేమీ తెలీదని స్పష్టం చేసింది. నిజానికి కనీస సమాచారం, ఆధారం లేకుండా కేవలం జిహుయ్ రెండోసారి పరీక్షకు వెళుతోంది కాబట్టి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలపై ఆధారపడి ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినట్లు తర్వాత తేలింది. పోటీ ముగియగానే తీసుకున్న ‘శాంపిల్’పై అనుమానం ఉండటం వల్లే స్పష్టత కోసం రెండో ‘శాంపిల్’ తీసుకుంటున్నారని వినిపించినా... దానిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. రోజూ ఐఓసీ నిర్వహించే సుమారు 5000 డోపింగ్ పరీక్షల్లో ఇది కూడా ఒక రొటీన్ పరీక్ష కూడా కావచ్చు! -
లేట్‌గా చెప్పినా లేటెస్ట్గా చెప్పాడు.. చానుకు ప్రత్యేక సందేశం పంపిన కోహ్లీ
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. విశ్వక్రీడల వేదికపై భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన చానును ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. ఛాంపియన్ లేడీని విష్ చేయడంలో లేట్ అయినా.. లేటెస్ట్గా విష్ చేశాడు. చానుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేకమైన వీడియో క్లిప్‌ను విడుదల చేశాడు. #TeamIndia captain @imVkohli has a special message for weightlifter @mirabai_chanu, who won India's first medal at @Tokyo2020. 🇮🇳 👏 👏@IndiaSports | @Media_SAI | @WeAreTeamIndia pic.twitter.com/suRbQmB4bd — BCCI (@BCCI) July 26, 2021 22 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్న రెండు ఫొటోలను జత చేశాడు. దేశభక్తిని రగిల్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కంపోజ్ చేశాడు. దేశ పౌరుల ఆశలను తన భుజాల మీద మోశారని ప్రశంసించాడు. ఒలింపిక్స్‌లో పతకాన్ని ముద్దాడాలనే ఆశయాలను చాను నిజం చేసి చూపించారని కొనియాడాడు. కోట్లాదిమంది ప్రజల భారాన్ని మోశారని ఆకాశానికెత్తాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్క భారత అథ్లెట్ గేమ్‌ను తప్పనసరిగా వీక్షించాలని భారతీయులకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, సిల్వర్ మెడల్ సాధించిన చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో బంగార పతకం సాధించిన చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయికి డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో జిహుయి విఫలమైతే.. రెండో స్థానంలో ఉన్న చానుకి గోల్డ్ మెడల్ దక్కుతుంది. కాగా, కొద్ది గంటల క్రితమే భారత్‌లో అడుగుపెట్టిన చానుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమెను అదనపు ఎస్పీగా నియమిస్తున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ ప్రకటించారు. -
మీరాబాయి చాను సిల్వర్ మెడల్.. గోల్డ్ అయ్యే అవకాశం..?
టోక్యో: ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు వెల్లడించారు. ఒకవేళ జిహుయి డోప్ పరీక్షలో విఫలమైతే.. రెండో స్థానంలో ఉన్న మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్ దక్కుతుంది. కాగా, ఈ ఈవెంట్లో జిహుయి.. స్నాచ్‌లో 94 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 116 కిలోలు(మొత్తంగా 210 కిలోలు) ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకోగా, చాను.. స్నాచ్‌లో 87 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోల(మొత్తంగా 202 కిలోలు) బరువు ఎత్తి రజతంతో సరిపెట్టుకుంది. ఇక ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ విండీ కాంటికా మొత్తంగా 194 కిలోల బరువు ఎత్తి కాంస్యం తృప్తి చెందింది. ఇదిలా ఉంటే, మీరాబాయి ఇప్పటికే భారత్‌కు తిరుగు ప్రయాణమైంది. సోమవారం ఉదయం స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేసింది. -
Mirabai Chanu: ‘సిల్వర్’ వంటి శిక్షకుడు
ఏలూరు రూరల్: టోక్యో ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. ఆ విజయానికి దేశం యావత్తూ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె విజయం వెనుక, ఆమె కఠోర సాధన వెనుక, ఆమె పడ్డ కష్టం వెనుక.. ఓ తెలుగోడూ ఉన్నాడు.. అతడే మెడబాల తంబి. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం, వంగూరు గ్రామానికి చెందిన మెడబాల తంబి.. పాటియాలలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్లో ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. క్రీడాకారుల శరీర భాగాల పటుత్వం, గుండె, ఊపిరితిత్తుల పనితీరును పరిశీలిస్తారు. వారి ఊపితిత్తుల సామర్థ్యం, ఆక్సిజన్ శాతం వంటి వాటిపై పరిశోధనలు చేసి.. నివేదికను చీఫ్ కోచ్‌కు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా క్రీడాకారుడికి ఎలాంటి ఎక్సైర్‌సైజ్‌లు అవసరమో చీఫ్‌కోచ్ నిర్ణయిస్తాడు. అలాగే ఏ క్రీడాకారుడు ఎలాంటి క్రీడల్లో రాణించగలడు.. ఎలాంటి శిక్షణ తీసుకోవాలి.. తదితర అంశాల్లోనూ తంబి సలహాలిస్తుంటారు. ఓ సీనియర్ ఫిజియాలజిస్ట్‌గా, ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా ఇతర క్రీడాకారులందరితో పాటు మీరాబాయి చాను విషయంలోనూ తంబి ఇవన్నీ నిర్వహించి.. ఆ విధంగా ఆమె విజయంలో పాలుపంచుకున్నారు. పేదరికంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి.. నిరుపేద కుటుంబంలో పుట్టిన తంబి చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లిదండ్రులు నాగమణి, నకులుడు ప్రోత్సాహంతో ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదివారు. గురువులైన మల్లెం కుమార్, బోడేపూడి నరసింహారావుల సహకారంతో ఆశ్రం కళాశాలలో ఫిజియాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అదే సమయంలో పలు కళాశాలల్లో ఆచార్యుడిగా పనిచేస్తూ 2013 ఆలిండియా ఎయిమ్స్ ఎంట్రన్స్ ఫిజియాలజీ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. 2014లో యూపీఎస్సీ ద్వారా సాయ్‌లో సైంటిస్ట్‌గా నియమితుడై.. ప్రస్తుతం పాటియాల సాయ్ సెంటర్ ఫిజియాలజీ విభాగం చీఫ్‌గా సేవలు అందిస్తున్నాడు. -
ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
బుడాపెస్ట్: భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం స్పష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో విజయం సాధించి గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ప్రియా మాలిక్ 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడ వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం క్రీడాభిమానులను సంతోషానికి గురిచేస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగట్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
Mirabai Chanu: మీరా భారత్ మహాన్
ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఏనాడూ పోటీల తొలి రోజు భారత్‌కు పతకం రాలేదు. కానీ ఈసారి విశ్వ క్రీడల మొదటి రోజే భారతీయులు శుభవార్త విన్నారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తన ఆటతో ఔరా అనిపించింది. యావత్ భారతావనిని మురిసేలా చేసింది. కచ్చితంగా పతకం సాధిస్తుందని తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికతో ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమైన ఈ మణిపూర్ లిఫ్టర్ అసలైన రోజున ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఆరంభం నుంచే పూర్తి విశ్వాసంతో ప్రదర్శన చేసి తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకుంది. టోక్యో: ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తెరదించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించగా... 21 ఏళ్ల తర్వాత మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 28 పతకాలు సాధించగా... ఏనాడూ పోటీల తొలిరోజే భారత్ ఖాతాలో పతకం చేరలేదు. కానీ మీరాబాయి అద్వితీయ ప్రదర్శన కారణంగా తొలిసారి విశ్వ క్రీడల ఈవెంట్స్ మొదలైన తొలి రోజే భారత్‌కు పతకాల పట్టికలో చోటు లభించింది. ఆద్యంతం ఆత్మవిశ్వాసంతో... ఎనిమిది మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. చైనాకు చెందిన జిహుయ్ హు 210 కేజీలు(స్నాచ్‌లో 94+క్లీన్ అండ్ జెర్క్‌లో 116) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇండోనేసియా లిఫ్టర్ విండీ కాంటిక 194 కేజీలు బరువెత్తి (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మీరాబాయి స్నాచ్ ఈవెంట్ తొలి ప్రయత్నంలో 84 కేజీలను... రెండో ప్రయత్నంలో 87 కేజీలను సులువుగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎత్తింది. 89 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో మాత్రం ఆమె విఫలమైంది. దాంతో 87 కేజీల ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 110 కేజీలు... రెండో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తింది. 117 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో సక్సెస్ కాలేదు. దాంతో 115 కేజీల ప్రదర్శననను పరిగణనలోకి తీసుకున్నారు. ‘ఒలింపిక్ పతకం సాధించాలనే నా కల నిజమైంది. రియో ఒలింపిక్స్ కోసం కూడా ఎంతో కష్టపడ్డాను కానీ ఆ రోజు నాకు అనుకూలించలేదు. టోక్యోలో నన్ను నేను నిరూపించుకోవాలని అదే రోజు లక్ష్యంగా పెట్టుకున్నాను. రియో ఫలితం తర్వాత చాలా బాధపడ్డా. ఆ సమయంలో నాపై ఉన్న తీవ్ర ఒత్తిడిని అధిగమించలేకపోయాను. ఎన్నో రోజుల తర్వాత గానీ కోలుకోలేదు. అప్పటినుంచి నా శిక్షణ, టెక్నిక్ పద్ధతులు మార్చుకున్నాను. ఈ ఐదేళ్లలో మరింతగా శ్రమించాను. గత ఐదేళ్లలో మా ఇంట్లో నేను ఐదు రోజులు మాత్రమే ఉన్నాను. ఇప్పుడు సగర్వంగా ఈ పతకంతో ఇంటికి వెళ్లి అమ్మ చేతి వంట తింటాను. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎంతో మంది అమ్మాయిలు రాణిస్తున్నారు.వారు మరిన్ని ఘనతలు సాధించేలా నా ఈ పతకం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా. –మీరాబాయి చాను ‘రియోలో పతకం సాధించకపోవడంతో నాపై చాలా ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మీరా సాధనలో కొన్ని మార్పులు చేశాం. దాంతో వరుసగా సానుకూల ఫలితాలు వచ్చాయి. రోజురోజుకూ ఆమె ఆట మెరుగైంది. గత ఐదేళ్లలో తిండి, నిద్రకు తప్ప మిగతా సమయమంతా ప్రాక్టీస్‌కే వెచ్చించింది. కరోనా కారణంగా ఒలింపిక్‌కు అర్హత సాధించేందుకు మాకు రెండున్నరేళ్లు పట్టాయి. ఈ ప్రస్థానం ఇలా పతకాన్ని అందించడం సంతోషంగా ఉంది. –విజయ్ శర్మ, హెడ్ కోచ్ -
మీరాబాయి చానుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. కాగా భారత్‌కు పథకం సాధించిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ స్పందించారు. ‘అద్భుతమైన ప్రదర్శన. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం పథకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తం మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. A magnificent feat! Absolutely delighted to see India off the mark in #Olympics #Tokyo2020. Hearty congratulations @mirabai_chanu on winning the silver medal in 49 kgs women's weight lifting category.#MirabaiChanu — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 -
భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త చరిత్ర; నా కల నెరవేరింది!
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్ జిజోయ్ పసిడిని దక్కించుకున్నారు. భారత్ తరపున పతకం సాధించిన రెండో వెయిట్ లిఫ్టర్‌గా మీరాబాయి ఘనత సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్‌గా మీరాబాయి నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా నా కల నెరవేరింది.. ఈ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నాను’’ అని భావోద్వేగానికి గురయ్యారు.