
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను శుక్రవారం టోక్యోలో అడుగుపెట్టింది. ఒలింపిక్స్ కోసం తుది సన్నాహాల కోసం అమెరికా వెళ్లిన ఆమె 50 రోజుల ప్రాక్టీస్ ముగించుకొని ఆతిథ్య వేదికకు చేరుకుంది. ఆమెతో పాటు జాతీయ కోచ్ విజయ్ శర్మ, సహాయ కోచ్ సందీప్ కుమార్, కోచ్ ప్రమోద్ శర్మ, ఫిజియో ఆలాప్ జవదేకర్ ఉన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్ అర్హత సంపాదించిన ఏకైక లిఫ్టర్ 26 ఏళ్ల చాను మహిళల 49 కేజీ కేటగిరీలో తలపడనుంది.
ఇరు జట్లకూ కరోనా సోకితే బంగారమే!
ఒలింపిక్స్ హాకీ ఈవెంట్‌లో కరోనా కారణంగా పతకాల రూపురేఖలు మారిపోయాయి. మహిళల, పురుషుల ఈవెంట్లలో ఫైనల్ చేరిన ఇరు జట్లలో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బాధితులుంటే మ్యాచ్ జరగదు. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి స్వర్ణపతకాలను ప్రదానం చేస్తామని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) తెలిపింది.