Indian weightlifters
-
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితకు భారీ షాక్.. నాలుగేళ్ల నిషేధం
CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది. కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు. అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు. చదవండి: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
టోక్యో చేరిన మీరాబాయి
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను శుక్రవారం టోక్యోలో అడుగుపెట్టింది. ఒలింపిక్స్ కోసం తుది సన్నాహాల కోసం అమెరికా వెళ్లిన ఆమె 50 రోజుల ప్రాక్టీస్ ముగించుకొని ఆతిథ్య వేదికకు చేరుకుంది. ఆమెతో పాటు జాతీయ కోచ్ విజయ్ శర్మ, సహాయ కోచ్ సందీప్ కుమార్, కోచ్ ప్రమోద్ శర్మ, ఫిజియో ఆలాప్ జవదేకర్ ఉన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్ అర్హత సంపాదించిన ఏకైక లిఫ్టర్ 26 ఏళ్ల చాను మహిళల 49 కేజీ కేటగిరీలో తలపడనుంది. ఇరు జట్లకూ కరోనా సోకితే బంగారమే! ఒలింపిక్స్ హాకీ ఈవెంట్లో కరోనా కారణంగా పతకాల రూపురేఖలు మారిపోయాయి. మహిళల, పురుషుల ఈవెంట్లలో ఫైనల్ చేరిన ఇరు జట్లలో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బాధితులుంటే మ్యాచ్ జరగదు. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి స్వర్ణపతకాలను ప్రదానం చేస్తామని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తెలిపింది. -
ప్రదీప్... కొత్త రకం డోపీ
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో కుదుపు! 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ సరికొత్త డోపింగ్‌కు పాల్పడ్డాడు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్‌జీహెచ్) డోపింగ్‌లో ఈ పంజాబ్ లిఫ్టర్ దొరికిపోయాడు. ఈ హెచ్‌జీహెచ్ కేసు ప్రపంచానికి ముందే పరిచయమైనా... భారత్‌లో ఇదే తొలి కేసు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో లాక్‌డౌన్‌కు ముందే మార్చిలో పట్టుబడినప్పటికీ ‘బి’ శాంపిల్‌తో ధ్రువీకరించుకున్న తర్వాత ‘నాడా’ తాజాగా వెల్లడించింది. అథ్లెట్లు అత్యంత అరుదుగా ఈ తరహా మోసానికి పాల్పడతారు. ఇది మామూలు ఉత్ప్రేరకం కాదు. మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే ఉత్ప్రేరకం. రైల్వేస్‌కి చెందిన వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ హెచ్‌జీహెచ్‌కు పాల్పడినట్లు తేలడంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ నవీన్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇలాంటి డోపింగ్ కేసు మన దేశంలో మొదటిది. మార్చిలోనే సంబంధిత సమాఖ్యకు సమాచారమిచ్చాం. నిజానికి పోటీల్లేని సమయంలో డిసెంబర్లో అతని నుంచి నమూనాలు సేకరించాం. ‘వాడా’ గుర్తింపు పొందిన ‘దోహా’ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా దొరికిపోయాడు’ అని తెలిపాడు. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్ 102 కేజీల కేటగిరీలో పాల్గొని స్వర్ణం గెలిచాడు. మార్చిలో డోపింగ్‌లో దొరికిన వెంటనే ‘నాడా’ ఇచ్చిన సమాచారం మేరకు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అతన్ని శిబిరం నుంచి తప్పించింది. హెచ్‌జీహెచ్ అంటే... కొన్ని రకాల మెడిసిన్ ద్వారా హెచ్‌జీహెచ్ శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజితం చేస్తుంది. ఎముక, ఇతర దెబ్బతిన్న అవయ వం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎముకశక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపిం గ్ నిరోధక సంస్థ (వాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్‌కు పాల్పడింది కేవలం 15 మందే. ఇందులో ఇద్దరు లండన్ ఒలింపిక్స్ సమయంలో దొరికిపోయారు. -
వెయిట్‌లిఫ్టర్ సీమాపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత వెయిట్‌లిఫ్టర్ సీమాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2017 కామన్వెల్త్ చాంపియన్íÙప్లో 75 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన సీమా, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్íÙప్ సందర్భంగా ఆమె నుంచి ‘నాడా’ అధికారులు శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్ష చేయగా అందులో అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధించిన ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. దీంతో ‘నాడా’కు చెందిన డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానెల్ ఆమెపై వేటు వేసింది. -
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితపై నిషేధం ఎత్తివేత
డోపింగ్ ఆరోపణలతో భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, విచారణ కొనసాగించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్ణయించింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో సంజిత 53 కేజీల విభాగంలో స్వర్ణం గెల్చుకుంది. దీనికిముందు 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె మూత్ర నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో కామన్వెల్త్ క్రీడల అనంతరం మే 15న నిషేధం విధించారు. అయితే డోపింగ్ పరీక్షలకు సంజిత నమూనాల సేకరణలో జాప్యం చోటుచేసుకుని... కేసు సంక్లిష్టం కావడమే నిషేధం ఎత్తివేతకు కారణంగా తెలుస్తోంది. -
సంతోషి, ప్రియదర్శినిలకు స్వర్ణాలు
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పుణే: సొంతగడ్డపై భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు జూనియర్, యూత్, సీనియర్ విభాగాలలో కలిపి తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ మహిళల 53 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స సంతోషి... యూత్ బాలికల 44 కేజీల విభాగంలో టి.ప్రియదర్శిని పసిడి పతకాలను దక్కించుకున్నారు. సంతోషి ఓవరాల్‌గా 190 కేజీలు... ప్రియదర్శిని ఓవరాల్‌గా 128 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరితోపాటు మోహిని చవాన్ (48 కేజీలు, యూత్), సంజితా చాను (48 కేజీలు, సీనియర్), జామ్జంగ్ డేరూ (56 కేజీలు, యూత్, జూనియర్), సుఖెన్ డే (56 కేజీలు, సీనియర్ పురుషులు), గౌరీ పాండే (53 కేజీలు, యూత్) కూడా స్వర్ణ పతకాలు గెలిచారు.