
CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్, కామన్‌వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్‌ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది.
కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు.
అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు.
చదవండి: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు