Sanjita Chanu
-
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితకు భారీ షాక్.. నాలుగేళ్ల నిషేధం
CWG Champion Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఎన్ఏడీఏ) గట్టి షాకిచ్చింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నాలుగేళ్లు పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ మంగళవారం వెల్లడించింది. కాగా నాడా నిర్ణయంతో సంజితాకు భారీ షాక్ తగలనుంది. జాతీయ క్రీడల్లో వెండి పతకం గెలిచిన ఆమె నుంచి మెడల్ వెనక్కి తీసుకోనున్నారు. ఇక గతేడాది నిర్వహించిన డోపింగ్ టెస్టులో సంజిత పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించారు. అయితే, ఆ సమయంలో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజతం గెలిచింది. ఇప్పుడు ఆమెను దోషిగా తేలుస్తూ నాడా నిషేధం విధించడంతో ఆమె పతకాన్ని కోల్పోనుంది. అంతేగాక నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొననుంది. కాగా గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2014లో 48 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం గెలిచింది. 2018లో గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. కాగా తనపై నిషేధం నేపథ్యంలో సంజితా చాను ఇంతవరకు స్పందించలేదు. చదవండి: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ భారత స్టార్ వెయిట్ లిఫ్టర్
భారత క్రీడారంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్చమ్ సంజిత చాను (మణిపూర్) డోపింగ్ టెస్ట్‌లో విఫలమైంది. ఆమె నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ను గుర్తించినట్లు డోపింగ్ నిరోధక అధికారులు (డీసీఓ) వెల్లడించారు. దీంతో సంజితపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రాథమిక నిషేధం విధించింది. శాంపిల్ సేకరించిన నాటి నుంచే సంజితపై నిషేధం అమల్లో ఉంటుందని నాడా పేర్కొంది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత నుంచి శాంపుల్స్ సేకరించారు. ఆ పోటీల్లో 49 కేజీల విభాగంలో పోటీపడ్డ సంజిత రజత పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది. -
సంజితకు ‘అర్జున’ ఖాయం
న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు న్యాయం జరుగనుంది. ఇటీవలే ఆమెను నిర్దోషిగా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ప్రకటించగా... డోపింగ్ ఆరోపణల కారణంగా తనకు ఇన్నాళ్లూ దూరమైన అర్జున అవార్డు ఆమె చెంత చేరనుంది. 2018 ఏడాదికి గానూ ఆమెకు ప్రతిష్టాత్మక ‘అర్జున’ను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 2018 ఏడాదికి సంజిత ‘అర్జున’ను పొందనుందని ఆయన వెల్లడించారు. 2018 మే నెలలో డోపింగ్ ఆరోపణలతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆగస్టులో సంజిత దాఖలు చేసిన ఫిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు... అవార్డు నామినీల కేటగిరీలో సంజిత దరఖాస్తును పరిశీలించాలని అవార్డుల కమిటీని కోరింది. తమ తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని సూచించిన హైకోర్టు ఆమె నిర్దోషిగా బయటపడినపుడు దాన్ని బయటపెట్టాలని పేర్కొంది. -
ఈ సారి ‘అర్జున’ను ఆశిస్తున్నా: సంజిత చాను
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో నిర్దోషిగా బయటపడిన భారత వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజిత చాను కేంద్ర ప్రభుత్వం అందించే క్రీడా పురస్కారం ‘అర్జున’ను ఆశిస్తోంది. 2016 నుంచి ఈ అవార్డు కోసం ప్రయత్నిస్తోన్న తనకు ఈ సారైనా ఈ గౌరవాన్ని అందజేయాలని ఆమె కోరింది. ‘నాలుగేళ్ల క్రితం అర్జున అవార్డు కోసం దరఖాస్తు చేశాను. అప్పుడు తిరస్కరించారు. 2017లో కూడా విస్మరించారు. ఆ తర్వాత డోపింగ్ ఆరోపణలతో నన్ను పక్కన బెట్టారు. కానీ ఈసారి అర్జున వస్తుందని నేను ఆశిస్తున్నా’ అని 26 ఏళ్ల చాను పేర్కొంది. గత నెలలోనే చాను అర్జున దరఖాస్తును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. అయితే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఈ పురస్కారానికి అనర్హులని కేంద్ర క్రీడా శాఖ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. -
సంజిత చాను డోపీ కాదు
న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను డోపీ కాదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది. అమె నమూనాల్లో కచ్చితమైన ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లేకపోవడంతో ఐడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు సంజితపై మోపిన డోపింగ్ కేసును కొట్టివేస్తున్నాం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఈ–మెయిల్లో తెలిపింది. 26 ఏళ్ల మణిపూర్ లిఫ్టర్ 53 కేజీల కేటగిరీలో 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు గెలుపొందింది. అయితే 2017 నవంబర్‌లో అమెరికాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు ఆమె నుంచి నమూనాలు సేకరించారు. సంజిత నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు ఫలితం వచ్చింది. దీంతో ఆమెపై 2018 మేలో సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆమె నిర్దోషినంటూ మొదటి నుంచి వాదిస్తూనే వచ్చింది. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్న చాను తను ఇన్నాళ్లు పడిన మానసిక క్షోభకు ఐడబ్ల్యూఎఫ్ క్షమాపణలు చెప్పాలని, నష్ట పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేసింది. వారి నిర్వాకం వల్ల తను టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీలకు దూరమయ్యానని, దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారని ఆమె ఘాటుగా స్పందించింది. -
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితపై నిషేధం ఎత్తివేత
డోపింగ్ ఆరోపణలతో భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చానుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, విచారణ కొనసాగించాలని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్ణయించింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో సంజిత 53 కేజీల విభాగంలో స్వర్ణం గెల్చుకుంది. దీనికిముందు 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె మూత్ర నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో కామన్వెల్త్ క్రీడల అనంతరం మే 15న నిషేధం విధించారు. అయితే డోపింగ్ పరీక్షలకు సంజిత నమూనాల సేకరణలో జాప్యం చోటుచేసుకుని... కేసు సంక్లిష్టం కావడమే నిషేధం ఎత్తివేతకు కారణంగా తెలుస్తోంది. -
స్త్రీలోక సంచారం
నలుగురు, లేదా అంతకుమించి పిల్లల్ని కనిన స్త్రీల ఆయుష్షు ప్రతి ప్రసవానికీ 6 నెలల నుంచి రెండేళ్ల వరకు తగ్గుతూ పోతుందని ‘సైంటిఫిక్ రిపోర్ట్’ పత్రిక.. ఒక తాజా పరిశోధన ఫలితాన్ని ప్రచురించింది! ఎక్కువమంది సంతానం ఉన్న తల్లుల్లో జీవకణాల క్షీణత వేగవంతమై, వారిని త్వరగా వార్ధక్యంలోనికి నెట్టేయడమే కాకుండా, వారి జీవితకాలాన్ని బాగా తగ్గించేస్తుందని పరిశోధన వెల్లడించింది ::: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అర్థం లేని ప్రశ్నలతో, పలుమార్లు పెద్దగా అరుస్తూ విసిగించిందన్న కారణంగా సి.ఎన్.ఎన్. మహిళా రిపోర్టర్ కైత్లాన్ కాలిన్స్‌పై వైట్ హౌస్ నిషేధం విధించింది! ఈ చర్యపై.. తప్పుడు వార్తల చానల్‌గా ట్రంప్ అభివర్ణించే సి.ఎన్.ఎన్. తో పాటు, ఆయన ఎంతగానో అభిమానించే ‘ఫాక్స్ న్యూస్’కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆ మహిళా రిపోర్టర్‌కు మద్దతుగా నిలబడటం విశేషం ::: ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న మణిపురి వెయిట్ లిఫ్టర్ సంజితా చానూకు జరిపిన డోపింగ్ టెస్టులో ఆమె ఎటువంటి మాదకద్రవ్యాలు వాడలేదని నిర్ధారణ అయినప్పటికీ, ‘ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.డబ్లు్య.ఎఫ్) క్లీన్ చిట్ ఇవ్వకపోవడంపై స్పష్టతను కోరుతూ భారత ప్రధాని కార్యాలయం నుంచి, కేంద్ర క్రీడల శాఖ నుంచి వెళ్లిన లేఖలకు స్పందనగా.. ‘సంజితా చానూ శాంపిల్ కోడ్ నంబరును తమ కార్యాలయ సిబ్బంది పొరపాటుగా నమోదు చెయ్యడం వల్ల రిపోర్టులు తారుమారయ్యాయనీ, నిజానికి సంజిత రిపోర్ట్‌లో ఆమె మాదక ద్రవ్యాలు వాడినట్లు రూఢీ అయిందని ఐ.డబ్లు్య.ఎఫ్. వివరణ ఇవ్వడంతో చానూ అయోమయంలో పడిపోయారు. దాంతో ఆమె ఇప్పుడు యాంటీ–డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించడంపై ఐ.డబ్లు్య.ఎఫ్‌కు సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది ::: ఆరోహీ పండిట్, కీథైర్ మిస్కితా అనే ఇద్దరు భారతీయ యువతులు.. ‘మహి’ అని ముద్దుగా తాము పేరు పెట్టుకున్న అతి చిన్న లైట్ స్పోర్ట్స్ విమానంలో 90 రోజులలో ఈ భూగోళాన్నంతా చుట్టి వచ్చేందుకు మూడు ఖండాలు, 23 దేశాల గుండా 90 రోజులలో 40 వేల కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని పాటియాలాలో శిక్షణ పొందిన ఈ ఇద్దరు పైలట్లు.. మొదట పాటియాలా నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుంచి పాకిస్తా¯Œ గగనతలాన్ని దాటి.. ఇరాన్, టర్కీ, స్లొవేనియా, ఆస్ట్రియా, యు.కె.ల మీదుగా.. మధ్యలో ఉన్న అనేక దేశాలను చుట్టుకుంటూ ఐస్లాండ్, గ్రీన్లాండ్, కెనడా, యు.ఎస్. బేరింగ్ స్ట్రెయిట్, రష్యాల మీదుగా చైనా చేరుకుని, ఆ వరుసలోనే మన్మార్ నుంచి తిరిగి ఇండియా చేరుకుంటారు ::: న్యూఢిల్లీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్’లో మంగళవారం నాడు సుమారు వంద మంది మహిళా జర్నలిస్టులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యవసరంగా, అతి రహస్యంగా ఏర్పాటు చేసిన ‘గెట్ టు గెదర్’ కార్యక్రమానికి ఏ కొలమానాల ఆధారంగా ఆహ్వానాలు అందాయన్న విషయమై పత్రికా ప్రపంచంలో ఇప్పుడు వివాదాస్పదమైన చర్చ సాగుతోంది! ‘ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్’ (ఐ.డబ్లు్య.పి.సి) దృష్టికి రాకుండానే మహిళా జర్నలిస్టులకు ఈ ఆహ్వానాలు ఎవరి ద్వారా, ఎలా వెళ్లాయన్నది దీనిలోని ఒక కోణం అయితే, రాహుల్ గాంధీ వారితో ఏం మాట్లాడారన్నది దానిపై స్పష్టత లేకపోవడం మరో కోణం కాగా, 2019 ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మహిళా జర్నలిస్టులను సన్నద్ధం చెయ్యడమే రాహుల్ ఉద్దేశం అయి ఉంటుందని ప్రతిపక్షాలు ఊహిస్తున్నాయి ::: శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ హిట్ అవడంతో ఇప్పుడు ఆమె చెల్లెలు ఖుషీ (17) మోడలింగ్‌కి స్వస్తి చెప్పి సినిమాల్లోకి వచ్చేయాలని అనుకుంటోంది. ‘‘మీ చిన్నమ్మాయి ఖుషీకి సినిమాల కన్నా, మోడలింగ్ అంటేనే ఇష్టం కదా’’ అని శ్రీదేవిని గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ‘‘అవును. తనకు మోడలింగ్ అంటే ఇష్టమట. ముందు డాక్టర్ అవుతానంది. తర్వాత డాక్టర్ కాదు, లాయర్ అవుతానంది. తర్వాత లాయర్ కాదు, మోడలింగ్ చేస్తానంది. చూడాలి తర్వాత ఏమంటుందో’’ అని నవ్వుతూ అన్నమాట ఇప్పుడు నిజం కాబోతోందన్నమాట. -
నేను తప్పు చేయలేదు: సంజిత
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను తనపై విధించిన నిషేధాన్ని అప్పీలు చేస్తానంటోంది. తాను ఎలాంటి నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడలేదని తెలిపింది. ‘నేను తప్పు చేయలేదు. ఎలాంటి నిషేధిత ఉత్ప్రే రకాలు తీసుకోలేదు. వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య సాయంతో ఈ నిషేధంపై అప్పీలు చేయాలనుకుంటున్నా’ అని ఆమె శుక్రవారం పేర్కొంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచిన సంజితపై తాత్కాలిక నిషేధం విధిçస్తున్నట్లు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం టెస్టోస్టిరాన్ వాడినట్లు సమాఖ్య పేర్కొంది. కాగా... గతేడాది నవం బర్లో అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా చాను నుంచి శాంపిల్స్ సేకరించారు. -
డోపీగా తేలిన సంజిత చాను
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచి సంబరాల్లో ఉన్న భారత వెయిట్ లిఫ్టర్ సంజీత చానుకు భారీ షాక్ తగిలింది. డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో బరిలోదిగిన ఆమె ఓవరాల్‌గా 192 కేజీల బరువెత్తి బంగారు పతకం సొంతం చేసుకుంది. 2014 గ్లాస్గో క్రీడల్లోనూ 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. తాజాగా డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వినియోగించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐడబ్ల్యూఎఫ్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ‘సంజీత చాను నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్) వాడినట్లు రుజువైంది. యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం ఇది నేరం. ఒకవేళ ఆమె డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించలేదని నిరూపితమైతే... సంబంధిత నిర్ణయాన్ని కూడా తిరిగి ప్రకటిస్తాం’ అని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. కాగా డోప్ టెస్టు కోసం శాంపిల్స్‌ను ఎప్పుడు సేకరించారనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పందించేందుకు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధికారులు అందుబాటులో లేరు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్‌కు పయనమైంది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రెండో స్వర్ణం
-
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణం
గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా : కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ రౌండ్లోమూడు అటెంప్ట్‌లలో విజయం సాధించిన సంజిత.. క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలమైంది. అయితే, సంజితకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్ కూడా క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలం కావడంతో భారత్‌కు స్వర్ణ పతకం ఖాయమైంది.