కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ రౌండ్లోమూడు అటెంప్ట్‌లలో విజయం సాధించిన సంజిత.. క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలమైంది.