CWG
-
తెలుగు తేజాలకు సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ అభినందనలు
కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు. కాగా బర్మింగ్‌హామ్‌లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవంలో భారత్‌కు మొత్తంగా 61 పతకాలు లభించాయి. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. బంగారు రోజిది.. భారత బ్యాడ్మింటన్‌కు బంగారు రోజిది. కామన్వెల్త్లో అద్భుత విజయాలు సాధించిన సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. దేశం గర్వపడేలా పతకాలు సాధించిన వారందరికీ నా అభినందనలు. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం Golden day for Indian Badminton! Congratulations to champions @pvsindhu1, @lakshya_sen and @srikidambi for their phenomenal victories at #CWG2022. My heartiest wishes to all the medal winners for making India proud. Keep shining 🇮🇳#Cheer4India — YS Jagan Mohan Reddy (@ysjagan) August 8, 2022 స్వర్ణం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లోనూ ఆమె ఇదే విజయపరంపర కొనసాగించాలి. – కె.చంద్రశేఖర రావు, తెలంగాణ సీఎం CM Sri K. Chandrashekar Rao has expressed happiness over Badminton player @Pvsindhu1 winning Gold in Women's Singles category at the @birminghamcg22. Hon'ble CM congratulated Ms. Sindhu and lauded her effort.#PVSindhu #CommonwealthGames2022 (File Photo) pic.twitter.com/IzyoGjPBQD — Telangana CMO (@TelanganaCMO) August 8, 2022 కాగా, కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలుపొందారు. (చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు) -
CWG 2026: మన పతకాలకు మళ్లీ ఎసరు!
లండన్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్లోనూ భారత్ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్‌ను పక్కన పెట్టేశారు. సీడబ్ల్యూజీలో భారత్‌కు పతకావకాశాలున్న ఈవెంట్లు లేకపోవడంతో మళ్లీ నిరాశనే మిగిలింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే పోటీల్లో షూటింగ్, ఆర్చరీలను నిర్వహించడం లేదు. దీనిపై గతంలోనే భారత్ తమ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చింది. ఒకానొక దశలో ‘బాయ్‌కాట్’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. మొత్తం మీద బర్మింగ్‌హామ్ నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో సంప్రదింపులు జరిపి బుజ్జగించడంతో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకో అడుగు ముందుకేసి రెజ్లింగ్‌ను తప్పించడం భారత శిబిరాన్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే. బహుళ వేదికల్లో... 2026 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్లాండ్ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మాత్రం ఆతిథ్య, ముగింపు వేడుకలకు పరిమితమైంది. టి20 క్రికెట్ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్ (1962), బ్రిస్బేన్ (1982), గోల్ట్‌కోస్ట్ (2018)లలో మెగా ఈవెంట్స్ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్ కామన్వెల్త్ గేమ్స్ పోటీలు కూడా జరిగాయి. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..? -
డోపీగా తేలిన సంజిత చాను
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచి సంబరాల్లో ఉన్న భారత వెయిట్ లిఫ్టర్ సంజీత చానుకు భారీ షాక్ తగిలింది. డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో బరిలోదిగిన ఆమె ఓవరాల్‌గా 192 కేజీల బరువెత్తి బంగారు పతకం సొంతం చేసుకుంది. 2014 గ్లాస్గో క్రీడల్లోనూ 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. తాజాగా డోప్ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వినియోగించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐడబ్ల్యూఎఫ్ గురువారం తన వెబ్సైట్లో పేర్కొంది. ‘సంజీత చాను నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్) వాడినట్లు రుజువైంది. యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం ఇది నేరం. ఒకవేళ ఆమె డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించలేదని నిరూపితమైతే... సంబంధిత నిర్ణయాన్ని కూడా తిరిగి ప్రకటిస్తాం’ అని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. కాగా డోప్ టెస్టు కోసం శాంపిల్స్‌ను ఎప్పుడు సేకరించారనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పందించేందుకు భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధికారులు అందుబాటులో లేరు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్‌కు పయనమైంది. -
హైదరాబాద్ చేరుకున్న సైనా,పీవీ సింధు
-
కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలో నాలుగో రోజు భారత్ పంట పండింది. టేబుల్ టెన్నిస్(టీటీ)లో మానికా బత్రా అండ్ కో స్వర్ణం సాధించింది. టీమ్ ఈవెంట్లో భాగంగా ఆదివారం ఢిపెండింగ్ చాంపియన్ సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా పతకాల సంఖ్య పన్నెండుకు చేరింది. మానికా బత్రా, మౌమా దాస్, మాధురికా పట్కార్, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రాబుదేలతో కూడిన భారత టీటీ జట్టు.. ఏలిన్, వాన్లింగ్ జింగ్, తియాన్వి,మెన్గ్యూ, యిహాన్ జోలతో కూడిన పటిష్టమైన సింగపూర్‌ను మట్టికరిపించింది. అండర్ డాగ్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. అదే ఊపును తుది పోరులో కూడా కొనసాగించిన భారత్ ఏకంగా పసిడిని ఖాతాలో వేసుకుఉంది. దాంతో నాలుగో రోజు ఆటలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు దక్కాయి. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రెండో స్వర్ణం
-
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మళ్లీ స్వర్ణం
గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా : కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ రౌండ్లోమూడు అటెంప్ట్‌లలో విజయం సాధించిన సంజిత.. క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలమైంది. అయితే, సంజితకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్ కూడా క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్‌లో విఫలం కావడంతో భారత్‌కు స్వర్ణ పతకం ఖాయమైంది. -
పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం
-
ఆ రెండు టోర్నీల్లో రాణిస్తా: సింధు
హైదరాబాద్: ‘ఒక సమయంలో ఒకే టోర్నీ గురించే ఆలోచిస్తా. ఇప్పుడు ముందున్నది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. అందుకు ప్రస్తుతం సన్నాహాలు బాగా సాగుతున్నాయి. అక్కడ రాణిస్తానని భావిస్తున్నా. కామన్వెల్త్ క్రీడల్లో గట్టి పోటీ ఉంటుంది. అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలంటే నేను మరింత కష్టపడాలి’ అని పేర్కొంది హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. గతంలో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానంలో నిలిచిన సింధు... ఈ ఏడాది నంబర్‌వన్ ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమని ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడలు వచ్చే నెల 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ప్రారంభం కానున్నాయి. 2014లో గ్లాస్గోలో జరిగిన ఈ క్రీడల్లో సింధు కాంస్యం గెలుచుకుంది. -
కామన్వెల్త్ స్వర్ణ పతకం అపహరణ
మెల్బోర్న్: దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్యూజీ)లో టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో భారత క్రీడాకారుడు దత్తా సాధించిన స్వర్ణ పతకం అపహరణకు గురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న దత్త తన పసిడి పతకం దొంగిలించబడినట్లు మెల్ బోర్న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 12వ తేదీన మూనీ పాండ్స్ లోని తన నివాసంలో ఆ పతకం అపహరించబడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తన సహచర ఆటగాళ్లకు తెలియజేయగా, వారు చాలా అసంతృప్తి చెందినట్లు దత్తా తెలిపాడు. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే టేబుల్ టెన్నిస్ పై మక్కువ పెంచుకున్న దత్తా తరువాత భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ప్రస్తుతం అతను మెల్ బోర్న్ లోని వెల్ నెస్-టేబుల్ టెన్నిస్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ పతకాన్ని బంగారు వస్తువుగా భావించి మాత్రమే అపహరించి ఉంటారని దత్తా తెలిపాడు. ఇది మార్కెట్ లో ఎటువంటి ఆర్థికప్రయోజనాన్ని చేకూర్చదని పేర్కొన్నాడు. ఆ పతకాన్ని తిరిగి పొందితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని దత్తా పేర్కొన్నాడు. 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. -
ఇక రోజువారీ విచారణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ సురేశ్ కల్మాడీ సహా తొమ్మిది మంది ప్రముఖులు నిందితులుగా ఉన్న కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ) కుంభకోణం కేసు విచారణ వేగవంతం కానుంది. కేసును ఏడాదిలోపు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో రోజువారీ విచారణ నిర్వహిస్తామని స్థానిక సీబీఐ కోర్టు ప్రకటించింది. 2010లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల కోసం ఉపయోగించిన టైమింగ్, స్కోరింగ్ అండ్ రిజల్ట్ (టీఎస్సార్) వ్యవస్థ కాంట్రాక్టును అక్రమంగా కట్టబెట్టడంపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై ప్రస్తుతం విచారణ నిర్వహిస్తోంది. టీఎస్సార్ కాంట్రాక్టును అధిక ధరలకు అప్పగిం చడం వల్ల ప్రభుత్వానికి రూ.90 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణను ఏడాదిలోపే పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం మార్చి 10న సీబీఐ కోర్టును ఆదేశించింది. ఇందుకోసం రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. సీబీఐ జడ్జి మధుజైన్ ప్రస్తుతం దర్యాప్తు సంస్థ తరఫు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ కేసు విచారణ గత ఫిబ్రవరిలో మొదలయింది. సిట్టింగ్ ఎంపీ కల్మాడీతోపాటు తొమ్మిది మందిపై నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం తదితర నేరాలతో చార్జిషీటు నమోదు చేశారు. ఈ అభియోగాలు రుజువైతే వీరికి యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది.కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు రావడంతో క్రీడానిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కల్మాడీ, దీని ప్రధాన కార్యదర్శి లలిత్ భానోత్ తదితరులను పదవుల నుంచి తొలగించారు. అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షాస్మృతి ప్రకారం నిందితులందరిపై కేసు లు నమోదయ్యాయి. సీబీఐ చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు వీరందరిపై అభియోగాలను నమోదు చేసింది. వీరంతా బెయిల్‌పై విడుదలయ్యారు.