హైదరాబాద్: ‘ఒక సమయంలో ఒకే టోర్నీ గురించే ఆలోచిస్తా. ఇప్పుడు ముందున్నది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. అందుకు ప్రస్తుతం సన్నాహాలు బాగా సాగుతున్నాయి. అక్కడ రాణిస్తానని భావిస్తున్నా. కామన్వెల్త్ క్రీడల్లో గట్టి పోటీ ఉంటుంది. అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలంటే నేను మరింత కష్టపడాలి’ అని పేర్కొంది హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. గతంలో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానంలో నిలిచిన సింధు... ఈ ఏడాది నంబర్‌వన్ ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమని ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడలు వచ్చే నెల 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ప్రారంభం కానున్నాయి. 2014లో గ్లాస్గోలో జరిగిన ఈ క్రీడల్లో సింధు కాంస్యం గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment